Breaking News

Daily Archives: February 17, 2017

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 63వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీర్కూర్‌ మండలంలో ఎంపిపి మల్లెల మీణ హన్మంతు ఆద్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. నసురుల్లాబాద్‌ మండలంలో గ్రామ సర్పంచ్‌ అరిగెసాయిలు ఆధ్వర్యంలో కెసిఆర్‌ జన్మదిన వేడుకలు జరిపారు. కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. బంగారు తెలంగాణ కెసిఆర్‌ ఆధ్వర్యంలో సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

శనివారం మంత్రి పర్యటన విజయవంతం చేయాలి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌ మండలంలో శనివారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారని గ్రామ సర్పంచ్‌ దూలిగె నర్సయ్య, మండల తెరాస నాయకులు హన్మంతు తెలిపారు. కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు పెద్ద సంక్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మండలంలో 30 లక్షలతో నిర్మించిన స్త్రీశక్తి భవనం ప్రారంభిస్తారని, అలాగే 10 లక్షలతో నిర్మించనున్న మున్నూరుకాపు సంఘ భవనానికి భూమిపూజ చేస్తారని తెలిపారు. బీర్కూర్‌ గ్రామంలోగల బస్టాండ్‌లో సిసి ...

Read More »

ఎస్సీ, ఎస్టీ రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని హరిజన, గిరిజన, వెనకబడిన తరగతుల అల్పసంఖ్యాకవర్గాల అభ్యర్థుల నుంచి సొంత కారు నడుపుకోవడానికి సబ్సిడీతో రుణాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా గిరిజనసంక్షేమాధికారి గంగాధర్‌ తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 15వ తేదీ నుంచి 28 వరకు స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తుదారుడు కామారెడ్డి జిల్లా స్థానికుడై ఉండాలని, 8వ తరగతి ఉత్తీర్ణుడై 10 వ తరగతి పాస్‌, లేదా ఫెయిల్‌ అయిన వారికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు. అబ్యర్థుల ...

Read More »

కోడిగుడ్ల సరఫరాకు టెండర్ల ఆహ్వానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిజిల్లాలోని 5 ఐసిడిఎస్‌ల ప్రాజెక్టుల పరిధిలోని 1193 అంగన్‌వాడి కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం నెక్‌ రిజిష్టర్ట్‌ పౌల్ట్రీ ఫారాలనుండి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సంవత్సర కాలపరిమితికి గాను టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. బిడ్‌ ఆఖరి తేదీ ఈనెల 18 వరకు ఉండగా మరో ఐదురోజులు పొడిగించినట్టు తెలిపారు. ఈనెల 23 వరకు బిడ్‌లుస్వీకరిస్తామని తెలిపారు. జిల్లాలోని ఐదు ఐసిడిఎస్‌ ప్రాజెక్టులకు కందిపప్పు ...

Read More »

వినియోగదారులకు హక్కులపై అవగాహన ఉండాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులకు తమకున్న హక్కులపై అవగాహన ఉండాలని అరుణోదయ మహిళ వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు బొమ్మెరసువర్ణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వినియోగదారుల చైతన్య సదస్సుకు సువర్ణతోపాటు వినియోగదారుల సంఘాల వ్యవస్థాపకులు బాస రాజేశ్వర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు మోసపోయిన పక్షంలో వారు వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. వినియోగదారులు తాము కొంటున్న ప్రతి వస్తువుకు బిల్‌ అడగవచ్చి, ప్రతి కొనుగోలుకు సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చని ...

Read More »

ఇంటర్‌ పరీక్షలకు సన్నద్దం కండి

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి పరీక్షలకు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ చాంబరులో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోమొదటి సంవత్సరం 10 వేల మంది, రెండో సంవత్సరం 8500 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు తెలిపారు. ఇందుకోసం జిల్లాలో ...

Read More »

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం సిఎం కెసిఆర్‌ జన్మదిన వేడుకలు తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డిలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేసన్‌ ఆద్వర్యంలో అన్నదానం, రక్తదానం నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. ...

Read More »

ఘనంగా సిఎం జన్మదిన వేడుకలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో తహసీల్దార్‌ ఎండి.అబ్దుల్‌ గనిఖాన్‌, ఎంపిడివో రాములు నాయక్‌ సిఎం కెసిఆర్‌ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌కట్‌ చేసి అందరికి పంచిపెట్టారు. తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొని మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పలు అభివృద్ది పనులు జరుగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ సయ్యద్‌ హుస్సేన్‌, ఎంపిపి సునంద, సర్పంచ్‌ బేగరి రాజు, మండల ఉపాధ్యక్షుడు పండరి, ...

Read More »

బాన్సువాడలో స్పెషల్‌ డ్రైవ్‌

  బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని వ్యాపార సముదాయాలు, భవన పన్నుల వసూళ్ళపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆదాయం, అభివృద్ది ప్రజల నుంచి వచ్చే ఇంటిపన్ను, దుకాణాల పన్నులపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు సకాలంలో తమతమ బకాయి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శులు రమేశ్‌, రాము, దుర్గాప్రసాద్‌, అనిత, దత్తురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More »

మాగి పాఠశాల ఆకస్మిక తనికీ

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను ఎంఇవో బలిరాం రాథోడ్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం కూడా పరిశీలించారు. మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని వంట ఏజెన్సీలకు ఆయన సూచించారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు ఎంతో చక్కగా ఉన్నాయని అభినందించారు.

Read More »

మంగుళూరు చెరువు నుండి నీటి మళ్ళింపు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మంగుళూరు గ్రామంలో ఊర చెరువు నుంచి అక్రమంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లీస్తున్నారు. ఊరచెరువులోగల నీటిని గ్రామంలోని పశువులకు ఉపయోగించేందుకు తప్ప పంటపొలాలకు వినియోగించవద్దని సూచించడంతో చెరువుకింద ఉన్న 70 ఎకరాల ఆయకట్టు బీడు భూములుగానే ఉన్నాయి. చెరువు కింద ఉన్న ఆయకట్టు రైతులే నీటిని వినియోగించుకోకుండా ఉన్నారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చెరువులో మోటారు బిగించి అక్రమంగా నీటిని మళ్ళీస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ ...

Read More »

ఇంటి పన్నువసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బూర్గుల్‌ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప ఇంటి పన్ను వసూలుకోసం స్పెషల్‌ డ్రైవ్‌నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ పన్ను వసూలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో 9564 రూపాయలు వసూలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. మిగతా వసూలు కోసం తిరిగి గ్రామంలో శనివారం పర్యటిస్తామన్నారు. ఆయన వెంట కారోబార్‌ సాయిలు, తదితరులున్నారు.

Read More »

విద్యార్థులకు వైద్య పరీక్షలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎస్సీ వసతి గృహంలో ఆరోగ్యకేంద్రం వైద్యురాలు స్పందన వైద్యపరీక్షలు నిర్వహించారు. వసతి గృహంలోని 130 మంది విద్యార్తుళకు వైద్య పరీక్షలు చేశారు. సుమారు 90 మందికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. స్వచ్చమైన తాగునీటిని తాగాలన్నారు. ఆమె వెంట ఏఎన్‌ఎం ఫర్జానా ఉన్నారు.

Read More »

ఉపాధి హామీ పనుల పరిశీలన

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గాలిపూర్‌, మక్దుమ్‌పూర్‌ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎపివో సుదర్శన్‌ శుక్రవారం పరిశీలించారు. అటవీ ప్రాంతంలో చేస్తున్న కందకాల తవ్వకం పనులను వారు పరిశీలించారు. పనులు నాణ్యతతో కొలతల ప్రకారం చేయాలని కూలీలకు సూచించారు. ఫిబ్రవరి నెలలో వందరూపాయల కూలీ పనులు చేసి ప్రభుత్వం 20 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారు. మార్చినెలలో 100 రూపాయలు పనులు చేస్తే 25 రూపాయలు అదనంగా చెల్లిస్తుందన్నారు. ఏప్రిల్‌, మే నెలలో 100 ...

Read More »

గాంధారిలో భూసార పరీక్షలు

  గాంధారి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంతోపాటు గుజ్జుల్‌ గ్రామాల్లో శుక్రవారం వ్యవసాయ శాఖాధికారులు భూసార పరీక్షల కొరకు మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లోని మట్టిని సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబులకు తరలించారు. మండలంలోని ప్రతి రైతు తమ పంట పొలాల్లోని భూమికి బూసార పరీక్షలు నిర్వహించుకోవాలని ఎఇవోలు ప్రసాద్‌, అబ్దుల్‌ ఖలీల్‌, మహేందర్‌, స్వాతిలు రైతులకు సూచించారు.

Read More »

కెసిఆర్‌ను కలిసిన తెరాస శ్రేణులు

  గాంధారి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కెసిఆర్‌ జన్మదినం సందర్భంగా మండలానికి చెందిన తెరాసనాయకులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కెసిఆర్‌ను కలిసి పష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపి ఆయన ఆశీస్సులు పొందారు. సిఎంను కలిసిన వారిలో ప్రముఖ తెరాస నాయకులు, రాష్ట్ర నాయకులు, కాంట్రాక్టర్‌ సత్యం పటేల్‌ తదితరులున్నారు.

Read More »

విజ్ఞాన్‌ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం

  గాంధారి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని విజ్ఞాన్‌ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులు స్వయం పాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలతో దిగువ తరగతి విద్యార్థులు పాఠాలుబోధించారు. ఒక్కొక్కరు వారికి ఇష్టమైన ఒక్కో సబ్జెక్టును ఎంచుకొని పాఠాలు బోధించారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఆవరణలో ఫోటోలు దిగారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం రాజీవ్‌, రవి, హైమద్‌, ...

Read More »

గాంధారిలో కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

  గాంధారి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ 63వ జన్మదిన వేడుకలను తెరాస నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని ఎండివో కార్యాలయంలో కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ది కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, వారి ఆశీస్సులతో మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల తెరాసనాయకులు శివాజీరావు, శ్రీకాంత్‌రెడ్డి, ముకుంద్‌రావు, మోతిరాం నాయక్‌, కాశీరాం, సాయిలు, తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ...

Read More »

ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైతు ఆత్మహత్య

  గాంధారి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పులు పెరిగిపోవడంతో ఓరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో గురువారం అర్దరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం… గ్రామానికి చెందిన దుంపల కాశీరాం (34) గత కొన్ని సంవత్సరాలుగా తనకున్న కొద్దిపాటి పొలంను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సమయానికి పంటలు పండక అప్పులు పెరిగిపోవడంతో దుబాయ్‌కి వెళ్లాలనుకున్నాడు. అప్పటికే గ్రామంలో అప్పులు తీసుకోగా మరికొంత అప్పుగా తీసుకొని ...

Read More »

సిఎం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాద్యమని, అనతి కాలంలో నిరూపించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, జిల్లా తెరాస ఉపాద్యక్షుడు రాజా పూర్ణానందం అన్నారు. శుక్రవారం మోర్తాడ్‌ కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినిల సమక్షంలో కెసిఆర్‌ జన్మదినోత్సవాన్ని నాయకులు ఘనంగా నిర్వహించారు. జడ్పిటిసి కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. అనంతరం విద్యార్తినిలకు సిఎం చేస్తున్న అభివృద్ది పనులను వివరించారు. పండ్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియా, ...

Read More »