Breaking News

ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట దర్నా

 

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట మంగళవారం తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆద్వర్యంలో ఆర్టీసి కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ డిపో కార్యదర్శి నారాయణ, అధ్యక్షుడు రంజిత్‌ రెడ్డిలు మాట్లాడుతూ ఆర్‌పిఎస్‌ మూడో విడత ఏరియర్స్‌ను లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ను డిఎ ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీవో నెం. 1/2017ను వెంటనే రద్దుపరచాలని అన్ని క్యాటగిరీల్లో ఖాళీలు భర్తీచేయాలని, కార్మికులకు పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్లు చేశారు. మార్చి 8న బస్‌ బవన్‌ ముట్టడించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు శ్రీనివాస్‌, హరినాథ్‌, కౌసర్‌, కెసి.రెడ్డి, మోయిన్‌, గోపాల్‌, రావు, దేవేందర్‌, సుభాష్‌, కుసుమ, అరుణమ్మ, రాణి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రూ. 3 లక్షల విలువ చేసే గుట్కా, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు ...

Comment on the article