Breaking News

Daily Archives: February 11, 2017

బీర్కూర్‌కు బిసి సంక్షేమ బాలుర వసతి గృహం మంజూరు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రతిపాదించిన జిల్లా వెనకబడిన బాలుర వసతి గృహాన్ని బీర్కూర్‌ మండలానికి మంజూరు చేసినట్టు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్దిఅధికారి దేవిదాస్‌ అన్నారు. 2017 జూన్‌ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆయనతెలిపారు. శనివారం బీర్కూర్‌ గ్రామంలో రెండు, మూడు భవనాలను తాత్కాలికంగా వసతి గృహం భవనాన్ని పరిశీలించారు. నివేదికలు ఉన్నతాదికారులకు పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్వామి, సుధాకర్‌, రాములు, గ్రామ సర్పంచ్‌ నర్సయ్య, తదితరులున్నారు.

Read More »

చెరువులో జారిపడి వృద్దుడి మృతి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని చించొల్లి గ్రామ తుర్కకుంట చెరువులో అదే గ్రామానికి చెందిన బస్వయ్య (78) ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్టు ఎస్‌ఐ రాజ్‌భరత్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి జారిపడి ఉంటాడని భావిస్తున్నారు. శవాన్ని వెలికితీసి బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ అన్నారు.

Read More »

కామారెడ్డి జిల్లా గేయం అభినందనీయం

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రాంతంపై అభిమానంతో జిల్లాలోని విశేషాలను, చరిత్రను రూపొందించి జిల్లా గేయం రచించిన యువకులను తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో అభినందించారు. శనివారం కామారెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాలలో తెరవే ఆధ్వర్యంలో జిల్లా గేయాన్ని రూపొందించిన యువకులు చక్రధర్‌గౌడ్‌, నితిన్‌ తిరుమల, రవిందర్‌లను అభినందిస్తూ సభ నిర్వహించారు. కార్యక్రమంలోప్రముఖ కవులు సూరారం శంకర్‌, అయాచితం నటేశ్వరశర్మ, తెరవే జిల్లా అధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌లు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా విశేషాలు, చరిత్ర, సంస్కృతిని ...

Read More »

కామారెడ్డి జిల్లాలో 30 యాక్టు అమలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 30 యాక్టు అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ శ్వేత ప్రకటనలో తెలిపారు. పోలీసుల నుంచి అనుమతి లేకుండా బహిరంగ సభలు, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజలకు అభ్యంతరం కలిగించే పనులు, ప్రభుత్వ వ్యతిరేక పనులు చేస్తే 30 యాక్టు కింద వారు శిక్షార్హులవుతారని పేర్కొన్నారు. ఈనెల 11 నుంచి 28వ తేదీ వరకు 30 యాక్టు అమలులో ఉంటుందన్నారు.

Read More »

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సిఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో 1991-92లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకచోట కలిసి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పాఠశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు సంతోస్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో దేవదాసు, వరలక్ష్మి, సలోని, ఇమానుయల్‌, 60 మంది విద్యార్థులు, 20 మంది ...

Read More »

బోరు మోటారు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 22వ వార్డు ఇస్లాంపుర కాలనీలో శనివారం బోరు డ్రిల్లింగ్‌ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌సాధారణ నిధులులక్ష రూపాయలతో బోరు తవ్వకం పనులు చేపట్టినట్టు తెలిపారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని వార్డులో బోరు తవ్వకం పనులు చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తయ్యబ్‌, అంజద్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

అనాధాశ్రమానికి జిరాక్సు మిషన్‌ అందజేత

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన ఎస్‌-3 కంప్యూటర్‌ యజమాని శ్యాంయాదవ్‌ దోమకొండ అనాధాశ్రమానికి శనివారం జిరాక్సు మిషన్‌ విరాళంగా అందజేశారు. 12 వేల విలువగల మిషన్‌ను అనాథ పిల్లల చదువు నిమిత్తం అందజేసినట్టు శ్యాం తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకుడు సంపత్‌మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం, అనాథ విద్యార్థుల కోసం సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలన్నారు.

Read More »

బిజెపి ఆధ్వర్యంలో దీన్‌దయాళ్‌ సమర్పణ దివస్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శనివారం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ బలిదాన సమర్పణ దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.పండిత దీన్‌దయాళ్‌ 1916లో జన్మించి ఏకాత్మతా- మానవతా విధానాన్ని అనుసరించాలని చెప్పారన్నారు. బిజెపి మూల సిద్ధాంతం, జనసంఘ్‌స్థాపకులలో దీన్‌దయాళ్‌ ఒకరని పేర్కొన్నారు. పార్టీని విస్తరించడానికి విస్తృత పర్యటనలు చేశారని ఈ క్రమంలో 1968 ఫిబ్రవరి11న ఆయన్ను హత్యచేశారని చెప్పారు. ఆయన ఆశయాలను, క్రమశిక్షణను నాయకులు, కార్యకర్తలు స్పూర్తిగా ...

Read More »

లోక్‌ అదాలత్‌లో 144 కేసుల పరిష్కారం

  కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో శనివారం నిర్వహించిన లోక్‌అదలత్‌లో 144 కేసులకు పరిస్కారం లభించినట్టు లోక్‌అదాలత్‌ ప్రతినిధులు తెలిపారు. చిన్నపాటి సమస్యలతో కోర్టుకు వచ్చి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టు తిరుగుతూ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో లోక్‌ అదాలత్‌ ఏర్పాటు చేశారు. కక్షి దారులు కోర్టుబయట లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించేందుకు లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌లో 144 కేసులకు పరిష్కారం లభించింది. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Read More »

పార్టీ కోసం విరాళాల సేకరణ

  గాంధారి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో భారతీయ జనతాపార్టీ ఆదివారం విరాళాలు సేకరించే కార్యక్రమం ప్రారంభించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేరెళ్ల ఆంజనేయులు తనవంతు విరాళాన్ని మండల బిజెపి నాయకులకు అందజేశారు. ఈనెల 16వ తేదీ వరకు విరాళాల సేకరణ కొనసాగుతుందని మండల పార్టీ అధ్యక్షుడు సాయిబాబా తెలిపారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిస్టం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. విరాళాలు సమర్పించిన వారికి సంబంధిత రసీదులు ...

Read More »

ఆదివారం బి.బి.హన్మంత్‌రావు పాటిల్‌ అంత్యక్రియలు

  గాంధారి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఎంపి బి.బి.పాటిల్‌ పెద్ద అన్నయ్య హన్మంత్‌రావు పాటిల్‌ శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు స్వగృహం మద్నూర్‌ మండలం సిర్పుర్‌లో ఆదివారం నిర్వహించనున్నారు.

Read More »

ఆదివారం రాంలక్ష్మణ్‌పల్లి వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవం

  గాంధారి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం రాంలక్ష్మణ్‌పల్లి వేణుగోపాలస్వామి ఆలయ 3వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్టు ఉపసర్పంచ్‌ ఆనంద్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా రాంలక్ష్మణ్‌పల్లి ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, జాతర ఉంటుందన్నారు. హైదరాబాద్‌ పూజా ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ రాంసింగ్‌, ప్రేమలత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఉంటుందన్నారు. కార్యక్రమానికి మండలంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆనంద్‌రావు కోరారు.

Read More »

ఘనంగా ఎల్లమ్మ పండుగ ఏర్పాట్లు

  నందిపేట, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఖుదావన్‌ గ్రామ సమీపంలోగల శ్రీరేణుకామాత ఎల్లమ్మ దేవి ఆలయం వద్ద ఆదివారం జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం ఆలయానికి విచ్చేస్తున్నారు. కాగా ఇందులో భాగంగా తెరాస నాయకులు, కార్యకర్తలు గత వారంరోజుల నుండి ఏర్పాట్లలో నిమగ్నమైఉన్నారు. శనివారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆలయం వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ...

Read More »

నేడు కాలేజ్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ పరీక్ష

  గాంధారి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఆదివారం కాలేజ్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ ప్రవేశ పరీక్ష ఉంటుందని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ బలరాం తెలిపారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరానికి ప్రవేశ పరీక్ష కొరకు ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు స్థానిక గురుకుల కళాశాల ఆవరనలో జరిగే పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ ...

Read More »

గాంధారిలో ప్రయివేటు ఆసుపత్రి ప్రారంభం

  గాంధారి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఓ ప్రయివేటు ఆసుపత్రిని శనివారం తెరాస నాయకులు, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్‌ ప్రారంభించారు. శ్రీసాయి ఆసుపత్రి, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, వాసవి మెడికల్‌ దుకాణాలను ఈ సందర్భంగా ఆయన రిబ్బన్‌ కట్‌చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. ఆయన వెంట స్థానికసర్పంచ్‌ సత్యం, ఎంపిటిసి రాంకిషన్‌రావు, ఆసుపత్రి యాజమాన్యం ఉన్నారు.

Read More »

 “మర్యాద-స్థాయి”

  “మర్యాద-స్థాయి” అనేవి ఎవరికి వారు ప్రకటించుకునేవి కాదు, ఎదుటి వారు మనలో డబ్బు, అంతస్తు, బలగం ఇవేవి కాక కేవలం మన గుణం చూసి మనకు ఇచ్చేవి, “మర్యాద-స్థాయి”. మన గుణం గుర్తింపు పొందే అంత స్థాయి కలిగి ఉన్నప్పుడు మనం పొందేది మర్యాద, అది ఇచ్చేది మన గుణం యొక్క స్థాయి. అటువంటి గుణం పొందడానికి సంస్కారం అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోదు, సంస్కారం అలవర్చుకోవాలి. నూటికి తొంభై శాతం చదివో వినో సంస్కారం గురించి తెలుసుకుని సంస్కారం పొందేశాము అనుకుంటారు,. ...

Read More »

వరకట్నాగ్నికి వధువులు సమిధలా!

పెళ్లిఅయిన కొద్ది రోజుల్లోనే వధువ్ఞ వంటింట్లో అగ్ని ప్రమాదానికి గురికావడం కొన్ని సంఘటనల్లో సజీవ దహనం కావడం,మరికొన్ని సంఘటనల్లో తీవ్రంగా గాయపడడం, ఆ తర్వాత ఆస్పత్రిలో మృతిచెందడం ఈ సంఘ టనలపై అనుమానాలు ఈవిధంగా దేశంలో ఎన్నో అనుమానాస్పద మరణాలు వధువ్ఞల పాలిట కన్పిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ మరణాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇవన్నీ కూడా గృహహింస కింద,వరకట్నం చావులకింద చివరకు నిర్ధారణ అవ్ఞతు న్నాయి. భర్త, అత్తమామల వల్ల వేధింపులకు గురి కావడం, ఆ తర్వాత హత్యకు దారితీయడం ...

Read More »

ఇక రజనీ రాజకీయం!

సూపర్‌స్టార్‌తో సంఘ్‌ నేత గురుమూర్తి భేటీ  సొంత పార్టీ పెట్టాలని సూచన  ఆధ్యాత్మిక ‘పవర్‌’ గురించి మాట్లాడుతున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత అసలు సిసలైన ‘పొలిటికల్‌ పవర్‌’ వైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలని బీజేపీ ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం. ‘‘తమ పార్టీ సీఎం అభ్యర్థిగా రజనీని తెరపైకి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’’ అని తమిళనాడుకు చెందిన ఒక నాయకుడు తెలిపారు. అయితే… రజనీ స్వయంగా కొత్త పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ ...

Read More »

బంగారం రూ.400 డౌన్‌

మూడు వారాల కనిష్ఠ స్థాయి బులియన్‌ మార్కెట్‌ మరోసారి మూడు వారాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. అంతర్జాతీయ విపణి నుంచి అందిన బలహీన సంకేతాలతో పాటు దేశీయంగా ఆభరణాల వర్తకుల నుంచి డిమాండు తగ్గడంతో శుక్రవారం ఒక్క రోజులోనే పది గ్రాముల బంగారం దేశ రాజధానిలో 400 రూపాయల మేరకు పడిపోయి 29,500 స్థాయికి వచ్చింది. ఇది మూడు వారాల కనిష్ఠ స్థాయి. జనవరి 16 తర్వాత బంగారం ఇంత కనిష్ఠ స్థాయికి రావడం ఇదే ప్రథమం. మొత్తం మీద న్యూఢిల్లీలో మేలిమి బంగారం ...

Read More »

ఆయన చనిపోయి బతికాడు!

మృతి చెందినట్టు స్విమ్స్‌ ప్రకటన ఇంటికొచ్చాక శరీరంలో కదలిక హుటాహుటిన ఆసుపత్రికి.. కోలుకున్న రోగి  స్విమ్స్‌ డాక్టర్లు చనిపోయాడని ప్రకటించారు.. కుటుంబికులు, బంధువులు ఘొల్లుమంటూ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆయనలో కదలిక వచ్చింది.. అందరిలో ఓవైపు భ యం..మరోవైపు ఆశ్చర్యం..ఆనందం..అంతలోనే తేరుకొని ఓ వైద్యుడిని పిలిపించారు..ఆయన పరీక్షించి పల్స్‌ సాధారణంగానే ఉందని తెలిపారు..క్షణం ఆలస్యం చేయకుం డా ఆయనను ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నారు.. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు స్థానికుల కథనం మేరకు.. ఆర్టీసీ కండక్టర్‌ ...

Read More »