Breaking News

విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ

 

మోర్తాడ్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ కస్తూర్బా విద్యాలయంలో 32 మంది 10వ తరగతి విద్యార్థినిలకు మోర్తాడ్‌ ఉపసర్పంచ్‌ స్వచ్చందంగా పరీక్ష అట్టలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్దిలో బాగంగా తనవంతుగా విద్యార్థులకు సేవలందిస్తున్నామన్నారు. విద్యార్థుల సమస్యల్ని తమ దృష్టికి తెస్తే ప్రశాంత్‌రెడ్డి యువసేన దృష్టికి తీసుకెళ్లి సహాయ సహకారాలు అందిస్తామని ఉపసర్పంచ్‌ జెడి. గంగారెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రాజేశ్వర్‌ అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *