Breaking News

Monthly Archives: February 2017

50 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిస్తాం

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజాంసాగర్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల పంటలు సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నిరకాల చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి వృధానీటిని కాళేశ్వరం లోనికి మళ్ళించేందుకోసం 83 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. 25 వేల కోట్ల ...

Read More »

నిరుపేదలకు వరంగా సిఎం సహాయనిధి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేద కుటుంబాలకు వరంగా మార్చి సిఎం సహాయ నిధి పథకం కింద నిధులు అందిస్తు కృషి చేస్తున్న ఘనత ఎమ్మెల్యేదేనని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియాలు అన్నారు. ఆదివారం మోర్తాడ్‌లో నోముల రమేశ్‌ కుటుంబానికి 58 వేలు, నోముల హర్షిత కుటుంబానికి 75 వేలు సిఎం సహాయనిధి కింద ఎమ్మెల్యే అందించారని వారు తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న ...

Read More »

విద్యార్థులు, యువతకోసం ప్రశాంత్‌రెడ్డి యువసేన కృషి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు, యువత అభివృద్దికి ప్రశాంత్‌రెడ్డి యువసేన కృషి చేస్తుందని జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌ దడివెనవీన్‌లు అన్నారు. ఆదివారం మోర్తాడ్‌లో ప్రశాంత్‌రెడ్డి యువసేన ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్ని ప్రారంభించారు. ముందుగా దివంగత నేత వేముల సురేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని ఎంపిపి, జడ్పిటిసి బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ...

Read More »

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుచేస్తాం

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం కెసిఆర్‌ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను తమవంతు బాధ్యతగా సక్రమంగా అందరికి అందేలా కృషిచేస్తామని గ్రామసేవకుల, విఆర్‌ఏల జిల్లా అధ్యక్షుడు ఆశన్న అన్నారు. ఆదివారం మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు, విఆర్‌ఏలు సిఎం కెసిఆర్‌, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ళలోపే దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారైన గ్రామసేవకులు, విఆర్‌ఏలకు వేతనాలు పెంచడమే గాకుండా ...

Read More »

సౌదీకెళ్లాలంటే..అంత మొత్తం చెల్లించాల్సిందే

సౌదీఅరేబియా: ప్రపంచంలోనే క్రూడ్‌ఆయిల్ ఉత్పత్తిలో సౌదీకి ప్రత్యేకస్థానం ఉంది. అలాంటి సౌదీ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. దాన్నుంచి బయటపడేందుకు స్వదేశానికి చెందినవారినే కొలువుల్లో నియమించుకోవాలని నిర్ణయించింది. సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం లక్షలాది వలస కార్మికులకు శరఘాతంగా పరిణమించింది. ఉన్నఊళ్లో ఉపాధి కరువై చాలా గల్ఫ్ దేశాల బాటపడుతున్నారు. అలాంటి వారి ఆశలపై ఈ నిర్ణయం నీళ్లు చల్లినట్లయింది. క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్లో తగ్గిపోవడం, ఉత్పత్తికి సరిపడ ధర లభించకపోవడంతో చాలా కంపెనీలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అందువల్లే ఇంత ...

Read More »

భారత్‌కు విదేశీ పాలు!

దేశీ ఉత్పత్తి పెరగకుంటే నాలుగేళ్లలో దిగుమతులపైనే ఆధారం పశుగ్రాసం కరువవడంతో తగ్గుతున్న పాల ఉత్పత్తి ఉదయాన్నే పిల్లలకు పాలు, పెద్ద వాళ్లకు చాయ్‌… భోజనంలో నెయ్యి, పెరుగు, తాగడానికి మజ్జిగ.. ఇలా పాలు, పాల పదార్థాల వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. ఇదేస్థాయిలో పాల ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. డిమాండ్‌కు తగిన స్థాయిలో పాల ఉత్పత్తి లేకుంటే రానున్న కాలంలో విదేశీ పాలను దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుందని ప్రభుత్వ గణాంకాల స్పష్టం చేస్తున్నాయి. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న భారత్ సమీప ...

Read More »

జయ మృతిపై అనుమానం.. డాక్టర్‌ అరెస్టు

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన డాక్టర్‌ రామసీతను శనివారం చెన్నై సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. జయలలిత మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న అనేక మంది దీనిపై న్యాయ విచారణ జరపాలని పట్టుబడుతున్నారు. అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో తెరపైకి వచ్చిన రామసీత జయలలిత మేన కోడలు దీప, మాజీ సీఎం పన్నీరుసెల్వంలను వేర్వేరుగా కలిసి తన మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక డాక్టర్‌గా జయలలిత మరణంపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు ...

Read More »

పోలీస్‌స్టేషన్‌కు చేరిన సింధు – శిరీషల ప్రేమాయణం

⇒ మేమిద్దరం కలిసే జీవిస్తాం ⇒ వెల్లడించిన ఇద్దరు యువతులు కమాన్‌పూర్‌(మంథని): కొద్దినెలలుగా చర్చనీయాంశంగా మారిన ఇద్దరి యువతుల ప్రేమాయణం వ్యవహారం కమాన్‌పూర్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. ఆరునెలలు దూరం ఉంటామని అంగీకరించిన వారిద్దరూ రెండునెలలు గడవకముందే ఇంటి నుంచి పారిపోయారు. ఎట్టకేలకు పోలీసులు వారిని పట్టుకున్నారు. తమను విడదీయొద్దని..ఒకరిని విడిచి ఉండలేమంటున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన శిరీష, సింధు. కమాన్‌పూర్‌ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన దాసరి శిరీష. రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన గుర్రాల సింధు ఓ పాఠశాలలో నిర్వహించిన డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌తో  ...

Read More »

కరెంటు మంటల్లో కాలిన బతుకు

గుంటూరులో విషాదం కరెంటు మంటల్లో ఓ పేద బతుకు నిలువునా కాలిపోయింది! దుకాణం ప్రారంభోత్సవం కోసం ఫ్లెక్సీ కట్టే యత్నంలో..ఆ ఫ్లెక్సీకి అమర్చిన ఐరన్‌ ఫ్రేమ్‌ పైనున్న హైటెన్షన్‌ విద్యుత్ వైర్లకు తగలడంతో కరెంట్‌ షాక్‌ కొట్టి ఆలేటి మహేశ్‌ (20)దుర్మరణం పాలయ్యాడు. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన రోడ్డుపైని నీరూస్‌ దుకాణ ప్రారంభోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తుండగా ఈ అపశ్రుతి చోటు చేసుకుంది. పిడుగురాళ్లకు చెందిన మహేశ్‌.. ఆ దుకాణాన్ని ఏర్పాటు చేసిన భవనానికి ఏడాది ...

Read More »

పాక్‌ సంతోషించేలా చిదంబరం వ్యాఖ్యలు

కశ్మీర్‌ను దేశం కోల్పోవచ్చని కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. చిదంబరం వ్యాఖ్యలు పాకిస్థాన్‌కు సంతోషం కలిగించేలా ఉన్నాయన్నారు. భారత మాజీ హోంమంత్రి, ప్రముఖ లాయర్‌ అయిన చిదంబరమే తమ వాదనకు అనుకూలంగా మాట్లాడారని పాక్‌ అనేక వేదికలపై విషం చిమ్మే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌, ఢిల్లీలోనూ ఆయన మాట్లాడుతూ.. చిదంబరం వ్యాఖ్యలు, కశ్మీర్‌ సమస్యపై కాంగ్రెస్‌ వైఖరేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ ...

Read More »

పూర్తి బాధ్యత నాదే, ఆ తప్పును ఒప్పుకోవాల్సిందే : కోహ్లీ ఆవేదన

పూణె: వరుసగా 19 టెస్టుల్లో నెగ్గి జోరు మీదనున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ జైత్ర యాత్రను ఆస్ట్రేలియా జట్టు అడ్డుకుంది. తొలి టెస్ట్‌లో 333 పరుగుల భారీ తేడాతో ఓడించింది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తమపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని అన్నాడు. ఊహించని విధంగా మ్యాచ్ ఫలితం వచ్చిందని చెప్పాడు. తాము బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యామనే విషయాన్ని ఒప్పుకోవాలంటూ గత రెండు సంవత్సరాల్లో ఇది తమ వరస్ట్ బ్యాటింగ్ అని చెప్పాడు. తామంతా కూర్చుని ఈ ...

Read More »

నలుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఇల్చిపూర్‌ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 8,300 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించినా, పేకాట ఆడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఎవరైనా సమాచారం ఇవ్వాలనుకుంటే 9440795437కు ఫోన్‌ చేయాలని ఎస్‌ఐ సంతోష్‌ సూచించారు.

Read More »

తైబజార్‌ వేలం పాట

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పురపాలక సంఘ పరిధిలో తైబజార్‌ వేలం పాటను శనివారం కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, కమీషనర్‌ విజయలక్ష్మిలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కార్యాలయ ఆవరణలో వేలం పాట నిర్వహించగా తైబజార్‌ తీసుకునేందుకు వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. అత్యధిక ధరకు వేలం పాట పాడిన వారికి తైబజార్‌ దక్కుతుంది. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, అధికారులు పాల్గొన్నారు.

Read More »

వికాసవర్గకు తరలిన బిజెపి నాయకులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయస్వయం సేవకసంఘ వివిధక్షేత్ర వికాసవర్గ రెండ్రోజులపాటు ఆర్మూర్‌ లోని క్షత్రియ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరగనుంది. ఈ మేరకు శనివారం ఉదయం కామారెడ్డి నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వికాస వర్గలో రెండ్రోజుల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యకర్తల వ్యక్తిగత నిర్మాణం, పార్టీ పట్ల అవగాహన, స్థానిక పరిస్థితుల అధ్యయనం, అందుకనుగుణంగా పార్టీ పటిష్టత తదితర విషయాలు చర్చించడం జరుగుతుందన్నారు. వర్గలో ఆరెస్సెస్‌ ...

Read More »

సిసి డ్రైన్‌ పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో సిసి డ్రైన్‌ పైప్‌లైన్‌ పనులను శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు 2 లక్షల వ్యయంతో సిసి డ్రైన్‌ పనులు, రూ. లక్షతో పైప్‌లైన్‌ పనులు, రూ. లక్ష తో సిసి రోడ్డు పనులను చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ అంజద్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

శివరాత్రి ముగింపు ఉత్సవాల్లో ఎంపి బి.బి.పాటిల్‌

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలోని గోద్మెగాం, పడకల్‌ గ్రామ శివారులోగల పరమేశ్వర, నీలకంఠేశ్వర ఆలయాలను శనివారం జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌ సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక హారతులిచ్చి, తీర్థ, ప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి ఆలయం అభివృద్దికి నోచుకోలేదన్నారు. చక్కని వాతావరణంలో ఉన్న ఈ రెండు ఆలయాలకు ఆలయ ప్రాంగణంలో అభివృద్ది చెందేలా అన్నిరకాల చర్యలు చేపడతామని అన్నారు. నీటి ...

Read More »

జాతరకు పోటెత్తిన భక్తజనం

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలోని గోద్మెగాం గ్రామ శివారులోగల నీలకంఠేశ్వర, పరమేశ్వర ఆలయాలకు శనివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ఉపవాసదీక్షలు విరమించారు. ఈ సందర్భంగా స్వామివారికి హారతి, భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. వైభవంగా జాతర ఏర్పాటు చేశారు. జాతరలో కంతి, నారాయణఖేడ్‌, పడకల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, పిట్లం, బిచ్కుంద, పెద్ద కోడప్‌గల్‌ తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Read More »

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజ్ఞానభారతి డిగ్రీ కళాశాల నూతన సంవత్సర క్యాలెండర్‌ను శివరాత్రిని పురస్కరించుకొని భిక్కనూరులోని సిద్దిరామేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మర్రి బాపురెడ్డి, హరిస్మరణ్‌రెడ్డి, కాషాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మీడియం గూడ్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మీడియం గూడ్స్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నట్టు ప్రతినిధులు తెలిపారు. నూతన అధ్యక్షునిగా అబ్దుల్‌ బారీ, ఉపాధ్యక్షునిగా రాజు, కార్యదర్శిగా సుభాష్‌, ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి, కోశాధికారిగా భీమేశ్‌, ఉప ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్‌, కార్యవర్గ సభ్యులుగా బాబు, రాము, స్వామి, అశోక్‌, క్రాంతికుమార్‌, మహేశ్‌గౌడ్‌, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

  గాంధారి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో శనివారం సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి విఆర్‌ఏలు పాలతో అభిషేకం చేశారు. విఆర్‌ఏల వేతనం 65 శాతం పెంచడంతోపాటు వారసత్వంగా చేస్తున్న విఆర్‌ఏలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు. అదేవిధంగా పబ్లిక్‌ సర్వీస్‌ పర్షీలు రాసిన విఆర్‌ఏలను రెగ్యులరైజ్‌ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. వేతనం పెంపుతోపాటు ఇండ్లు మంజూరు చేసినందుకుగాను మండల విఆర్‌ఏలు స్థానిక తహసీల్‌ కార్యాలయం ఎదుట కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Read More »