Daily Archives: February 25, 2017

నలుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇల్చిపూర్‌ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 8,300 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించినా, పేకాట ఆడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఎవరైనా సమాచారం ఇవ్వాలనుకుంటే 9440795437కు ఫోన్‌ చేయాలని ఎస్‌ఐ సంతోష్‌ సూచించారు.

Read More »

తైబజార్‌ వేలం పాట

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పురపాలక సంఘ పరిధిలో తైబజార్‌ వేలం పాటను శనివారం కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, కమీషనర్‌ విజయలక్ష్మిలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కార్యాలయ ఆవరణలో వేలం పాట నిర్వహించగా తైబజార్‌ తీసుకునేందుకు వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. అత్యధిక ధరకు వేలం పాట పాడిన వారికి తైబజార్‌ దక్కుతుంది. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, అధికారులు పాల్గొన్నారు.

Read More »

వికాసవర్గకు తరలిన బిజెపి నాయకులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయస్వయం సేవకసంఘ వివిధక్షేత్ర వికాసవర్గ రెండ్రోజులపాటు ఆర్మూర్‌ లోని క్షత్రియ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరగనుంది. ఈ మేరకు శనివారం ఉదయం కామారెడ్డి నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వికాస వర్గలో రెండ్రోజుల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యకర్తల వ్యక్తిగత నిర్మాణం, పార్టీ పట్ల అవగాహన, స్థానిక పరిస్థితుల అధ్యయనం, అందుకనుగుణంగా పార్టీ పటిష్టత తదితర విషయాలు చర్చించడం జరుగుతుందన్నారు. వర్గలో ఆరెస్సెస్‌ ...

Read More »

సిసి డ్రైన్‌ పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో సిసి డ్రైన్‌ పైప్‌లైన్‌ పనులను శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు 2 లక్షల వ్యయంతో సిసి డ్రైన్‌ పనులు, రూ. లక్షతో పైప్‌లైన్‌ పనులు, రూ. లక్ష తో సిసి రోడ్డు పనులను చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ అంజద్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

శివరాత్రి ముగింపు ఉత్సవాల్లో ఎంపి బి.బి.పాటిల్‌

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలోని గోద్మెగాం, పడకల్‌ గ్రామ శివారులోగల పరమేశ్వర, నీలకంఠేశ్వర ఆలయాలను శనివారం జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక హారతులిచ్చి, తీర్థ, ప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి ఆలయం అభివృద్దికి నోచుకోలేదన్నారు. చక్కని వాతావరణంలో ఉన్న ఈ రెండు ఆలయాలకు ఆలయ ప్రాంగణంలో అభివృద్ది చెందేలా అన్నిరకాల చర్యలు చేపడతామని అన్నారు. నీటి ...

Read More »

జాతరకు పోటెత్తిన భక్తజనం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలోని గోద్మెగాం గ్రామ శివారులోగల నీలకంఠేశ్వర, పరమేశ్వర ఆలయాలకు శనివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ఉపవాసదీక్షలు విరమించారు. ఈ సందర్భంగా స్వామివారికి హారతి, భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. వైభవంగా జాతర ఏర్పాటు చేశారు. జాతరలో కంతి, నారాయణఖేడ్‌, పడకల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, పిట్లం, బిచ్కుంద, పెద్ద కోడప్‌గల్‌ తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Read More »

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజ్ఞానభారతి డిగ్రీ కళాశాల నూతన సంవత్సర క్యాలెండర్‌ను శివరాత్రిని పురస్కరించుకొని భిక్కనూరులోని సిద్దిరామేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మర్రి బాపురెడ్డి, హరిస్మరణ్‌రెడ్డి, కాషాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మీడియం గూడ్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మీడియం గూడ్స్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నట్టు ప్రతినిధులు తెలిపారు. నూతన అధ్యక్షునిగా అబ్దుల్‌ బారీ, ఉపాధ్యక్షునిగా రాజు, కార్యదర్శిగా సుభాష్‌, ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి, కోశాధికారిగా భీమేశ్‌, ఉప ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్‌, కార్యవర్గ సభ్యులుగా బాబు, రాము, స్వామి, అశోక్‌, క్రాంతికుమార్‌, మహేశ్‌గౌడ్‌, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

  గాంధారి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో శనివారం సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి విఆర్‌ఏలు పాలతో అభిషేకం చేశారు. విఆర్‌ఏల వేతనం 65 శాతం పెంచడంతోపాటు వారసత్వంగా చేస్తున్న విఆర్‌ఏలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. అదేవిధంగా పబ్లిక్‌ సర్వీస్‌ పర్షీలు రాసిన విఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. వేతనం పెంపుతోపాటు ఇండ్లు మంజూరు చేసినందుకుగాను మండల విఆర్‌ఏలు స్థానిక తహసీల్‌ కార్యాలయం ఎదుట కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Read More »

ముగిసిన అఖండ హరినామ సప్తాహ

  గాందారి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని భోగేశ్వర ఆలయంలో శనివారంతో అఖండ హరినామ సప్తాహ ముగిసింది. గత వారంరోజులుగా మహాశివరాత్రి సందర్భంగా 29వ భాగవత అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఆలయంలో కొనసాగించారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా కీర్తన, భజన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చివరిరోజు శనివారం గాంధారి గ్రామంలో గోపాల కాలువలు (ఊరేగింపు ) నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలతో స్వాగతం పలికారు. ప్రధాన వీధుల గుండా ...

Read More »

కెసిఆర్‌ బంగారు తెలంగాణ కల నిజం చేస్తారు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషిచేసి సాధించి తీరుతారని బాన్సువాడ డివిజన్‌ విఆర్‌ఏల సంఘం అద్యక్షుడు దత్తు అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం వద్ద కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విఆర్‌ఏలకు 65 శాతం వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ పాలనలో సంక్షేమ పథకాలు బాగున్నాయని, బంగారు తెలంగాణకు త్వరలో చేరుకోబోతున్నామంటూ దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విఆర్‌ఏల సంఘం ...

Read More »

బీర్కూర్‌ జోడు లింగాల ఆలయంలో డిఎస్పీ ప్రత్యేక పూజలు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని జోడు లింగాల ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని బాన్సువాడ డిఎస్పీ నర్సింహారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసు స్టేషన్‌ సమీపంలోగల ఆలయంలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆద్వర్యంలో పోలీసులు మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా డిఎస్పీ, సిఐ శ్రీనివాస్‌రావుతో కలిసి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం ...

Read More »

పోటా పోటీగా నామినేషన్లు

  నందిపేట, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వెల్మల్‌ ఎంపిటిసి-1వ స్తానానికి అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం 4 నామినేషన్లు, శనివారం 1, మొత్తం 5 నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మహ్మద్‌ బాలిక్‌ అహ్మద్‌ స్వీకరించారు. తెరాస నుంచి ఐలి లక్ష్మి, ఇస్సపల్లి సంగీత, కాంగ్రెస్‌ పార్టీ నుంచి పొలాస సునిత, గొజ్జి చిన్నక్క, వేరువేరుగా నామినేషన్లు వేశారు. తెలుగుదేశం పార్టీ నుండి సాదుల రాజమణి శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. నాయకులు ముప్పెడ ...

Read More »

ఓం నమ:శివాయ తో మారుమోగిన శివాలయాలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్యాట్‌, మోర్తాడ్‌, సుంకెట్‌, ధర్మోరా, షెట్పల్లి, గాండ్లపేట్‌, శివాలయాల్లో మహాశివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం ఆయా గ్రామాల్లో వేదపండితులతో స్వామివారి కళ్యాణోత్సవం, యజ్ఞం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. అర్ధరాత్రి ఆయా గ్రామాల్లో రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రథానికి మంగళహారతులతో స్వాగతం పలుకగా, భజనలు, నామస్మరణతో రథోత్సవం సాగింది. శనివారం ఆయా ఆలయాల వద్ద గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ...

Read More »

మైనార్టీ గురుకులంలో ప్రవేశాలు ప్రారంభం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ రెసిడెన్షియల్‌ గురుకుల ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని, ఆర్మూర్‌ మైనార్టీ రెసిడెన్షియల్‌ ప్రిన్సిపాల్‌ షేక్‌ మన్నన్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో 15 మైనార్టీ రెసిడెన్సియల్‌ పాఠశాలలను మంజూరు చేసిందని, అందులో బాలికలకు 8, బాలురకు 7 పాఠశాలలున్నాయని అన్నారు. ఆర్మూర్‌లో బాలుర, జిల్లా కేంద్రంలోని మోపాల్‌లో బాలికల, బోధన్‌ -బాలికల మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు గత సంవత్సరం నుంచి కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ...

Read More »