Breaking News

Daily Archives: February 9, 2017

లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొర్రెల పంపిణీకి సంబంధించి లబ్దిదారుల ఎంపికను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గురువారం పశువైద్యుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ గురించి తెలిపారు. గొర్రెలను ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తీసుకురావాలన్నారు. అన్ని గ్రామాల్లో యాదవ, కుర్మ లబ్దిదారులపై సర్వే చేపట్టాలని తెలిపారు.ఇందులో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు ...

Read More »

13, 14 తేదీల్లో విద్యుత్‌ లోకల్‌ కోర్టు

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ వినియోగదారులకు విద్యుత్‌ సేవలకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదులపై ఈనెల 13, 14 తేదీల్లో విద్యుత్‌ కోర్టులు నిర్వహించనున్నట్టు కన్సుమర్స్‌ రిడ్రసల్‌ ఫోరం ఛైర్‌పర్సన్‌ ఎం.ఎ.షరీఫ్‌ తెలిపారు. ఈనెల 13తేదీన బాన్సువాడ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో, 14న ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో లోకల్‌ కోర్టులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆయా సబ్‌ డివిజన్‌ పరిధిలోని వినియోగదారులు తమ ప్రాంతాల్లోని విద్యుత్‌ సమస్యలపైలోకల్‌ కోర్టులో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు ...

Read More »

రూర్బన్‌ పథకంపై కలెక్టర్‌ సమీక్ష

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పథకం అమలుచేయబోతున్న పథకాలకు సంబంధించి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. జుక్కల్‌ మండలానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్న అన్ని శాఖల పథకాలకు సంబంధించి ఈనెల 16వ తేదీలోగా అనుమతించిన పనుల అంచనాల ప్రతిపాదనలను తయారుచేసి అధికారులు తనకు అందజేయాలని సూచించారు. వ్యవసాయ, డైరీ, కో ఆపరేటివ్‌, పంచాయతీరాజ్‌,ఎలక్ట్రిసిటి, పారిశుధ్యం, వుమెన్‌, చైల్డ్‌ వెల్పేర్‌ ఇతర అన్ని శాఖల అధికారులు తమ తమ ...

Read More »

పరిశ్రమల ప్రమోషన్‌ కమిటీ సమీక్ష

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆధ్వర్యంలో మొట్టమొదటి జిల్లా పరిశ్రమల ప్రమోషన్‌ కమిటీ సమీక్షను గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పరిశ్రమలపై అధికారులతో చర్చించారు. పిఎస్‌ఐ పాస్‌ కింద దరఖాస్తు చేసిన 75 అప్రూవల్స్‌పై ఆయన సమీక్షించారు. 75లో 57 దరఖాస్తులకు క్లియరెన్సు ఇచ్చామని, 11 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. 4 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ క్యాటగిరిలో టి ప్రైడ్‌ కింద 29 యూనిట్లకు మంజూరు ...

Read More »

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సాకు చెందిన యువకుడు కనిపించడం లేదని వారికుటుంబీకులు ఫిర్యాదు చేసినట్టు జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు అందినట్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు.ఒరిస్సా రాష్ట్రం బేసంద్‌ గ్రామానికి చెందిన లంకపాటి సహానీ (30) ఇటుక బట్టీలో లేబర్‌గా పనిచేసేందుకు పిట్లం మండలం మద్దెల్‌ చెరువు గ్రామానికి వచ్చాడన్నారు. కొన్నినెలలు పనిచేసిన తర్వాత 2013 అక్టోబరులో తన తోటివారితో కలిసి వెళుతూ కనిపించకుండా పోయారన్నారు. అతను స్వగ్రామానికి చేరుకోలేదని కుటుంబీకులు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ...

Read More »

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా కృష్ణాగౌడ్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా కామారెడ్డికి చెందిన సీనియర్‌ నాయకుడు, బిజెపి మునిసిపల్‌ కౌన్సిర్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోతె కృష్ణాగౌడ్‌ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఉత్తర్వులు జారీచేశారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన కృష్ణాగౌడ్‌ బాల్యం నుంచి ఆరెస్సెస్‌, ఏబివిపి, బిజెపి, బిజెవైఎంలో సేవలందిస్తున్నారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షునిగా, పట్టణాధ్యక్షునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కామారెడ్డి మునిసిపల్‌ కౌన్సిలర్‌గా హైట్రిక్‌గా విజయం సాధించి ప్రస్తుతం ఫ్లోర్‌ లీడర్‌గా కొనసాగుతున్నారు. ఆయన ...

Read More »

షబ్బీర్‌ అలీ సన్మానానికి తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

  గాంధారి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి ప్రతిపక్షనేత ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ సన్మాన కార్యక్రమానికి గాంధారి మండల కాంగ్రెస్‌ నాయకులు గురువారం తరలివెళ్లారు. ప్రాణహిత-చేవెళ్ల ప్యాకెజ్‌-22పై ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించినందుకు సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో షబ్బీర్‌ అలీకి ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టారు. గాంధారి మండల కాంగ్రెస్‌ నాయకులు 50 వాహనాలతో బైక్‌ ర్యాలీగా బయల్దేరారు. వెళ్లిన వారిలో నాయకులు సంగని బాలయ్య, రెడ్డి రాజులు, మదర్‌, గడ ...

Read More »

ఉత్తునూరులో నులిపురుగు నివారణపై అవగాహన ర్యాలీ

  గాంధారి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం ఉత్తునూరు పిహెచ్‌సి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గురువారం నులిపురుగు నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రజల్లో నులిపురుగు నివారణపై అవగాహన కలిగించడానికి ర్యాలీనిర్వహించినట్టు ఉత్తునూరు వైద్యాధికారి షాహెద్‌ అలీ తెలిపారు. 19 సంవత్సరాలలోపు పిల్లలకు నులిపురుగు నివారణ కొరకు ఆల్బండజోల్‌ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త చర్యగా మాత్రలు వేసుకోవాలని షాహెద్‌ అలీ తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »

కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌

  గాంధారి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నులు, నల్లా పన్నల వసూలు కొరకు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుంది. రెండోరోజు స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ముదెల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేశారు. ఈసందర్బంగా పన్నుల వసూలు రూపంలో రూ. 22,641 వచ్చినట్టు ఇవో పిఆర్‌డి ఆనంద్‌ తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఇంటికి సంబంధించిన పన్నులు చెల్లించాలని,లేనిచో కోర్టు నుండి నోటీసులు అందజేస్తామన్నారు. వందశాతం పన్నుల వసూలే లక్ష్యంగా ...

Read More »

పలు తాండాల్లో ఎక్సైజ్‌దాడులు

  – ఇద్దరిఅరెస్టు గాంధారి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని పలు తాండాల్లో ఎక్సైజ్‌ శాఖాధికారులు గురువారం దాడులు చేపట్టారు. మండలంలోని రాంపూర్‌ గడ్డ, గండివేట్‌ తాండాల్లో దాడులు నిర్వహించి నాలుగు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 400 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసంచేసినట్టుఎల్లారెడ్డి ఎక్సైజ్‌ సిఐ ఏఎల్‌ఎన్‌.స్వామి తెలిపారు. గండివేట్‌ తాండా మత్తడివాగుసమీపంలో వ్యవసాయ భూమిలో నాటుసారా కాస్తున్నట్టు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి అజ్మీరా రవి, రమావత్‌ లతలను అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు ...

Read More »

విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

  గాంధారి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం ఇస్కిల్‌ గుట్ట తాండాలో రాజరాజేశ్వరస్వామి, శివ పంచాయతన జగదాంబ, దుర్గాదేవి ధ్వజశిఖర ప్రతిష్ట, సేవాలాల్‌ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఉత్సవాలు మూడురోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండోరోజు గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దేవతా మూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు. హోమం కార్యక్రమంలో పాల్గొని వేదపండితుల ఆశీర్వచనాలు పొందారు. ఆలయ అభివృద్ది కొరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. శుక్రవారం ...

Read More »

నులి పురుగుల నివారణ దినోత్సవంపై అవగాహన

  బీర్కూర్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో గురువారం తహసీల్దార్‌డేవిడ్‌ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులచే నులిపురుగు నివారణ దినోత్సవం, మందుల పంపిణీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలలోపు విద్యార్థులందరికి నులిపురుగుల మందులు వేయాలని గ్రామ ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. శరీరంలో నులిపురుగులు ఉంటే పిల్లల ఎదుగుదల సరిగా ఉండదని, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నులిపురగు నివారణ మందులను తప్పకుండా వాడాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం ...

Read More »

సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ గ్రామంలో గురువారం బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్తు తెలియని నెంబరు నుంచి వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌ను స్వీకరించవద్దని ఆయన సూచించారు. బంపర్‌ డ్రాలో గెలుపొందినట్టు వచ్చే మెసేజ్‌లు పట్టించుకోవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు అకౌంట్‌ నెంబరు, ఎటిఎం పిన్‌ నెంబరు అడిగితే ఎటువంటి సమాచారం ఇవ్వద్దని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ గోపి, ఏబివిపి నాయకుడు ...

Read More »

ట్రాక్టర్‌, బైక్‌ఢీ

  – ఇద్దరికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం బీర్కూర్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని కంశెట్‌పల్లి గ్రామ మూల మలుపు వద్ద ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ గోపి కథనం ప్రకారం…. వర్ని మండలం జల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, బీర్కూర్‌ తాండాకు చెందిన పికారాం అనే వ్యక్తులు ఏపి 25 ఎడి 8201 బజాజ్‌ డిస్కవరీ బైక్‌పై టివి రిపేరు నిమిత్తం నసురుల్లాబాద్‌ నుండి బాన్సువాడ వైపు వెళుతుండగా బాన్సువాడ ...

Read More »

నాకు రాజకీయాలే వద్దు!

గతంలో జయకు శశికళ లేఖ..బయటపెట్టిన పన్నీర్‌   2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు గెంటివేశారు. ఆ సమయంలో తనను క్షమించాలంటూ శశికళ జయలలితకు లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖను పన్నీర్‌ సెల్వం బయటపెట్టారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘మా బంధువులు, మిత్రులు కొంతమంది నేను పోయ్‌సగార్డెనలో కలిసి ఉంటున్న సమయంలో నా పేరుని వాడుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అన్నాడీఎంకేకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు. అంతేకాకుండా మీకు(జయలలిత) వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారు. ఇవన్నీ నాకు తెలియకుండానే ...

Read More »

హార్వర్డ్‌ వర్సిటీ సదస్సుకు పవన్‌

హార్వర్డ్‌ యూనివర్సిటీ సదస్సులో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం అమెరికా చేరుకున్నారు. గురువారం నుంచి 12 వరకు వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రముఖులు, ఐటీ నిపుణలతో చర్చిస్తారు. మొదట న్లూక్లియర్‌, యాంటి న్యూక్లియర్‌ ప్రొఫెసర్‌ హెన్రీలీతో భేటీ అవుతారు. తదుపరి ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ కోర్సులు నిర్వహిస్తున్న ఈడీఎక్స్‌ సంస్థ సీఈవో అనంత అగర్వాల్‌తో టెక్నికల్‌ అంశాలపై చర్చిస్తారు. అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు, ప్రవాసాంధ్రురాలు లత మంగిపూడితో సమావేశం కానున్నారు. చివరగా హార్వర్డ్‌ వర్శిటీలో ‘బికమింగ్‌ జనసేనాని’ అనే అంశంపై పవన్‌ ...

Read More »

హెచ్‌1-బి వీసాలపై ఆంక్షలొద్దు..

ట్రంప్‌ను కోరిన స్టార్టప్స్‌ వాషింగ్టన్‌: అమెరికా జారీ చేసే హెచ్‌1-బి వీసాలపై ఆంక్షల పట్ల అక్కడి టెక్నాలజీ స్టార్టప్‌ కంపెనీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి ఆంక్షల వల్ల నష్టమే తప్ప లాభం జరగబోదన్న అభిప్రాయాన్ని కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. హెచ్‌1-బి వీసాలపై ఎలాంటి కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయవద్దని 100కు పైగా స్టార్టప్‌ కంపెనీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి ఆదేశాల వల్ల స్టార్టప్‌ కమ్యూనిటీపైనేకాకుండా అమెరికా పోటీతత్వంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని సూచించాయి. జాతి సంరక్షణ, ...

Read More »

ఏడు శృంగార బొమ్మలతో.. ఓ వ్యక్తి సహజీవనం

బీజింగ్: ఓ వ్యక్తి ఏడు శృంగార బొమ్మలతో గత కొన్నేళ్ళుగా కలిసి జీవిస్తున్నాడు. తన కుటుంబ సభ్యుల మాదిరిగా వాటితో ఆయన మెలుగుతున్నాడు. చైనాకు చెందిన 58 ఏళ్ళ లీ చెన్ 2010లో తన ప్రేయసితో కలిసి విహార యాత్రకు వెళ్ళాడు. ఓ చోట సెక్స్ డాల్స్‌ను చూసి వాటి అందానికి ఫిదా అయ్యాడు. ప్రేయసి కూడా వాటిని బాగా ఇష్టపడటంతో కొనుగోలు చేశాడు. 2014లో ప్రేయసి అతడికి దూరమైంది. నాటి నుంచి లీ చెన్ శృంగార బొమ్మలతో అనుబంధాన్ని మరింత పెంచుకున్నాడు. అయితే ...

Read More »

మాజీ భర్తతో శృంగారం తర్వాత.. ఆమె ఏం చేసిందో తెలుసా?

బర్మింగ్‌హామ్: మాజీ భర్తతో శృంగారంలో పాల్గొన్న ఆమె ఆ తర్వాత ఉన్మాదిగా మారింది. కత్తితో అతడి పొట్టలో పొడిచి పేగులు బయటకు తీసింది. ఈ దారుణం బ్రిటన్‌లో జరిగింది. బర్మింగ్‌హామ్‌కు చెందిన డాల్యా సయీద్, మాజీ భర్త బిలాల్ మహ్మద్‌తో నాలుగు గంటల పాటు చాలా సంతోషంగా గడిపింది. అతడితో శృంగారంలో కూడా పాల్గొంది. ఆ తర్వాత ఒక్కసారిగా కత్తితో అతడి పొట్టలో పొడిచింది. పేగులు బయటకు తీసి ఓ భాగాన్ని కత్తిరించి పారేసింది. వెంటనే ఆ షాక్ నుంచి తేరుకున్న మాజీ భర్త ...

Read More »