Breaking News

దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంది

 

– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బీర్కూర్‌, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ భవిష్యత్తు విద్యార్థులు, యువత పైనే ఆధారపడి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పిహెచ్‌ఎస్‌లో శనివారం రాత్రి 70 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, క్రమశిక్షణతో మెలిగిననాడే ఉన్నత విద్య, భవిష్యత్తులో మంచి స్తానం లభిస్తుందని ఆయన సూచించారు. మొదటగా పాఠశాలలో సరస్వతి పూజచేసి, జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమం ప్రారంభించారు. ఎస్‌ఎంసి ఛైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, ప్రధానోపాధ్యాయుడు శివరాజ్‌లు మంత్రిని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థుళ సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీర్కూర్‌ పాఠశాలలో చదువుకున్న ఎందరో విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని వారినిఆదర్శంగా తీసుకొని విద్యార్థులు భవిస్యత్తు బాటకు పునాది వేయాలని సూచించారు. క్రమశిక్షణతోనే ఒదిగి ఎదిగిన నాడే సమాజంలో ప్రతి ఒక్కరికి సముచిత స్తానం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు బానిసై చిన్న వయసులోనే భవిష్యత్తును ప్రశ్నార్థకంచేసుకోవద్దన్నారు. అనంతరం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతిప్రదానం చేశారు. కార్యక్రమంలో డిఎస్పీ నర్సింహారావు, తహసీల్దార్‌ కృష్ణానాయక్‌, మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌, ఎంపిటిసి సుధాకర్‌ యాదవ్‌, ప్రతిభ, ఏఎంసి ఛైర్మన్‌ పెరక శ్రీనివాస్‌, మండల విద్యాధికారి గోపాల్‌రావు, గ్రామ సర్పంచ్‌ దూలిగె నర్సయ్య, మలిపెద్ది చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *