Breaking News

జేవివి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు

 

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సమాజాభివృద్దిలో సైన్స్‌ పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 900 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నట్టు జేవివి జిల్లా అధ్యక్షుడు ఉప్పునూతల నాగరాజు గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న మూడవిశ్వాసాలను, చాందస భావాలను అరికట్టడానికి ప్రజలను చైతన్యంచేసేందుకు జేవివి పనిచేస్తుందన్నారు. సమాజాభివృద్దిలో సైన్స్‌ పాత్ర ఎంతో ఉందని, ప్రజలు,విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల కన్వీనర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *