Breaking News

ధర్మోరాలో స్పెషల్‌ డ్రైవ్‌

 

మోర్తాడ్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని ధర్మోరా గ్రామంలో మంగళవారం మండల కార్యదర్శులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో ఇంటింటికి తిరుగుతు ఇంటి పన్ను బకాయిలు చెల్లించి గ్రామాభివృద్దికి సహకరించాలంటూ 41 వేల రూపాయలు వసూలు చేసినట్టు మండల కార్యదర్శులు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శులు స్వప్న, గంగాదాస్‌, సాజన్‌కుమార్‌, కేశవనాథ్‌ స్వామి, రమేశ్‌, తిరుపతిరెడ్డి, కారోబార్‌ సాయన్న ఉన్నారు.

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ బృందానికి కానిస్టేబుల్‌ను నియమించాలని మండల కార్యదర్శులు అన్నారు. ధర్మోరా గ్రామంలో ఇంటి పన్నులు చెల్లించకపోవడంతో నల్లా కుళాయిలను తొలగించారు. బకాయిదారులు తప్పతాగి కార్యదర్శుల బృందంపై తిరుగబడ్డారు. దీంతో ఈ విషయం గమనించి ఎంపిడివో దృష్టికి తీసుకొచ్చారు. గ్రామస్తులు సమావేశమై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తమకు రక్షణగా కానిస్టేబుల్‌ను నియమించాలని కార్యదర్శులు కోరుతున్నారు.

Check Also

సొంతింటి (కల) గానే మిగిలిపోయింది…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఆశపెట్టి ...

Comment on the article