Breaking News

Daily Archives: February 18, 2017

7 గ్రామ పంచాయతి బిల్డింగ్ నిర్మాణాలను నిధులు మంజూరు

బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గానికి మరో 7 గ్రామ పంచాయతి బిల్డింగ్ నిర్మాణాలను నిధులు మంజూరు చేస్తూ జి.ఓ విడుదల చేసిన ప్రభుత్వం…ఒక్కో గ్రామ పంచాయతికి 13 లక్షల చొప్పున నిధుల కేటాయింపు..బాల్కొండ మండలం బోదెపల్లి శ్రీరాంపూర్ మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామాలకు భీంగల్ మండలంలో ముచ్కూర్ మెండోరా బాబాపూర్ గ్రామాలకు మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామానికి నిధులు మంజూరు…ఇప్పటి వరకు నియోజకవర్గంలో 33 గ్రామపంచాయతి బిల్డింగ్ లకు నిధులు మంజూరు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు..మోర్తాడ్ మండలంలో 8 గ్రామ పంచాయతిలు బాల్కొండ మండలంలో 3 ...

Read More »

విద్యార్థులు లక్ష్యానికి సన్నద్దం కావాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు తమ తమ లక్ష్యాలను నిర్దారించుకొని వాటినిసాదించేందుకు సన్నద్దులై ఉండాలని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ అన్నారు. కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలల 9వ వార్సికోత్సవ వేడుకలు శనివారం కామారెడ్డిలో జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సమాజ సేవను అలవరుచుకోవాలని సూచించారు. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని, క్రమశిక్షణ జీవితంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ...

Read More »

టిఎకెఎస్‌ జిల్లా ప్రదాన కార్యదర్శిగా స్వామి

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అసంఘటిత రంగ కార్మి సంఘాల సమాఖ్య టిఎకెఎస్‌ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోరె స్వామిని నియమిస్తు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాగౌడ్‌ ఉత్తర్వులు జారీచేశారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన స్వామిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించామన్నారు. స్వామి హమాలీ కార్మికునిగా పనిచేస్తు కార్మికుల రక్షణ కోసం కృషి చేస్తున్నాడన్నారు. దీన్ని గుర్తించి ఆయనకు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. కార్మికుల సంక్షేమానికి పాటుపడాలని సూచించారు.

Read More »

ప్రభుత్వంపై కాదు… విధానాలపైనే పోరాటం

  – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ పోరాటం ప్రబుత్వంపై కాదని, ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా, నిరుద్యోగ వ్యతిరేక విధానాలపైనేనని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. ఈనెల 22వ తేదీన తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతం కార్యక్రమంలో భాగంగా కోదండరామ్‌ శనివారం కామారెడ్డికి వచ్చారు. ఇక్కడి విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి మాట్లాడారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ...

Read More »

నిరుద్యోగ నిరసన ర్యాలీ గోడప్రతుల ఆవిస్కరణ

  గాంధారి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22వ తేదీన హైదరాబాద్‌లో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ గోడప్రతులను గాంధారి మండలంలో జేఏసి నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఎన్నికలకు ముందు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగులందరికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సిఎం కెసిఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు చేపట్టకపోవడంతో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నాయకత్వంలో ఓయు జేఏసి ఆద్వర్యంలో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఈ ర్యాలీకి నిరుద్యోగ యవతీ ...

Read More »

జన ఆవేదన సభకు తరలి రావాలి

  గాంధారి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే జన ఆవేదన సబకు గాంధారి కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సంగనిబాలయ్య తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ జన ఆవేదన సదస్సు నిజామాబాద్‌నుంచే ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. సదస్సుకు జాతీయనాయకులు దిగ్విజయ్‌ సింగ్‌, రాష్ట్ర నాయకులు జానారెడ్డి, బట్టివిక్రమార్క, షబ్బీర్‌ అలీ హాజరవుతారని సభ విజయవంతం చేయాలని ...

Read More »

మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మాజీ శాసనసభ్యుడు అడ్డగుల కృష్ణమూర్తికి సతీ వియోగం కలిగింది. శుక్రవారం ఆమె మృతి చెందగా శనివారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కామారెడ్డిఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ కృస్ణమూర్తి ఇంటికివెళ్ళి పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, నాయకులు రాజేశ్వర్‌, మాసుల లక్ష్మినారాయణ, తదితరులున్నారు.

Read More »

ఎమ్మెల్యేను కలిసిన చమ్మక్‌చంద్ర

  కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జబర్దస్త్‌ ఫేమ్‌ చమ్మక్‌ చంద్ర శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను ఆయన నివాసంలో కలిశారు. గాందారికి చెందిన చమ్మక్‌ చంద్ర జబర్ధస్త్‌లో పేరు సంపాదించారు. ఈ క్రమంలో గంప గోవర్ధన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ ప్రాంతం నుంచే తాను విద్యార్థిగా చదువుకొని హైదరాబాద్‌కు వెళ్లి నటుడిగా ఎదిగానన్నారు. తనకు జన్మనిచ్చిన ఈ ప్రాంతాన్ని మరిచిపోలేనని ఈప్రాంతం అభివృద్దికితనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయనవెంట డిసిఎంఎస్‌ చైర్మన్‌ముజీబుద్దీన్‌,నాయకులు ఆంజనేయులు ...

Read More »

నిబంధనల మేరకే కంది కొనుగోళ్ళు

  గాంధారి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనల మేరకే కందులు కొనుగోలు చేయడం జరుగుతుందని మార్కెటింగ్‌ డిఎం చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం గాంధారి వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలోకంది కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో మాట్లాడారు. 12 శాతం మాయిశ్చర్‌, 3 శాతం బ్రోకెన్‌, 3 శాతం మిక్సింగ్‌ ఉన్న కందులను మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. మార్కెట్‌ కమిటీలో వ్యవసాయాధికారుల నివేదిక ప్రకారం 10 వేల బస్తాలు అనగా 5 వేల ...

Read More »

ట్రాక్టర్‌ బోల్తాపడి ఒకరి మృతి

  గాంధారి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బ్రాహ్మణ్‌పల్లి గ్రామ శివారువద్ద శనివారం ఉదయం 1 గంట సమయంలో ట్రాక్టర్‌ బోల్తాపడడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు. రాత్రి 1 గంటకు ట్రాక్టర్‌ ట్రాలీతో కలిసి బ్రాహ్మన్‌పల్లి శివారువద్దగల వాగునుండి ఇసుక తరలిస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ కందిబాబు (25) యువకుడు ట్రాక్టర్‌ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య రూప ఫిర్యాదు ...

Read More »

దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంది

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ భవిష్యత్తు విద్యార్థులు, యువత పైనే ఆధారపడి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌లో శనివారం రాత్రి 70 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, క్రమశిక్షణతో మెలిగిననాడే ఉన్నత విద్య, భవిష్యత్తులో మంచి స్తానం లభిస్తుందని ఆయన సూచించారు. ...

Read More »

పంట తెగుళ్ళ నివారణకు మందులు వాడాలి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరిపై ఆశిస్తున్న తెగుళ్ళ నివారణకు రసాయన మందులు పిచికారి చేయాలని వ్యవసాయ విస్తీర్ణాధికారి రవిందర్‌ అన్నారు. మహ్మద్‌నగర్‌, నర్వా గ్రామాల్లో సాగుచేస్తున్న వరి పంటలను శనివారం పరిశీలించారు. కాండం తొలుచుపురుగుకు హైడ్రోటెట్‌ 4జి గుళికలు ఎకరానికి 6 కిలోలచొప్పున పిచికారి చేయాలన్నారు. అలాగే తెగుళ్ళకు యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. పొలాలకు మందులు పిచికారి చేస్తే ఆశించిన మేరకు దిగుబడి వస్తుందని,పంట పొలాల్లో జింకు లోపం ఉంటుందని, జింకుసల్పేట్‌ను వాడాలన్నారు. రైతుల ...

Read More »

ఆదర్శపాఠశాలలో చేరేందుకు 26న ప్రవేశపరీక్ష

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆదర్శ పాఠశాలలో 6,7,8,9,10 తరగతులకు ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 26న ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్‌ చంద్రకళ తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 22వ తేదీ నుంచి హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Read More »

కూలీలకు పని కల్పించండి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం కింద కూలీలందరికి పని కల్పించాలని ఎంపిడివో రాములు నాయక్‌ అన్నారు. ఎంపిడివో కార్యాలయంలో శనివారం ఇజిఎస్‌ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 17 గ్రామ పంచాయతీ పరిధిలోని జాబ్‌ కార్డులు కలిగిఉన్న కూలీలందరికి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులు కల్పించాలన్న ఆదేశాలున్నాయని, కూలీల సంఖ్య పెంచాలని పేర్కొన్నారు. 17 గ్రామ పంచాయతీల్లో ...

Read More »

పిట్లంకు బస్సు సర్వీసు ప్రారంభం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం నుంచి పిట్లం, శంకరంపేట వైపునకు ప్రయాణించే ఆర్టీసి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు నిజామాబాద్‌ న్యూస్‌లో కథనాలు వచ్చాయి. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసి బస్సు సర్వీసు ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు, అలాగే 10.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలు, 3.30 గంటలకు నాలుగు ట్రిప్పులు నిజాంసాగర్‌ నుంచి పిట్లం వరకు వెళుతుందని అధికారులు తెలిపారు. ఇదే బస్సు ఉదయం 11.30 గంటలకు ...

Read More »

జన ఆవేదన సభను విజయవంతం చేయండి

  నందిపేట, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించనున్న జన ఆవేదన సభను విజయవంతం చేయాలని నందిపేట కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ పిలుపునిచ్చారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మూడేళ్ల పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నందున జన ఆవేదన సబను కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేయలేదని, దళితులకు వాగ్దానం చేసిన మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ...

Read More »

అన్యమతస్తుల విశ్వాసాన్ని గౌరవించాలి

  – సిఐ లక్ష్మినర్సింహస్వామి నందిపేట, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట పోలీసు స్టేషన్‌ ఆవరణలో శనివారం ఎస్‌ఐ జాన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన శాంతి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్మూర్‌ రూరల్‌ సిఐ లక్ష్మినర్సింహస్వామి మాట్లాడారు. మండంలోని హిందు, ముస్లిం, క్రైస్తవులందరు కలిసి మెలిసి ఉంటూ ఒకరి మత విశ్వాసాలను ఇతరులు గౌరవించినపుడే ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం ఏర్పడుతుందన్నారు. దేశ చట్టాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సిఐ సూచించారు. నిజామాబాద్‌ జిల్లా పోలీసు ...

Read More »

పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి పాఠశాలలో శనివారం విద్యార్థులు స్వయం పాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. 10వ తరగతి విద్యార్థులు తమ అనుభవాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

పలు అభివృద్ది పనుల్లో మంత్రి పోచారం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో పలు అభివృద్ది పనుల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మొదటగా 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న మున్నూరు కాపు సంఘ భవననిర్మానానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బీర్కూర్‌ బస్టాండ్‌లో 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి పనుల నిర్మాణాలకు శంకుస్తాపన చేశారు. అలాగే మండల అభివృద్ది కార్యాలయం వద్ద 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన స్త్రీశక్తి భవనం ప్రారంభించారు. డ్వాక్రా మహిళల ...

Read More »

జన ఆవేదనసమ్మేళనం విజయవంతం చేయండి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 19 ఆదివారం నిజామాబాద్‌లోని కలెక్టరేట్‌ మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల కాంగ్రెస్‌ కార్యకర్తలు జన ఆవేదన సమ్మేళన బహిరంగ సభను విజయవంతం చేయాలని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజు అన్నారు. మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్‌ గంగారాం స్వగృహంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ...

Read More »