Daily Archives: February 21, 2017

వార్డు సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌ ఖరారు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యుని ఎన్నికకు షెడ్యూల్‌ ఖరారైనట్టు మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ తెలిపారు. గత సాధారన ఎన్నికల్లో 10వ వార్డు సభ్యునిగా ఎన్నికైన ఎల్లాగౌడ్‌ మృతి చెందడంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 25వ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, 26న నామినేషన్ల పరిశీలన, 27న అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవాలని సూచించారు. 28వ తేదీన నామినేషన్‌ ...

Read More »

కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనులు

  నందిపేట, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట నుంచి జిల్లా కేంద్రం వైపు వెళ్లే మెట్టు గ్రామం వరకు గల ఆర్‌అండ్‌బి రోడ్డును తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ రోడ్డుగా మార్చనుండడంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నందిపేట నుంచి గాలిబ్‌నగర్‌ వరకు ఉన్న రోడ్డుకు 33 పీట్లతో డబుల్‌ రోడ్డు వేయనున్నారు. 15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రోడ్డుకు రెండు వైపులా ప్రొక్లెయిన్‌లతో తవ్వి కంకర నింపి తారు రోడ్డు వేయనున్నారు. పలుగుట్ట నుంచి రైతుఫారం వరకు డబుల్‌ రోడ్డు ...

Read More »

ధరలేని టమాట

  నందిపేట, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు సంవత్సరాల నుంచి కరువుతో సతమతమైన రైతులు ఈయేడు పుష్కలంగా కురిసిన వర్షాలతో సంతోషించి తమ పంటలకు మంచి గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో మండలంలో పెద్ద సంఖ్యలో టమాట సాగుచేశారు. అయితే రైతులందరు పెద్ద ఎత్తున టమాట పండించడంతో డిమాండ్‌ తగ్గడమే గాకుండా మండలంలోని వివిధ గ్రామాల రైతులు, ఇతర జిల్లాల నుంచి వ్యాపారస్తులు టమాట దిగుబడి చేసుకోవడంతో సోమవారం అంగడిరోజు కిలో టమాట రూ. 3 నుంచి ...

Read More »

డంప్‌ యార్డు కోసం స్థల పరిశీలన

  బీర్కూర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలో డంప్‌ యార్డు కొరకు తహసీల్దార్‌ కృష్నానాయక్‌, ఎస్‌ఐ రాజ్‌భరత్‌ లు కలిసి డంప్‌ యార్డు నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. గ్రామంలోని చెత్త చెదారం ఊరి బయట పారవేయాలనే ఉద్దేశంతో గ్రామంలో పోలీసు స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో డంప్‌ యార్డు కోసం స్థల పరిశీలన చేసినట్టు వారు తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదికలు పంపి స్థలాన్ని కేటాయిస్తామని అన్నారు.

Read More »

హరితహారం మొక్కలను కాపాడాలి

  బీర్కూర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వర్షాకాలంలో హరితహారంలో నాటిన మొక్కలను ప్రస్తుత వేసవి కాలంలో కాపాడేవిధంగా ఉపాధి హామీ సిబ్బంది చర్యలు తీసుకోవాని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని మండల అభివృద్ది కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో 15 నీటి తొట్టెలు నిర్మించేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, వాటిలో నీటిని నింపి హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. రానున్న వేసవి కాలంలో ఉపాధి ...

Read More »

జంటను ఏకం చేసిన సఖి టీం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్‌ తుమ్మల మారుత అధ్యక్షతన మంగళవారం సఖి టీం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ, భూమయ్య అనే దంపతులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి ఏకం చేశారు. అన్నపూర్ణమ్మకు ఇంటిని ఇవ్వాలని బృందం సభ్యులు సూచించడంతో భూమయ్య ఒప్పుకున్నాడు. దీంతో వారు హర్షం వ్యక్తంచేశారు. బృందంలో ఎంపిటిసి సరస్వతి, జడ్పిటిసి ఎనుగందుల అనిత, విఆర్వో రమేశ్‌, కానిస్టేబుల్‌ నరేశ్‌, తదితరులున్నారు.

Read More »

రేషన్‌ సరుకులు సకాలంలో అందించాలి

  – తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ బీరూక్ర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని లబ్దిదారులకు రేషన్‌ సరుకులు సకాలంలో అందించాలని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో మంగళవారం రేషన్‌ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో డిడిలు చెల్లించి సరుకులు తెప్పించుకోవాలని, నిర్నీత సమయంలో లబ్దిదారులకు రేషన్‌ సరుకులు అందజేయాలని సూచించారు. మండలంలో విజిలెన్సు పార్టీ పర్యటిస్తుందని, రేషన్‌ సరుకుల అక్రమాలకు ఎవరైనా పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ...

Read More »

28న అక్రమ రేషన్‌ బియ్యం వేలం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28వ తేదీన మోర్తాడ్‌లోని పౌరసరఫరాల గిడ్డంగి భవనంలో అక్రమ రేషన్‌ బియ్యం వేలం పాట నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 12.12.2016న మోర్తాడ్‌లో అక్రమంగా నిలువ ఉన్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకొని సీజ్‌ చేశామని 13.5 క్వింటాళ్ళ రేషన్‌ బియ్యం వేలం వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆసక్తిగల వారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు. సమావేశంలో నాయబ్‌ తహసీల్దార్‌ జనార్ధన్‌, మండల అసిస్టెంట్‌ ...

Read More »

రామన్నపేట్‌లో పంప్‌హౌజ్‌ పనుల పరిశీలన

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రామన్నపేట్‌ గ్రామంలో ఎన్‌ఆర్‌ ఇజిఎస్‌ పథకం కింద వ్యవసాయ రైతుల పంట పొలాల్లో పంప్‌హౌజ్‌ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. నలుగురు రైతులు దరఖాస్తు చేసుకోవడంతో ఒక్కో రైతుకు 14 వేల పైచిలుకు నిధులతో మట్టి నీటి తొట్టెలు కూలీలతో నిర్మింపజేస్తున్నామని, పనులు చురుకుగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి నర్సయ్య, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, కార్యదర్శి రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సుంకెట్‌లో స్పెషల్‌ డ్రైవ్‌

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని సుంకెట్‌ గ్రామంలో మంగళవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో మండల కార్యదర్శులు ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్ను బకాయిలు 31 వేల రూపాయలు వసూలు చేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మంగళవారం 1 లక్ష 43 వేలు ఇంటి పన్ను బకాయిలు వసూలు చేసినట్టు ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు.

Read More »

డి.జి. ధన్‌మేళాకు సర్పంచ్‌లు, కార్యదర్శులు హాజరుకావాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డి.జి. ధన్‌మేళా ఈనెల 23న జిల్లా కేంద్రంలోని శ్రీరామగార్డెన్స్‌లో ఏర్పాటు చేసినట్టు, మండల సర్పంచ్‌లు, కార్యదర్శులు హాజరు కావాలని ఎంపిడివో శ్రీనివాస్‌ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఏర్పాటు చేసిన డి.జి.ధన్‌మేళాలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తారని, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు.

Read More »

ప్రతినెల సమావేశాలు నిర్వహించాలి

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని గ్రామ సంఘాల సభ్యులు ప్రతినెల సమావేశాలు నిర్వహించాలని ఎపిఎం రాంనారాయణగౌడ్‌ అన్నారు. ఐకెపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో అన్ని గ్రామాలకు చెందిన గ్రామ సంఘాలు హాజరై ప్రతినెల వివిధ రకాల కార్యక్రమాల గురించి తెలుసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలోని గ్రామ సంఘాల అధ్యక్షులు, సభ్యులుహాజరై వివరాలు సేకరించాలన్నారు.

Read More »

బినామి హాజరు వేస్తే నష్టపోతారు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనుల్లో పనిచేసేందుకు వచ్చిన వారికి మాత్రమే హాజరు వేయాలని, పనికి రానివారి హాజరు వేస్తే నష్టపోతారని ఉపాధి హామీ కూలీలకు ఎంపిడివో రాములు నాయక్‌ సూచించారు. సుల్తాన్‌నగర్‌ గ్రామ శివారు అటవీప్రాంతంలో కొనసాగుతున్న పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బినామి హాజరు వేస్తే కూలీ డబ్బులు మీకే తక్కువగా వస్తుందన్నారు. మండలంలో ప్రస్తుతం 12 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయని, అటవీ ప్రాంతంలో కందకాలు, ...

Read More »

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అవసరం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తినే ఆహారం పూర్తిగా కలుషితం కావడం వల్ల రోగాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని బాన్సువాడకు చెందిన యోగా గురువు రఘువీర్‌ అన్నారు. మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో నాలుగురోజులుగా యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషికి యోగా తప్పనిసరి అని, యోగా చేయడం వల్ల ఆరోగ్యం చురుకుగా ఉంటుందని, ప్రతిరోజు యోగా కోసం సమయం కేటాయించాలని ఆయన సూచించారు. యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని ...

Read More »

మిట్టమధ్యాహ్నం బస్‌టాప్‌పై ప్రయాణం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిట్ట మధ్యాహ్నం ఆర్టీసి బస్సు టాప్‌పై ప్రయాణీకులు కూర్చొని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రెండు గంటల సమయంలో మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసి బస్టాండ్‌ నుంచి జహీరాబాద్‌ డిపోకు చెందిన బస్సులో ప్రయాణీకులు బస్సులో కిక్కిరిసి పోవడంతో బస్సు టాప్‌పై ఎక్కి వారి గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రతను లెక్కచేయకుండా ప్రయాణీకులు టాప్‌పై కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్‌ నుంచి మాసాన్‌పల్లి, నిజాంపేట్‌, నారాయణఖేడ్‌, ...

Read More »

అదుపుతప్పి ఆటో బోల్తా

  గాంధారి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ముందు మంగళవారం ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. గాంధారి నుంచి నేరెల్‌కు వెళుతున్న ఆటో రోడ్డుపై ఆగి ఉన్న బోరు మోటారు వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. ఆ సమయంలో మండలానికి చెందిన ఓ ప్రయివేటు పాఠశాల విద్యార్థులు ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలు కాకపోయినప్పటికి ఆటో స్వల్పంగా ధ్వంసమైంది.

Read More »

ఘనంగా మాతృభాషా దినోత్సవం

  గాందారి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం పేతు సంగం పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు ఉపాధ్యాయుడు శివశంకర్‌, ప్రధానోపాధ్యాయుడు సుమంత్‌లు మాతృభాష గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా మాతృభాష దినోత్సవంపై విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మణ్‌ రాథోడ్‌, రాంచందర్‌, గంగాధర్‌, రమేశ్‌, సాయన్న, దేవిదాస్‌, దేవిసింగ్‌, ధరంసింగ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులకు మజ్జిగ పంపిణీ

  గాంధారి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమాన్ని గాంధారి మండల కేంద్రంలోని హైస్కూల్లో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ రమేశ్‌గౌడ్‌లు విద్యార్థులకు మజ్జిగ పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థుల కొరకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థుల కొరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సిద్దంగా ఉన్నారని, ఎప్పటికప్పుడు స్టడీ అవర్స్‌ నిర్వహిస్తు ...

Read More »

సౌదీలో గండివేట్‌ యువకుని మృతి

  గాంధారి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకు దెరువు నిమిత్తం సౌదీకి వెళ్లిన ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెంది కుటుంబ సభ్యులకు కడుపు కోత మిగిల్చాడు. గాంధారి మండలం గండివేట్‌ గ్రామానికి చెందిన డ్యానబోయిన భాస్కర్‌ (30) అనే యువకుడు గత రెండు సంవత్సరాల క్రితం బతుకు దెరువు నిమిత్తం సౌదీకి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సౌదీలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. సమాచారాన్ని స్నేహితులు గండివేట్‌లోని కుటుంబీకులకు తెలియజేశారు. దీంతో చేతికివచ్చిన కొడుకు, ...

Read More »