Breaking News

Monthly Archives: February 2017

ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

  నందిపేట, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు ప్రతి యేడు దళారుల చేతుల్లో మోసపోతున్నారని, రైతులకు మాయమాటలు చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించుకుంటున్నారని ఆరోపించారు. ఈనెల 28న మంగళవారం ఆర్మూర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీ, ధర్నాకు మండలంలోని రైతులు అధిక ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  నందిపేట, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులకు 10,500 లకు వేతనం పెంచినందున సోమవారం మండలంలోని విఆర్‌ఏలు తహసీల్‌ కార్యాలయం ఎదుట సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాలు పెంచడమే గాకుండా తమ డిమాండ్లు పరిష్కరించడానికి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సొంత ఊళ్ళలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించి ఇస్తామనడం సంతోషంగా ఉందన్నారు. బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేముల ...

Read More »

పొలాలు ఎండిపోతున్నాయి… నీళ్ళివ్వండి మహా ప్రభో!

  బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత రబీ కాలంలో చివరి ఆయకట్టు ప్రాంతంలో ఉన్న పొలాలకు చెరువు నీరు అందడం లేదని, అట్టి పొలాలకు నీరు అందించాలని ప్రజావాణిలో బీర్కూర్‌ గ్రామస్తులు తహసీల్దార్‌ కృష్నానాయక్‌కు వినతి పత్రం అందించి నీటిని అందించాలని మొరపెట్టుకున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నా నీరు సరిగా వదలడం లేదని, వదిలిన కాస్త నీరే చెరువుకు దగ్గర్లోని పొలాలకు అందుతుందని, చివరి ఆయకట్టు రైతులకు నీరందడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఒక్క ...

Read More »

ఎండాకాలం వస్తుంది – తాగునీటిపై శ్రద్ద వహించండి

  బీర్కూర్‌ ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరికొద్ది రోజుల్లో వేసవి కాలం సమీపిస్తుందని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోగల పంచాయతీ కార్యదర్శులు తాగునీటిపై శ్రద్ద వహించాలని మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండల అభివృద్ది కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవి కాలం దృష్ట్యా ఆయా మండలాల్లోని ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వాటర్‌ ట్యాంకులు, చేతిపంపుల పనితీరుపై శ్రద్ద వహించాలని, మంచినీటి సౌకర్యం తక్కువగా ఉన్న ...

Read More »

సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోండి

  – ప్రజావాణిలో ఫిర్యాదు బీర్కూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్‌ మల్లికార్జున్‌పై చర్యలు తీసుకోవాలని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేసినట్టు ఆయా మండలాల తహసీల్దార్లు డేవిడ్‌, కృష్ణానాయక్‌ తెలిపారు. బీర్కూర్‌ మండలంలో కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన పీరయ్య అనే వ్యక్తి ఇసి కొరకు సబ్‌రిజిస్ట్రార్‌ను సంప్రదించగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని బీర్కూర్‌ ప్రజావాణిలో పిర్యాదు చేశారు. అదేవిధంగా నెమ్లి గ్రామానికి చెందిన కె.హన్మాండ్లు అనే వ్యక్తి పొలం పట్టా రిజిస్ట్రేషన్‌ తదితర ...

Read More »

గ్రామాల అభివృద్దే తెరాస ధ్యేయం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో అన్ని గ్రామాల సమగ్ర అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్నామని మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని రామన్నపేట్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, మహిళా భవనం, గోదాము నిర్మాణం పనులకు , సుంకెట్‌లోని గ్రామ పంచాయతీ భవనం, దోన్‌పాల్‌, ఒడ్యాట్‌ గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలకు, షెట్పల్లి, తడ్‌పాకల్‌ గ్రామాల్లో నూతనంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ ...

Read More »

ఓం శ్రీ గురుభ్యోనమ

ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 ఫిబ్రవరి 27, 2017 సోమవారం(ఇందువాసరే) శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్ల పక్షం తిధి :పాడ్యమి రా7.04 తదుపరి విదియ నక్షత్రం : శతభిషం ఉ6.49 తదుపరి పూర్వాభాద్ర యోగం :సిద్ధం సా4.39 తదుపరి సాధ్యం కరణం :కింస్తుఘ్నం ఉ8.19 తదుపరి బవ రా7.5 సూర్యరాశి :కుంభం చంద్రరాశి :కుంభం సూర్యోదయం :6.22 సూర్యాస్తమయం :6.35 రాహుకాలం : ఉ8.03 – 9.31 యమగండం : మ11.00 – 12.28 వర్జ్యం : ...

Read More »

రైల్వేగేటును ఢీకొన్న ట్రాక్టర్‌

  – తప్పిన ప్రమాదం కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి రైల్వేగేటును సోమవారం ఓ ట్రాక్టర్‌ ఢీకొనడంతో గేటు విరిగిపోయింది. సిగ్నల్స్‌ సైతం విరిగిపోవడంతో సిగ్నలింగ్‌ వ్యవస్థకు అంతరాయం కలిగింది. రైల్వేగేటును ఢీకొనగానే ట్రాక్టర్‌ డ్రైవర్‌ అక్కడే వదిలేసి ఉడాయించాడు. దీంతో తేరుకున్న రైల్వే గేటు కాపలాదారుడు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు సిగ్నలింగ్‌ వ్యవస్థను, గేటును పునరుద్దరించే పనుల్లో నిమగ్నమయ్యారు. రైల్వే గేటు లేకపోవడంతో అక్కడే ఉండి ట్రాఫిక్‌ను ...

Read More »

నేడు ప్రజావాణి, డయల్‌ యువర్‌ ఎస్పీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయంలో డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సోమవారం ప్రజావాణితోపాటు డయల్‌ యువర్‌ కలెక్టర్‌, డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 11 మధ్య నేరుగా డయల్‌ యువర్‌ ఎస్పీలో జిల్లా ఎస్పీకి ఫోన్‌చేసి తమ సమస్యలను విన్నవించవచ్చని ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా ...

Read More »

వందేభారత్‌ ట్రస్టు జిల్లా అధ్యక్షునిగా సుధాకర్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వందేభారత్‌ ట్రస్టు కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా మాజీ కౌన్సిలర్‌ జూలూరి సుధాకర్‌ను నియమిస్తు రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ఉత్తర్వులు జారీచేసినట్టు సుధాకర్‌ తెలిపారు. వందేభారత్‌ ట్రస్టు జాతీయ అధ్యక్షుడు మురళీధర్‌రావు ఈ మేరకు ఫ్యాక్సు ద్వారా నియామక పత్రం పంపారన్నారు. జిల్లా ఉపాద్యక్షునిగా ఎర్రం రాజు, కార్యదర్శిగా ప్రవీణ్‌, దోమకొండ మండల అధ్యక్షునిగా బుర్రి ప్రసాద్‌, మాచారెడ్డి శ్రీధర్‌, కామారెడ్డి మండల అధ్యక్షునిగా బొమ్మర నరేందర్‌, గాంధారి మండల అధ్యక్షునిగా ...

Read More »

షబ్బీర్‌ అలీకి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సన్మానం

  కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీని ది కామారెడ్డి లారీ ఓనర్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ప్రతినిదులు ఘనంగా సన్మానించారు. షబ్బీర్‌ అలీ మంత్రిగా ఉన్నపుడు లారీ ఓనర్స్‌ ప్రతినిధులను అన్ని విధాలుగా ఆదుకున్నారని పేర్కొన్నారు. షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ లారీ ఓనర్స్‌ బిల్డింగ్‌ అదనపు గదుల నిర్మాణానికి, సిసి రోడ్డు ఏర్పాటుకు ఎమ్మెల్సీ నిదులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. లారీ ఓనర్స్‌ ప్రతినిధులు, డ్రైవర్లకు ఎప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు ...

Read More »

స్వచ్చ నందిపేట్‌గా తీర్చిదిద్దుతాం

  నందిపేట, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎవరో వస్తారు.. ఏమో చేస్తారు.. అనేవి పక్కన బెట్టి మా ఊరు మేమే బాగుచేసుకుంటాం… మా ఊరు రోడ్లను మేమే శుభ్రం చేసుకుంటాం అంటూ నందిపేట యువకులు ముందుకొచ్చారు. గతంలో బస్టాండ్‌, తదితర ప్రాంతాల్లో స్వచ్చ నందిపేట కార్యక్రమాన్ని చేపట్టి శుభ్రం చేశారు. అదేవిధంగా ఆదివారం నందిపేట సేవాసమితి సభ్యులు, దుకాణ దారులు కలిసి బస్టాండ్‌ ముందుగల మెయిన్‌ రోడ్డును శుభ్రం చేశారు. చీపుర్లు చేతబట్టుకొని యువకులు మేము సైతం అంటూ ...

Read More »

ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి

  గాంధారి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలని గాంధారి తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి ఉంటుందన్నారు. మండల ప్రజలు తమకు సంబంధించిన సమస్యలు, వినతి పత్రాలు నేరుగా కార్యాలయానికి వచ్చి అందజేయాలన్నారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అన్నిశాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని లక్ష్మణ్‌ సూచించారు. ప్రజావాణిలో పాల్గొనని అధికారుల జాబితా పై అధికారులకు ...

Read More »

ఎర్రజొన్నకు 5 వేల మద్దతు ధర ఇవ్వాలి

  నందిపేట, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎండనక, వాననక కష్టపడి పండించిన జొన్నపంటకు గత సంవత్సరం 5 వేలు ధర ఉంటే అదే జొన్నలకు ఈయేడు వ్యాపారుల సిండికేట్‌ కారణంగా 2 వేలు ధర ఉంది. కావున జొన్నలను 5 వేల రూపాయలకు క్వింటాలు చొప్పున ప్రభుత్వమే కొనుగోలుచేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్మూర్‌లోని క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించే ఛలో ఆర్మూర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ...

Read More »

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

  గాంధారి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు హైదరాబాద్‌ నిజాం కాలేజ్‌ మైదానంలో ఆదివారం జరిగిన సభకు గాంధారి మండలానికి చెందిన ఉపాధ్యాయులు తరలివెళ్లారు. సిపిఎస్‌ విధానంతో ప్రభుత్వ ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని, వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ వల్ల పదవి విరమణ పొందిన తరువాత ఉద్యోగులకు ఎలాంటి ...

Read More »

రైతులు పొదుపుగా నీటిని వాడుకోవాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు నిజాంసాగర్‌ ద్వారా వదిలిని నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోగల 23, 24, 25వ డిస్ట్రిబ్యూటర్‌ ప్రధాన కాలువలను మంత్రి ఆదివారం పరిశీలించారు. అనంతరం నసురుల్లాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. నిజాంసాగర్‌ ద్వారా వదిలిన నీరు మండలానికి చేరుకోవడానికి 48 గంటలు సమయం పట్టేదని, నిజాంసాగర్‌ ఆధునీకరణ ...

Read More »

ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి ద్వారా రూ. 2 లక్షలు పంపిణీ

  బీర్కూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సహకార సంఘం సభ్యుడు హాజీపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్‌ జనవరి 6వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి పథకం ద్వారా రూ. 2 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్‌ గంగారాం, ఎన్‌డిసిసి బ్యాంకు మేనేజర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా కుస్తీ పోటీలు

  బీర్కూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శివరాత్రి పురస్కరించుకొని మండలంలోని కామప్ప దేవాలయంలో, నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి సోమలింగేశ్వర ఆలయంలో, మిర్జాపూర్‌లోని హనుమాన్‌ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీలో పాల్గొన్నారు. గెలుపొందిన మల్లయోధులకు శాలువాతో సత్కరించి నగదు పురస్కారాలుఅందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

వార్డు మెంబరు ఎన్నిక ఏకగ్రీవం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవుపల్లి గ్రామం 10వ వార్డుకు జరిగిన వార్డుసభ్యుని ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బోజరావు తెలిపారు. నామినేషన్‌కు 26వ తేదీ చివరిరోజు కావడంతో ఒక్కరే నామినేషన్‌ వేయడంతో రామస్వామికి ఏకగ్రీవంగా గెలిచినట్టు దృవీకరణ పత్రం అందించినట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

ఎమ్మెల్యే, ఎంపి సహకారంతో గ్రామాభివృద్దికి కృషిచేస్తా

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, వరంగల్‌ ఎంపి రాపోలు భాస్కర్‌ సహాయ సహకారాలతో ఏర్గట్ల గ్రామాన్ని అభివృద్దికి కృషి చేస్తామని సర్పంచ్‌ శ్రీవైష్ణవి అన్నారు. వరంగల్‌ ఎంపి కోటా కింద అందించిన 35 లక్షల నిధులతో ఏర్గట్ల గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి ఆదివారం సర్పంచ్‌ భూమిపూజచేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ 5 సంఘాలకు కమ్యూనిటీ భవనాలు, గ్రామంలో ప్రధాన ...

Read More »