Breaking News

నాలుగోవిడత నీటి విడుదల

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు హెర్తులుస్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన కాలువ గేట్లద్వారా నాలుగోవిడత నీటి విడుదల చేస్తున్నట్టు ఇఇ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న లక్ష 15 వేల ఎకరాల్లో పంట సాగుచేసుకుంటున్నారని, పంటలు కాపాడేందుకోసం నీటి విడుదల చేస్తున్నామన్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని రైతులు నీటిని వృధా చేయకుండా పంటకు నీటిని అందజేయాలని సూచించారు. నాలుగోవిదత నీటిని పదిరోజుల పాటు విడుదల చేయడం జరుగుతుందని, పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

6 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పాదన

నిజాంసాగర్‌ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో హెర్తులుస్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో 6 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదన జరుగుతందని జెన్‌కో ఎడిఇ శ్రీకాంత్‌ తెలిపారు. 1వ, 2వ టర్బయిన్‌లద్వారా 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో విద్యుత్‌ ఉత్పాదన సాగుతుందని చెప్పారు. నీటి విడుదల పెంచితే విద్యుత్‌ ఉత్పాదన పెరిగే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *