Breaking News

పరిశుభ్రత పాటించకుంటే రోగాల బారినపడతారు

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో పారిశుద్యం లోపించకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఎంపిడివో రాములు నాయక్‌ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను, కుళాయి పన్నుల వసూలు వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లోని మురికి కాలువలు ఎప్పటికప్పుడు పారిశుద్య సిబ్బంది శుబ్రం చేసి, తీసిన మట్టిని డంపింగ్‌ యార్డుకు తరలించాలన్నారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శులు క్యాసప్ప, సంధ్యారాణి, తదితరులు ఉన్నారు.

Check Also

రూ. 3 లక్షల విలువ చేసే గుట్కా, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు ...

Comment on the article