Breaking News

చికిత్స పొందుతూ ఒకరి మృతి

 

బీర్కూర్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని వీరాపూర్‌ గ్రామానికి చెందిన పోశయ్య (33) మృతి చెందినట్టు గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం మృతుడు చెడు వ్యసనాలకు బానిసై గత మూడురోజుల క్రితం క్రిమిసంహారక మందు సేవించాడని, చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ తరలించారన్నారు. అక్కడ చికిత్స అనంతరం స్వగ్రామానికి చేరుకున్న తర్వాత గ్రామంలో మృతి చెందాడన్నారు. కాగా మృతునికి ఇద్దరు సంతానం ఉన్నారని అన్నారు. మద్యం సేవిస్తు జూదానికి బానిస అయ్యాడని, ఈ క్రమంలోనే పురుగుల మందు సేవించి చనిపోయాడని పేర్కొన్నారు.

Check Also

సొంతింటి (కల) గానే మిగిలిపోయింది…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఆశపెట్టి ...

Comment on the article