Breaking News

Daily Archives: February 24, 2017

ఘనంగా మహాశివరాత్రి

  కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసాయి. భిక్కనూరులోని సిద్దిరామేశ్వర ఆలయం, మద్దికుంట బుగ్గ రామేశ్వర ఆలయం, కృష్ణాజివాడలోని శివాలయంతో పాటు పట్టణంలోని కిష్టమ్మగుడి వద్ద గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఉపవాస దీక్షలు చేపట్టారు. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరిపి సాయంత్రం పండ్లతో దీక్షలు విరమించారు. శివస్వాములు ఆలయంలో ప్రత్యేక ...

Read More »

స్వయంభూ లింగక్షేత్రం బుగ్గరామేశ్వర ఆలయం

  కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి 25 కి.మీ.ల దూరంలో కొండలు, కోనల నడుమ వెలసిన స్వయం భూ లింగం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతుంది. అరణ్య ప్రాంతంలో ఎక్కడా చుక్కనీరు కూడా దొరకని నేపథ్యంలో ఇక్కడ స్వయంభువుగా వెలసిన స్వామివారి క్షేత్రంలో నీరు ఊటగా ఉబికి రావడం, ఏడాది పొడవునా సమృద్ధిగా నీరు ఉండడం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. కాబట్టి ఇక్కడి స్వామివారికి బుగ్గ రామలింగేశ్వర స్వామిగా నామకరణం జరిగినట్టు స్థానికుల కథనం. ...

Read More »

ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. మండలంలోని ఒడ్డేపల్లి గ్రామంలోని పరమేశ్వర ఆలయంలో కామారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద పండితులు హారతి, తీర్త, ప్రసాదాలు అందజేశారు. అచ్చంపేట, కోమలంచ, నర్వా గ్రామాల్లో సంగమేశ్వర ఆలయంలో, లింగేశ్వర ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు ఉపవాసదీక్షలు చేపట్టారు. శనివారం ఉదయంనుంచే ...

Read More »

వార్డు ఎన్నికలో ఒక నామినేషన్‌

  బీర్కూర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామంలో జరగనున్న 10వ వార్డు ఎన్నికకు గాను శుక్రవారం ఒక నామినేషన్‌ దాఖలైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు. బొమ్మన్‌దేవుపల్లి గ్రామ పంచాయతీలోని హాజీపూర్‌ గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి నామినేషన్‌ దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీ శనివారం వరకు నామినేషన్‌ గడువు ఉందన్నారు. అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసుకోవచ్చని ఎన్నికల అధికారి బోజారావు అన్నారు.

Read More »

నమో నమ:శివాయ

  బీర్కూర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని శైవ ఆలయాలు నమో నమ:శివాయ నామ స్మరణతో మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం శివాలయాల్లో భక్తుల తాకిడి నెలకొంది. మండలంలోని ప్రముఖ శైవ ఆలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేపట్టారు. సోమేశ్వర లింగాలయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. బీర్కూర్‌ జోడు లింగాల ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగ్నిగుండాలు, శనివారం అన్నదానం చేపడుతున్నట్టు కమిటీ ...

Read More »

దేశంలోనే మొట్టమొదటిసారిగా స్పైస్‌ పార్కు ఏర్పాటు చేసిన ఘనత తెరాసదే

  – బంగారు తెలంగాణ లక్ష్యంగా సిఎం కృషి మోర్తాడ్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో బాల్కొండ నియోజకవర్గంలోని పడిగెల్‌ వద్ద స్పైస్‌ పార్కు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని ఉద్యానవనశాఖ రాష్ట్ర కమీషనర్‌ వెంకటరాఘవ రాంరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ధర్మోరా గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తులాభారం చేశారు. అర్చకులు హారతి, తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్థానిక సర్పంచ్‌ ...

Read More »

ఘనంగా శివరాత్రి

  బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాశివరాత్రి వేడుకలను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. బాన్సువాడ ప్రాంతంలోని ప్రధాన శివాలయాలు భక్తులతో సందడి సంతరించుకున్నాయి. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బాన్సువాడ మండలం బోర్లం, బీర్కూర్‌ మండలం సోమేశ్వర ఆలయం, పిట్లం మండలం రామేశ్వర ఆలయం, ఇదే ప్రాంతంలోని రాజరాజేశ్వర, బుగ్గ రామేశ్వర ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. బాన్సువాడ ప్రాంతంతోపాటు సరిహద్దులోని మహారాష్ట్ర, కర్ణాటక, మెదక్‌ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోమేశ్వర ఆలయానికి ప్రత్యేక బస్సులు ఆర్టీసి ...

Read More »

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

  సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన #మహర్షులు. శివరాత్రే ...

Read More »