Daily Archives: March 1, 2017

కామారెడ్డి జిల్లాలో ఆర్డీవోలు, డిప్యూటి కలెక్టర్ల బదిలీలు

  కామారెడ్డి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఆర్డీవోలు, డిప్యూటి కలెక్టర్లను బదిలీ చేస్తు బుధవారం ఉత్వర్వులు వెలువరించింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. డిప్యూటి కలెక్టర్‌గా ఉన్న ఎస్‌. శ్రీనివాస్‌ కామారెడ్డి ఆర్డీవోగా నియమిస్తు ఉత్తర్వులు జారీఅయ్యాయి, అలాగే డిప్యూటి కలెక్టర్‌గా ఉన్న ఎస్‌.రాజేశ్వర్‌ను బాన్సువాడ ఆర్డీవోగా నియమిస్తు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో ఆర్డీవోలు, డిప్యూటి కలెక్టర్ల బదిలీలు

  నిజామాబాద్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఆర్డీవోలు, డిప్యూటి కలెక్టర్లను బదిలీ చేస్తు బుధవారం ఉత్వర్వులు వెలువరించింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. డిప్యూటి కలెక్టర్‌ టి.వినోద్‌ను నిజామాబాద్‌ ఆర్డీవోగా నియమిస్తు ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే పంచాయతీరాజ్‌ విభాగంలో డిప్యూటి కలెక్టర్‌గా ఉన్న జే.రాజేశ్వర్‌ నిజామాబాద్‌ జడ్పి సిఇవోగా నియమిస్తు ఉత్తర్వులు జారీఅయ్యాయి. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఎల్‌.రమేశ్‌ ఎస్సీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఇ.డి.గా ...

Read More »

వర్గీకరణ అమరవీరులకు శ్రద్దాంజలి

  కామారెడ్డి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణ కోసం ఇప్పటివరకు జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు ఎమ్మార్పిఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దండోరా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోళ్ల వెంకటేశ్‌, జిల్లా కన్వీనర్‌ పిరంగి రాజేశ్వర్‌లు మాట్లాడుతూ మొట్టమొదట 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో బండ్ల రవి ఆమరణ దీక్షలో ఆత్మహుతికి పాల్పడ్డాడని, అనంతరం మరికొంతమంది వర్గీకరణే ధ్యేయంగా ప్రాణాలర్పించారన్నారు. వారి ప్రాణత్యాగాలు వృధా కావని, ...

Read More »

ధూం..ధాం..గా ఆర్కిడ్స్‌ వార్షికోత్సవ వేడుకలు

  కామారెడ్డి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఆర్కిడ్స్‌ పాఠశాల 7వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం రాత్రి ధూం…ధాం…గా నిర్వహించారు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన వేడుకలు ఆహుతులను అలరించాయి. విద్యార్థుల సామాజిక, సాంస్కృతిక నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. విద్యార్థులు పలు నాటికలతో పాటు సినీ నేపథ్య, జానపద, సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన డిఇవో మదన్‌మోహన్‌ మాట్లాడుతూ ఆర్కిడ్స్‌ పాఠశాల అనతి కాలంలోనే మంచి ఉత్తీర్ణతతో పాటు పేరు సంపాదించడం అభినందనీయమన్నారు. పాఠశాల ...

Read More »

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

  కామారెడ్డి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూర్‌ గ్రామ పంచాయతీ ఇల్చిపూర్‌కు చెందిన కొంపల్లి రేవతి (28) అనే మహిళ బుధవారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. రేవతికి దోమకొండ మండలం లింగుపల్లికి చెందిన మహిపాల్‌తో వివాహం కాగా రెండేల్ల క్రితం విడాకులు తీసుకుందన్నారు. అప్పటినుంచి తల్లిగారి వద్ద ఉంటూ అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. ఈ క్రమంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. తమ్ముడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు ...

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు

  కామారెడ్డి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో తొలిరోజు ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్ష సరళిని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఆయా పరీక్షా కేంద్రాలకు వెళ్ళి పరీక్షల నిర్వహణ తీరును సమీక్షించారు. మొత్తం 10,052 విద్యార్థులకుగాను మొదటిరోజు 389 మంది గైర్హాజరయ్యారని, 9663 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదుకాలేదని విద్యాశాఖాధికారులు తెలిపారు. ప్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లతో పాటు విద్యాశాఖాధికారులు జిల్లాలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.

Read More »

పెండింగ్‌ కేసులు సత్వరం పరిష్కరించాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ వేదింపులు (అట్రాసిటీ) పెండింగ్‌ కేసులు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన మొదటి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటి, జిల్లా విజిలెన్సు, మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలపై పెండింగ్‌లో ఉన్న 12 కేసులు, అట్రాసిటీ కేసులపై దృష్టి సారించి విచారణ పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ...

Read More »

బల్దియా సర్వతోముఖాభివృద్దికి కృషి చేయాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ సర్వతోముఖాభివృద్దికి కృషి చేయాలని, 20 సూత్రాల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ చాంబరులో అర్బన్‌డే సందర్భంగా మునిసిపల్‌ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ ఆస్తిపన్ను వసూలు విషయమై ఆరా తీశారు. ఆస్తి పన్నులు సక్రమంగా వసూలు చేయకపోవడంతో బిల్‌ కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్‌ కలెక్టర్‌ సాయిలుపై చర్యలు ...

Read More »

పెంచిన నీటి విడుదల

  నిజాంసాగర్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్‌ కేంద్రానికి ప్రధాన కాలువ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని పంట సాగుకోసం తెలంగాణ ప్రభుత్వం 4 విడతలుగా నీటి విడుదల చేయడం జరుగుతుందని డిఇ దత్తాత్రి తెలిపారు. ప్రధాన కాలువ వద్ద నీటి దుర్వినియోగానికి పాల్పడకుండా నీటిపారుదల శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైతులు పంటకు కావాల్సిన నీటిని వాడుకోవాలని, నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ...

Read More »

వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక చొరవ చూపాలి

  నిజాంసాగర్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక చొరవ చూపుతూ బోధించాలని ఎంఇవో బలిరాం రాథోడ్‌ ఆదేశించారు. మండలంలోని హసన్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనికీచేశారు. ముందుగా తరగతి గదుల వారిగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, వారానికి మూడు కోడిగుడ్లను ఖచ్చితంగా అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశించారు. విద్యార్థుల కోసం తెలంగాణ ...

Read More »

జిల్లాలో నాటుసారా విక్రయాలు నిషేదించాలి

  కామారెడ్డి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో నాటుసారా విక్రయాలు పూర్తిగా నిషేదించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారులను జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ చాంబరులో ఎక్సైజ్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటుసారా, లిక్కర్‌ తయారుచేయడం వాటిని విక్రయించడం ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్తీకల్లు నిషేదించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై విస్తృతంగా రైడింగ్‌ జరిపి తయారీదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పట్టణంలో ...

Read More »

నిరుద్యోగులతో చలగాట మాడితే ఖబడ్దార్‌

  గాంధారి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చెయ్యకుండా నిరుద్యోగులతో చలగాటమాడితే ఖబడ్దార్‌ అని తెరాస ప్రభుత్వాన్ని ఏబివిపి జిల్లా శాఖ హెచ్చరించింది. బుధవారం గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కో కన్వీనర్‌ మచ్చర్ల శ్రీకాంత్‌ మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తున్నా నిరుద్యోగుల గోసలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారన్నారు. వేలు ...

Read More »

వసతులు కల్పించాలని వినతి

  నిజాంసాగర్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో 18 గ్రామ పంచాయతీలుండగా 16 గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పనులు చేపడుతున్నారని, దీంతో మండలంలోని ప్రతి గ్రామంలో కూలీల సంఖ్య పెంచాలని కూలీలు ఎంపిడివో రాములు నాయక్‌తో అన్నారు. వెల్గనూరు గ్రామంలో జరిగిన పనులను ఎంపిడివో రాములు నాయక్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూలీల వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలని పీల్డ్‌ అసిస్టెంట్‌కు సూచించారు. పనులు జరిగేచోట కనీస వసతులు కల్పించాలని, ఇప్పుడే ఎండలు మండుతున్నాయని కూలీలు ...

Read More »

ఎస్సీ వర్గీకరణ సాధనే అమరులకు నిజనివాళి

  భీమ్‌గల్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 1వ తేదీ మాదిగ అమరవీరుల దినం సందర్భంగా భీమ్‌గల్‌ మండలంలోని ఛేంగల్‌ గ్రామంలో సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంఎస్‌ఎఫ్‌ మండల ఇన్‌చార్జి దూమల మహేశ్వర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఛేంగల్‌ గ్రామ అధ్యక్షుడు గుమ్మెర్ల శ్రీధర్‌ అమరవీరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో 18 మంది మాదిగ పౌరులు ప్రాణత్యాగంచేశారన్నారు. జాతికోసం వారు చేసిన ...

Read More »

దివ్యాంగులకు వ్యాయామ చికిత్స

  గాంధారి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని భవిత సెంటర్‌లో సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగులకు వ్యాయామ చికిత్సను డాక్టర్‌ మహేశ్‌ అందించారు. ఈ సందర్భంగా 8 మంది దివ్యాంగులకు ఫిజియోథెరఫి వైద్యాన్ని అందించారు. ఈ చికిత్సలో పిల్లల తల్లిదండ్రులకు వ్యాయామ పద్దతులను గురించి వివరించారు. ఇంటివద్ద ప్రతిరోజు వ్యాయామం చేయించాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మారుతి, రిసోర్సు టీచర్లు పెంటయ్య, సాయన్న, దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More »

ఇంటి పన్నులే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌

  గాంధారి, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి పన్ను వసూలే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని గాంధారి ఎండివో సాయాగౌడ్‌ అన్నారు. బుధవారం ఆయన తన చాంబరులో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో తప్పకుండా ఇంటి పన్నులు, నల్లా పన్నులు 100 శాతం వసూలు చేయాలన్నారు. ప్రతి రోజు ఒక గ్రామ పంచాయతీని ఎన్నుకొని స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలన్నారు. ఈనెల 31వ తేదీ లోగా అన్ని గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు ...

Read More »

తెరాసతోనే అభివృద్ధి

  మోర్తాడ్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని ఎంపిటిసి జక్కని సంధ్యారాణి, మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మధు అన్నారు. బుధవారం ఏర్గట్లలో పద్మశాలి భవన ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజచేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్ని గ్రామాల, అన్ని వర్గాల అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్నారని వారు తెలిపారు. పద్మశాలీ సంఘ భవన ప్రహరీగోడ ...

Read More »

బంగారు తెలంగాణే లక్ష్యంగా కృషి చేస్తాం

  మోర్తాడ్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ లక్ష్యం మేరకు ప్రతి అంగన్‌వాడి కార్యకర్త కృషి చేయాలని మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు కైరి దేవగంగు అన్నారు. బుధవారం మోర్తాడ్‌లో మండల అంగన్‌వాడి కార్యకర్తల ఆద్వర్యంలో సిఎం కెసిఆర్‌, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడి కార్యకర్తలను గుర్తించి రెండుసార్లు వేతనాలు పెంచడమే గాకుండా టిఎ, డిఎలతో పాటు ...

Read More »

తెరాసలో చేరిన మోర్తాడ్‌ సర్పంచ్‌

  మోర్తాడ్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్దిని చూసి తెరాసలో చేరినట్టు సర్పంచ్‌ దడివె నవీన్‌ తెలిపారు. బుధవారం ఆయన 70 వాహనాల్లో తమ అనుచరులను, యువజన సంఘాల సభ్యులను వెంటబెట్టుకొని ఆర్మూర్‌ తెరాస పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే వేములప్రశాంత్‌రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను, ఆయన అనుచరులను ఎమ్మెల్యే శాలువాలతో పార్టీలోకి స్వాగతించారు. ...

Read More »

బీడుభూములను సస్యశ్యామలం చేయాలి

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా మోర్తాడ్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అందించిన బీడు భూములను సాగుభూములుగా మార్చి పంటలు సాగుచేసుకునేలా ప్రతి ఒక్క శాఖాధికారి కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అన్నారు. మండలంలోని పాలెం, తిమ్మాపూర్‌ శివారులోగల ఎస్సీ, ఎస్టీ, బిసి బీడు భూములను జిల్లా కలెక్టర్‌ బుదవారం పరిశీలించారు. అనంతరం పాలెం గ్రామానికి చెందిన భూమి లబ్దిదారులతో, వివిధ శాఖాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ...

Read More »