‘సౌదీ చెర నుంచి మమ్మల్ని విడిపించండి’

సౌదీ: ‘పొట్టకూటి కోసం, అప్పులు తీర్చడం కోసం తండ్రీకొడుకులం సౌదీకి వలస వచ్చాం. నిబంధనల ప్రకారం బాండ్ రాశాం. తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాం. జీతాలకు సంబంధించిన బాకీలు ఇంకా ఇవ్వడం లేదు. తిండి లేక చస్తున్నాం. దయచేసి మమ్మల్ని కాపాడండి’.. అంటూ ఓ భారతీయుడు ట్విటర్ వేదికగా భారత ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఓ సిక్కు.. సౌదీ అరేబియాలో తమ పరిస్థితి గురించి భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో వీడియో పంపాడు. పేరు, కంపెనీ వివరాలను వెల్లడించిన ఆ వ్యక్తి.. తనకు కంపెనీ నుంచి 35 వేల సౌదీ రియాల్స్ (6 లక్షల రూపాయలు), తన  కుమారుడికి 17వేల రియాల్స్ (3 లక్షల రూపాయలు) రావాల్సి ఉందని తెలిపాడు. ఈ బకాయిలను ఇచ్చేందుకు యజమానులు ఒప్పుకోవడం లేదనీ, కష్ట పడి సంపాదించిన సొమ్ము, కుటుంబ కష్టాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందనుకుంటే ఇలా పరిస్థితి మారిపోయిందని, తమను ఈ గండం నుంచి గట్టెక్కించాలని కోరాడు. అతడి ఆవేదనకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చలించిపోయారు. ‘మీ వెంట మేం ఉన్నాం. మా మద్దతు మీకెప్పుడూ ఉంటుంది. ధైర్యంతో ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. సౌదీలోని భారతీయ ఎంబసీ అధికారులకు తక్షణమే ఆదేశాలు పంపారు. అతడి గురించి వివరాలు సేకరించి భారత్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలనీ, కంపెనీతో మాట్లాడి జీతాన్ని ఇప్పించాలని ఆదేశించారు.

Check Also

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ ...

Comment on the article