Breaking News

రూ. 4.5 లక్షల విలువగల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

 

– ఐదుగురి అరెస్టు

కామారెడ్డి, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం రూ. 4.5 లక్షల విలువగల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు కామారెడ్డి డిఎస్పీ ప్రసన్నరాణి తెలిపారు. జిల్లా కేంద్రంలో పక్క సమాచారం మేరకు పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్‌, ఎస్‌ఐ రాజు సిబ్బందితో కలిసి దర్శన్‌ థియేటర్‌ వద్ద వాహనాలు తనికీలు నిర్వహిస్తుండగా ఎపి 23 యు 6520 ఆటో వాహనం తనికీ చేయగా అందులోంచి నాలుగు సంచుల గుట్కా ప్యాకెట్లు లభించినట్టు తెలిపారు. ఆటోలో వారిని విచారించగా మెదక్‌కు చెందిన ఎం.డి.బాబు, ఎం.డి. రహమత్‌ అలీగా చెప్పారు. వీరిని తీసుకెళ్లి విచారించగా మెదక్‌కు చెందిన సాయిదీప్‌ సూపర్‌స్టోర్‌ యజమాని రమేశ్‌ వద్ద తాము పనిచేస్తున్నట్టు తెలిపారన్నారు. రమేశ్‌ ప్రతిరోజు గుట్కా సంచులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని కామారెడ్డికి తమ ద్వారా పంపిస్తున్నట్టు చెప్పారన్నారు. ఆదివారం కామారెడ్డిలో శ్రీనివాస్‌, సందీప్‌, కిరణ్‌లకు అమ్మినట్టు చెప్పారు. 50గుట్కా సంచులు రికవరీ కాగా వీటి విలువ సుమారు రూ. 4.5 లక్షలు ఉంటుందన్నారు. కేసుకు సంబంధమున్న రమేశ్‌, బాబా, రహమత్‌, శ్రీనివాస్‌, సందీప్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. సమావేశంలో డిఎస్పీతో పాటు ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్‌, ఎస్‌ఐ రాజు, సిబ్బంది ఉన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article