Daily Archives: February 20, 2017

గాంధారిలో భారీగా గంజాయి పట్టివేత

  – ఖరీదైన కారులో రవాణా – నలుగురు అరెస్టు గాంధారి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశాఖపట్టణం అరకు నుండి మహారాష్ట్రకు ఖరీదైన కారులో తరలిస్తున్న గంజాయిని పెద్ద మొత్తంలో గాంధారి పోలీసులు పట్టుకున్నారు. సదాశివనగర్‌ సిఐ శ్రీశైలం కథనం ప్రకారం… ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఖరీదైన కారులో గాంధారి మీదుగా గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో స్థానిక ఎస్‌ఐ రాజేశ్‌ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి వారి ఆదేశాల మేరకు గాందారి ...

Read More »

సభ విజయవంతంపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో హర్షం

  నందిపేట, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ మైదానంలో నిర్వహించిన జన ఆవేదన సమ్మేళన సదస్సు విజయవంతం కావడంతో మండలంలోని కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్తేజం నిండింది. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకపక్షాలపై పోరాడే సమయం ఆసన్నమైందని వక్తలు ఇచ్చిన ప్రసంగాలతో గ్రామస్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్తేజం నిండినట్టెంది. మండలంలో స్థబ్దంగా ఉన్న పార్టీ ఒక్కసారిగా పుంజుకున్నట్టయింది. అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో గ్రామ స్థాయికి ...

Read More »

ఎమ్మెల్యేకు సన్మానం

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను మజీద్‌ కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీలు సోమవారం ఆయన స్వగృహంలో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో మైనార్టీ గురుకుల పాఠశాలల మంజూరుకు కృషిచేసిన సిఎం కెసిఆర్‌కు, జిల్లా ఎంపి కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంతో మాట్లాడి పాఠశాలల ఏర్పాటుకు చొరవ చూపిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చక్కరకొండ కృష్ణ, సర్పంచ్‌ అంజయ్య, ఇస్లాంపూర్‌ ...

Read More »

పందుల స్వైరవిహారం అరికట్టండి

  నందిపేట, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట గ్రామ పంచాయతీ పరిధిలో పందుల స్వైర విహారం విపరీతంగా పెరిగింది. గ్రామంలోని ప్రతి కాలనీలో ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునే వరకు పందుల స్వైరవిహారంతో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలనీల్లో పందులు ఇళ్లలోకి చొచ్చుకుపోయి భీభత్సం సృష్టించడంతో నానా అవస్థలు పడుతున్నారు. పందులు అరికట్టాలని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడంతో సోమవారం ప్రజావాణిలో నందిపేట సేవాసమితి సభ్యులు ...

Read More »

వైభవంగా యువకెరటాలు 2017

  నందిపేట, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేటలోని నందిగుడి సమీపంలో ఆదివారం రాత్రి ఇందూరు యువత ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమం వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో రాణించిన నందిపేట యువ ప్రతిభావంతులకు యువ కెరటాలు – 2017 పేరిట అవార్డులు ప్రదానం చేసి శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా నిజామాబాద్‌కు చెందిన ఇంగ్లీష్‌ అధ్యాపకుడు చారి సతీమణి బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్నందున వైద్య చికిత్సల నిమిత్తం చారి కుటుంబానికి రూ. లక్ష వరకు ఆర్థిక సాయం ...

Read More »

చెరువు సమస్య పరిష్కరించాలి

  గాంధారి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి చెరువు సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో రెండు గ్రామాల ప్రజలు ఫిర్యాదుచేశారు. సోమవారం గాంధారి మండలంలోని తహసీల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఒక ఫిర్యాదు వచ్చిందన్నారు. మండలంలోని సర్వపూర్‌, గౌరారం గ్రామాల మధ్య ఉమ్మడి చెరువు ఉండగా అందులో రెండు గ్రామాలకు చెందిన కార్మికులు చేపలు పడుతున్నారు. దీంతో రెండు గ్రామాల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. చెరువులో చేపలు పట్టే అధికారం మాదంటే మాదంటూ రెండు గ్రామాల ...

Read More »

సామాజిక సేవలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ముందంజ

  గాంధారి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక సేవలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ముందంజలో ఉందని సొసైటీ కామారెడ్డి జిల్లా ఛైర్మన్‌ తిరుమల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సమాజానికి సేవ చేయడంలో యువత ముందంజలో ఉండాలన్నారు. దీనికొరకు రెడ్‌క్రాస్‌ సొసైటీ వేదికగా ఉందన్నారు. సొసైటీ ద్వారా ప్రతి ఒక్కరు సభ్యత్వం ఉండవచ్చన్నారు. సభ్యత్వం ...

Read More »

డబుల్‌ బెడ్‌రూం లబ్దిదారుల జాబితా విడుదల

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ లబ్దిదారుల జాబితాను తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ విడుదల చేశారు. డబుల్‌ బెడ్‌ రూం పథకానికి 1800 దరఖాస్తులు రాగా అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి పూర్తిగా ఇళ్ళులేని 237 మంది లబ్దిదారులను గుర్తించడం జరిగిందని, అట్టి జాబితాను మోర్తాడ్‌ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌కు, కార్యదర్శి జావిద్‌కు అందజేసినట్టు ఆయన తెలిపారు.

Read More »

ఇంటి పన్ను బకాయిలు చెల్లించండి

  – గ్రామాభివృద్దికి సహకరించండి మోర్తాడ్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని షెట్పల్లి గ్రామంలో సోమవారం మండల కార్యదర్శులు ఇంటి పన్ను బకాయిల వసూలు చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించి గ్రామాభివృద్దికి సహకరించాలంటూ పన్ను వసూలు చేశారు. షెట్పల్లిలో 80 వేలు వసూలైనట్టు మండల కార్యదర్శి తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శులు స్వప్న, స్వామి, గంగాదాసు, రమేశ్‌, తిరుపతిరెడ్డి, సాజన్‌కుమార్‌, ఎండి.ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రధాని మోడిని విమర్శిస్తే ప్రజలు నమ్మరు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో అవినీతి నిర్మూలించడమే గాకుండా అన్ని రంగాల్లో అభివృద్ది పరుస్తున్న ప్రధాని మోడిని, కేంద్ర ప్రబుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు నమ్మరని మోర్తాడ్‌ మండల బిజెపి అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ చేపట్టింది జన ఆవేదన సభ కాదని కాంగ్రెస్‌ ఆవేదన సభ మాత్రమే అని ఆరోపించారు. కాంగ్రెస్‌ అవినీతి, కుంభకోణాలకు పాల్పడడం వల్లే ప్రజలు మోడికి భారీ మెజార్టీతో పట్టం గట్టారని, వచ్చే ఎన్నికల్లో కూడా ...

Read More »

చేతబడి మ్యూజియం..

రెక్‌జవిక్‌: ప్రపంచంలోనే అరుదైన మ్యూజియం హొల్మవిక్‌ పట్టణంలో ఉంది. ఐస్‌ల్యాండ్‌ ప్రాంతానికి చెందిన చేతబడి, మంత్ర సాధనలకు సంబంధించిన అరుదైన వస్తువులతో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. మనిషి చర్మంతో చేసిన ప్యాంటు నమూనా ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ. చేతబడి మంత్రాలకు సంబంధించిన పుస్తకాలు, విధానాలను ఇక్కడ ప్రదర్శినకు ఉంచారు. ఐస్‌ ల్యాండ్‌ ప్రాంతం ఒకప్పుడు మాంత్రికులకు ప్రసిద్ధి. మనిషి చర్మంతో చేసిన దుస్తులను ధరిస్తే సంపద పెరుగుతుందని మాంత్రికులు నమ్మేవారు. అప్పటి మాంత్రికులు దెయ్యలతో పాలను సేకరించేవారని స్థానికులు చెప్తారు. కొన్నేళ్లకు ...

Read More »

అంతరిక్షంలో నవ్వుల నక్షత్రం

 అంతరిక్షంలో మరో కొత్త నక్షత్రం కనిపించనుంది. అయితే దీనిని కనిపెట్టింది ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం కాదు. ఆ మాటకొస్తే ఇదసలు నక్షత్రమే కాదు. ఇజ్రాయిల్‌కు చెందిన పేరొందిన చిత్రకారుడు రూపొందించిన కళాఖండమిది. లాఫ్‌ స్టార్‌గా వ్యవహరిస్తున్న ఈ కళాఖండాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోని త్రీడీ ప్రింటర్‌తో ప్రింట్‌ చేశారట! ఆపై శూన్యంలో స్వేచ్ఛగా వదిలేసారట! ఐఎస్‌ఎస్‌లో రూపొందించిన తొలి ఆర్ట్‌ వర్క్‌ ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం నవ్వినపుడు వెలువడే శబ్దాలు ఉంటాయి కదా.. వాటిని రికార్డు చేసి అంతరిక్ష కేంద్రానికి పంపించారు. అక్కడున్న ...

Read More »

విదేశీ చెత్తకు అనుమతి ఎలా?

ప్రజారోగ్యం పణంగా పెట్టి ధనార్జనా: కేంద్రంపై సుప్రీం ఆగ్రహం న్యూఢిల్లీ: విదేశాలు ప్రమాదకర వ్యర్థాలను మన దేశంలో పారవేసేందుకు అనుమతించి, అందుకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం డబ్బు తీసుకోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ పౌరుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వం డబ్బు సంపాదిస్తోందని కోర్టు విమర్శించింది. విదేశాలు ప్రమాదకర వ్యర్థాలను మన దేశంలో పడేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారనీ, దీనివల్ల దేశ పౌరులపై దుష్ప్రభావాలు పడుతున్నాయని ‘రీసెర్చ్‌ ఫౌండేషన్  ఫర్‌ సైన్స్ ’అనే స్వచ్ఛంద సంస్థ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ...

Read More »

కాలేజీ అమ్మాయిల గదిలో ఎలుక.. ఏం చేశారంటే…

బొద్దింకలు, బల్లులు, ఎలుకలు వంటివాటిని చూస్తే అమ్మాయిలకు ఎంతో భయం. అలాంటిది ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులు ఎంతో తెలివిగా ఓ ఎలుక బారి నుంచి తప్పించుకున్నారు. తమ గదిలో తిష్ఠ వేసిన ఎలుకను ఆ అమ్మాయిలు బయటికి పంపించిన తీరు అందరికీ నచ్చింది. జోడీ మెకిన్ అనే యువతి గదిలో ఓ ఎలుక ఉండటాన్ని గమనించింది. దాన్ని సాధ్యమైనంత త్వరగా బయటికి పంపించేయాలని నిర్ణయించుకుంది. తన స్నేహితురాళ్ళతో మాట్లాడింది. దానిని బోనులో పెట్టి, బంధించి చంపేయకుండా, కొత్తగా ఆలోచించి బయటికి పారిపోయేలా చేయాలని ...

Read More »

చైనా వార్నింగ్‌ బేఖాతరు.. రంగంలోకి అమెరికా!

చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. నేరుగా అమెరికా వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి దిగింది. అమెరికా నేవీకి చెందిన యుద్ధ విమాననౌక శనివారం నుంచి దక్షిణ చైనా సముద్రంలో గస్తీ తిరగడం ప్రారంభించింది. క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ (సీఎస్‌జీ) 1 యుద్ధవిమాన నౌక ఈ మేరకు సాధారణ గస్తీ చేపడుతున్నదని ఆ దేశ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యుద్ధనౌకలో నిమిట్జ్‌ క్లాస్‌ ఎయిర్‌క్రాప్ట్‌ క్యారియర్‌ (USS Carl Vinson (CVN 70)), క్షిపణి విధ్వంసక యూఎస్‌ఎస్‌ వేన్‌ ఈ మేయర్‌, ఎయిర్‌వింగ్‌కు ...

Read More »