Daily Archives: February 19, 2017

గ్రంథాలయ వార్షిక తనిఖీలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ శాఖ కార్యదర్శి నర్సింలు ఆదివారం తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ది కోసం 70 లక్షల పుస్తకాలను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. కోటి రూపాయలతో కొత్త గ్రంథాలయాలను నిర్మిస్తామన్నారు. గ్రంథాలయంలో సిబ్బంది కొరత కూడా ఉందన్నారు. సిబ్బంది కొరత త్వరలో తీరుస్తామని, ఉన్నతాధికారులతో ఈ విషయమై చర్చిస్తామన్నారు. ఆయన వెంట గ్రంథపాలకుడు గంగాధర్‌, సిబ్బంది ఉన్నారు.

Read More »

నిరసన ర్యాలీకి అనుమతించాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న హైదరాబాద్‌లో తలపెట్టిన తెలంగాణ రాజకీయ జేఏసి నిరుద్యోగ నిరసన ర్యాలీకి అనుమతించాలని ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కో కన్వీనర్‌ రవిలు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష ఉద్యోగాలను భర్తీచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా 4 వేల పైచిలుకు ఉద్యోగాలు మాత్రమే భర్తీచేసిందన్నారు. డిఎస్సీని ...

Read More »

‘బోరు’మంటున్నాయి…

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం రానే వస్తుంది… నీటి సమస్య రాజ్యమేలుతుంది… ముందు జాగ్రత్తగా నీటి సమస్య పరిష్కరించేందుకు కృసి చేయాల్సిన అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామీణ ప్రజలు వాపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం చాలా గ్రామాల్లో ఏళ్ల తరబడి మరమ్మతుకు నోచుకోని చేతిపపంపులే. ప్రస్తుతం అనేక గ్రామాల ప్రజలు నీటి కోసం సింగిల్‌ఫేస్‌ బోరుమోటారుపై ఆధారపడ్డారు. దీంతో విద్యుత్‌ సదుపాయం ఉన్నపుడే నీటి సరఫరా సాద్యమవుతుంది. చేతిపంపులకు చిన్నపాటి మరమ్మతులు చేసినా ...

Read More »

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం ఛతప్రతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవునిపల్లి గ్రామంలోని శివాజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌లు మాట్లాడుతూ శివాజీ మరణించి వందల ఏళ్లు గడుస్తున్నప్పటికి ఆయన అమరుడిగా నిలిచిపోయారన్నారు. ఆయన దేశభక్తి, సురక్ష, సుపరిపాలన అందించి వీరశాలిగా నిలిచారన్నారు. శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ధైర్యం, పట్టుదల, దైవభక్తితో ...

Read More »

సోమవారం మహ్మద్‌నగర్‌లో సిసిఎస్‌పై అవగాహన సదస్సు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌లో సిసిఎస్‌ పై అవగాహన సదస్సు సోమవారం నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయుడు సురేందర్‌ అన్నారు. కొత్త పింఛన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తు, పాత పింఛన్‌ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్‌ చేస్తు సమావేశం నిర్వహిస్తున్మామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర, జిల్లాల బాధ్యులు హాజరవుతున్నారన్నారు. అదేవిధంగా నూతన కార్యవర్గం నియమిస్తామన్నారు. ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Read More »

వీరశైవ సమాజం జిల్లా కార్యవర్గం

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం వీరశైవ సమాజం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మఠం విజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా జంగం శంకరయ్య, కోశాధికారిగా జంగం శశిధర్‌, ఉపాధ్యక్షునిగా జంగం శంకరయ్య, తదితరులు ఎన్నుకున్నారు. వీరశైవ జంగం కులస్తుల అభ్యున్నతికి తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బసంత్‌రావు, శంకరప్ప, మహేందర్‌, శంకరయ్య, నాగరాజు, పరమేశ్వర్‌, శశిధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కామారెడ్డిలో శివాజీమ్యూజియం ఏర్పాటు చేస్తాం

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో చత్రపతి శివాజీ మ్యూజియంతోపాటు శివాజీ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన రోడ్డుకు శివాజీ మార్గ్‌ అని పేరు పెడతామని పేర్కొన్నారు. హిందూ సామాజ్య్రస్థాపకుడు, భారతమాత ముద్దుబిడ్డ శివాజీ మహరాజ్‌ అన్నారు. ప్రపంచ మానవాళికి దశ, దిశను నిర్దేశించిన ...

Read More »

మత్తు మందు చల్లి నగల చోరీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిపట్టణంలో మిట్ట మధ్యాహ్నం మహిళకు మత్తుమందు చల్లి ఆమె మెడలోంచి బంగారు నగలు తస్కరించిన సంఘటన ఆదివారం కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన చిలుక భారతి ఆదివారం ఎన్జీవోస్‌ కాలనీలోని బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళుతుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను ఆపి మత్తు మందు చల్లి బైక్‌పై ఎక్కించుకొని వెళ్లారు. మెడలోంచి మూడుతులాలబంగారు మంగళసూత్రం లాక్కొని ఆర్‌.కె.లాడ్జ్‌ ప్రాంతంలో మహిళను వదిలేసి వెళ్లారు. తేరుకున్న ...

Read More »

క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కాంట్రాక్టు అధ్యాపక సంఘ క్యాలెండర్‌ను ఆదివారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు రాజాగౌడ్‌, సహ అధ్యక్షుడు నర్సింలు, ప్రధాన కార్యదర్శి వసంత్‌, ప్రతినిధులు సంతోష్‌, రాజగోపాల్‌, ఇష్రత్‌, తెరాస నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, తానాజీరావు, అజీజ్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ఆయా గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల నుండి ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చని బీర్కూర్‌ తహసీల్దార్‌ కృష్ణానాయక్‌, నసురుల్లాబాద్‌తహసీల్దార్‌ డేవిడ్‌అన్నారు. గతంలో ప్రజావాణి కార్యక్రమం జిల్లా కేంద్రంలో నిర్వహించబడేదని, లబ్దిదారుల సౌకర్యార్థం ప్రస్తుతం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని స్పస్టం చేశారు. లబ్దిదారులు తమ సమస్యను లిఖితపూర్వకంగా తెలిపితే ఆయా శాఖాధికారులతో సమస్య పరిష్కరించడం త్వరలోనే ...

Read More »

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య

  బీర్కూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెళ్ళి చేసుకొని భర్తతో నిండు నూరేళ్ళు కాపురం చేస్తానని బాస చేసిన ఓ మహిళ భర్తతో గొడవ పడి నిండు జీవితాన్ని బలిచేసుకున్న సంఘటన నసురుల్లాబాద్‌ మండలంలోని నెమ్లి గ్రామంలో చోటుచేసుకుంది. నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ గోపి కథనం ప్రకారం …. నెమ్లి గ్రామానికి చెందిన శకుంతల (48) బర్తతో గొడవ పడి అంకోల్‌ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. భర్తతో గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ ...

Read More »

ప్రియాంక కుమారుడికి ‘క్రికెట్‌’ గాయం

రైహన్‌ ఎడమకంటికి తగిలిన బంతి ఎల్వీ ప్రసాద్‌లో చికిత్స.. ఢిల్లీకి తిరిగి పయనం  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా కుమార్తె ప్రియాంకగాంధీ దంపతులు తమ కుమారుడి కంటి చికిత్స కోసం శనివారం హైదరాబాద్‌ వచ్చారు. ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రిలో తగిన చికిత్స తీసుకున్న అనంతరం వారు రాత్రికి ఢిల్లీకి తిరిగి బయలుదేరారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయు. ఉదయం 8.45 ప్రాంతంలో భర్త రాబర్ట్‌ వాద్రా, కుమారుడు రైహన్‌, కూతురు మిరయతో కలిసి ప్రియాంక శంషాబాద్‌కు చేరుకోగా.. ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి కూతురు పింకీరెడ్డి వారిని సాదరంగా ...

Read More »

శశికళకు శుభవార్త అందింది

చెన్నె: అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని నిలబెడతానని శపథం చేసి మరీ జైలుకు వెళ్లిన శశికళకు శుభవార్త తెలిసి ఉంటుందా? పళనిస్వామి ప్రభుత్వం గట్టెక్కిందని ఆమెకు సమాచారం అందిందా? అందిందనే అంటున్నారు జైలు అధికారులు. అది కూడా క్షణం క్షణం అప్‌డేట్‌తో జైల్లోనే అమె వదిన ఇళవరసితో కలిసి అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూశారు. శశికళకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అంటే ఆమెకు టీవీ సౌకర్యం లేనట్టే. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షను ప్రత్యక్షంగా చూడాలని జైలు అధికారులను అభ్యర్థించారట. అయితే వీరుంటున్న సెల్లో టీవీ ...

Read More »

గాంధారిలో తనిఖీలు, కారులో గంజాయి స్వాధీనం

  గాంధారి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కారులో ఎంత గంజాయి ఉన్నది వివరాలు తెలియరాలేదు. పోలీసులు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. మండల కేంద్రంలోని తిప్పారం రోడ్డులో గంజాయి వాహనం పట్టుకున్నారు. కారు స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వివరాలు గోప్యంగా ఉంచారు. రాత్రి జరిగిన సంఘటన పోలీసు తనిఖీల్లో చోటుచేసుకుంది.

Read More »

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు 1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు 2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా 3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ 4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు 5. అనువు గాని చోట అధికులమనరాదు 6. అభ్యాసం కూసు విద్య 7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి 8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం 9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం 10. ఇంట్లో ఈగల ...

Read More »

ఛత్ర పతి శివాజీ మహారాజు జన్మదిన శుభాకాంక్షలు

వలస పాలకుల పాలిట సింహ స్వప్నం మన శివుభా … ఝులిపించిన ఈ ఖడ్గం … పరాయి పాలనను చెండాడిన చంద్రహాసం … స్వాభిమానమును స్వజాతీయుల్లో అణువణువు నింపిన యోధుడు మన శివ్ భా … స్వాభిమాన యోధుని జన్మదినం మనందరికి పండుగ రోజు … ఈ పండుగ పూట అందరికీ ఛత్ర పతి శివాజీ మహారాజు జన్మదిన శుభాకాంక్షలు ??

Read More »

‘సీతాష్టమి’

శివ ధనుస్సు విరిచిన శ్రీరాముడి మెడలో సీత వరమాల వేసింది. వేద మంత్రాల సాక్షిగా రాముడి వెంట ఏడడుగులు నడిచింది. అపురూపంగా … అల్లారుముద్దుగా పెరిగిన సీత అత్తవారిల్లు అయోధ్య అయినందుకు పొంగిపోయింది. సూర్యవంశీకుల ఇంటికి కోడలిగా వెడుతున్నందుకు ఎంతగానో ఆనందించింది. సీతమ్మలేని మిథిలా నగరంలో ఉండలేమని అక్కడి ప్రజలు దిగాలు పడ్డారు. అసమాన పరాక్రమవంతుడైన రామయ్య చేతిలో ఆమెని పెట్టినందుకు సంతోషించారు. కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి, రాముడితో సీతమ్మ వనవాసానికి వెళ్లవలసి వస్తుంది. మేడలకి దూరమైనందుకు సీతమ్మ బాధపడలేదు. రాముడి నీడలో ...

Read More »

మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ

శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా పనిచేస్తూ మొఘల్‌ రాజులకు వ్యతిరేకంగా అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. షాజహాన్‌ దండయాత్ర చేసిన సమయంలో కీలకపాత్ర పోషించాడు. తన సహచరుడిని నిజాంషాహీ ప్రభువు హత్యచేయించడంతో తిరుగుబాటు బావుటాను ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనకు నాంది పలికాడు. రాజ్య విస్తరణ కోసం చేసిన యుద్దాలలో పరాజయాన్ని చవిచూశాడు. తండ్రి వద్ద యుద్ధవిద్యలు, రాజనీతి మెలుకువలు నేర్చుకున్న శివాజీ తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనేక నూతన యుద్ధతంత్రాలను రూపొందించాడు. సకలవిద్యలను అవపోసన పట్టిన ఆయన మరాఠాసామ్రాజ్య ...

Read More »

72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.

  1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? ( బ్రహ్మ) 2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు) 3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం) 4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం) 5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం) 6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు) 7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం) 8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన) 9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? (అధ్యయనము వలన) 10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార ...

Read More »