Breaking News

జవహార్‌ నవోదయలో వైద్య శిబిరం

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని జవహార్‌ నవోదయ విద్యాలయంలో విద్యార్తిని విద్యార్థులకు వైద్యురాలు స్పందన మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెలకోసారి విద్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 78 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అత్యవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. మిగతా వారికి మందులను ఇవ్వడం జరిగిందన్నారు. ఆహారం తీసుకునేటపుడు చేతులు శుభ్రంగా కడుక్కొని పదార్థాలు తినాలని విద్యార్థులకు సూచించారు. శిబిరంలో ప్రిన్సిపాల్‌ శేఖర్‌బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *