Daily Archives: March 7, 2017

రైతులకు రుణాలు అందించడానికి సిద్దం

  గాంధారి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు వ్యవసాయ రుణాలు అందించడానికి గాంధారి సింగిల్‌ విండో సొసైటీ సిద్దంగా ఉందని డిసిఎంఎస్‌ సభ్యుడు సొసైటీ ఛైర్మన్‌ ముకుంద్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయంలో కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై చర్చించారు. రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి సొసైటీ సిద్దంగా ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంట రుణాలతో పాటు మాడిగేజ్‌ రుణాలు ఇవ్వడానికి కూడా సహకార ...

Read More »

గాంధారిలో ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

  గాంధారి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం రాంలక్ష్మణ్‌పల్లి నుంచి గుర్జాల్‌కు తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను అటవీ శాఖాధికారులు మంగళవారం సాయంత్రం పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేసి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని గాంధారి ఫారెస్టు కార్యాలయానికి తరలించారు. ట్రాక్టర్‌పై కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఆర్‌వో బాయాసాబ్‌ తెలిపారు. ఈ దాడుల్లో ఫారెస్టు సిబ్బంది శివజ్యోతి, తదితరులు ఉన్నారు.

Read More »

ముగిసిన వెల్మల్‌ ఎన్నికలు

  నందిపేట, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వెల్మల్‌ -1 ఎంపిటిసి ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. 66 శాతం పోలింగ్‌ అయినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బాలిక్‌ అహ్మద్‌ తెలిపారు. ఎంపిటిసి స్థానానికి జరిగిన ఎన్నికలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్‌ వేయగా, ఇద్దరు అభ్యర్థులు పోటీనుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పొలాల సునీత, తెరాస నుంచి ఐలి లక్ష్మి, టిడిపి నుంచి సామల రాజమణిలు పోటీపడ్డారు. ఎన్నికల గుర్తు సైతం కేటాయించిన తర్వాత కాంగ్రెస్‌, టిడిపి ...

Read More »

కామారెడ్డి జిల్లాకు రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరు

  కామారెడ్డి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు రెండు కొత్త మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరైనట్టు జిల్లా మైనార్టీ వెల్పేర్‌ అధికారి తెలిపారు. కామారెడ్డి, జుక్కల్‌లకు పాఠశాలలు మంజూరైనట్టు తెలిపారు. ఈనెల 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

Read More »

స్త్రీలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుదాం

  కామారెడ్డి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుదామని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి (పివోడబ్ల్యు) అరుణ పిలుపునిచ్చారు. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని మహిళలందరు జరుపుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. శ్రామిక మహిళల హక్కుల సాధన కోసం జరిగిన అనేక పోరాటాల నుంచి ఉద్భవించిన రోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినమన్నారు. సమాజంలో సగభాగమున్న మహిళల కోసం ...

Read More »

ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణం

  కామారెడ్డి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడలో మంగళవారం రేణుక ఎల్లమ్మ, జమదగ్ని కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో బోనాల ఊరేగింపు, పెద్ద పట్నం, ఒగ్గుకథ నిర్వహించారు. అంతకుముందు పట్టణంలో బోనాల ఊరేగింపు జరిపారు. యాదవ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు శ్రీశైలం, శ్రీనివాస్‌, నర్సింలు, ఆంజనేయులు, అశోక్‌, మహేశ్‌, శ్యాం తదితరులు పాల్గొన్నారు.

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 2వ వార్డులో మంగళవారం సిసి రోడ్డు పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 3.5 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట వార్డు కౌన్సిలర్‌ కె.గణేష్‌, తదితరులున్నారు.

Read More »

మత్స్యశాఖను కార్యాలయాన్ని అభివృద్ది చేస్తాం

  నిజాంసాగర్‌, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యశాఖ కార్యాలయ అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట మత్స్యశాఖ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన అనంతరం మాట్లాడారు. కార్యాలయం కోసం తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేసి మత్స్యశాఖకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. మత్స్య కార్మికులు పట్టిన చేప పిల్లలను దళారులకు విక్రయించవద్దన్నారు. ప్రాజెక్టును నమ్ముకొని మత్స్యకార్మికులు 1500 సంఘాలున్నాయని అన్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌, ...

Read More »

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవు

  కామారెడ్డి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఇసుకకు సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పక్కనున్న మహారాష్ట్రలో ఇసుక క్వారీలు ప్రారంభమయ్యాయని, అక్కడి నుంచి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి, పిట్లం ...

Read More »

పండుటాకుకు పుట్టెడు కష్టాలు…

  – అందరూ ఉన్న ఆమె అనాథ కామారెడ్డి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండుటాకుకు పుట్టెడు కష్టాలు మిగిలాయి… అందరూ ఉన్న ఆమె అనాధగా మిగిలింది… సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనలు నేటికి కనిపిస్తున్నాయి. కని, పెంచినోళ్లే కాదంటే బిచ్చమెత్తుకుని బతుకుతున్న వృద్దులు నేటికి సమాజంలో ఉన్నారు. అలాంటి వృద్దురాలి కథ ఇది. కామారెడ్డి పట్టణానికి చెందిన యాదమ్మ (75) గత కొంతకాలంగా కామారెడ్డిలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ మంగళవారం నిజామాబాద్‌ న్యూస్‌ కంటపడింది. ఆమెను ...

Read More »

మహిళలు ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి

  కామారెడ్డి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలని మానసికంగా బలంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా సహకార సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సొసైటీ ఫర్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ కౌన్సిలింగ్‌ ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌ ఆద్వర్యంలో కుటుంబ స్నేహిత డివిజనల్‌ కౌన్సిలింగ్‌ కేంద్రాల ద్వారా ఆనందమయ కుటుంబాలను పునర్‌ నిర్మించడంపై మహిళలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పాల్గొన్న ...

Read More »

పెరుగుతున్న నీటివిడుదల

  నిజాంసాగర్‌, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నాలుగో విడత నీటి విడుదల కొనసాగుతుంది. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న హెర్తులుస్‌ జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 2280 క్యూసెక్కుల నీరు ప్రధాన కాలువ ద్వారా విడుదల కొనసాగుతుంది. రైతుల అవసరాల మేరకు నీటి విడుదల కొనసాగుతుందని డిప్యూటి ఇఇ దత్తాత్రి తెలిపారు. ప్రధాన కాలువ నుంచి నీటి విడుదల కొనసాగడంతో అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్‌ కేంద్రంలో రెండు టర్బయిన్‌ల ద్వారా 8మెగావాట్ల ...

Read More »

తాగునీటి సమస్యపైనే ప్రధానంగా దృష్టి

  గాంధారి, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్టు గాంధారి జడ్పిటిసి తానాజీరావు అన్నారు. మంగళవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి యశోదాబాయి అధ్యక్షతన స్థానిక ఎండివో కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖలపై ప్రదానంగా చర్చించారు. ముఖ్యంగా వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య రాకుండా చూసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు, ప్రజాప్రతినిదులు సూచించారు. ...

Read More »

ఉత్తమ సంస్కారానికి ప్రతిబింబం పురస్కారం

  నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ సంస్కారానికి ప్రతిభకు ప్రభుత్వం పురస్కారం ఇస్తుందని, ఇందూరు తబల కళాకారిణి పాయల్‌ కోట్‌గిర్‌కర్‌ రాష్ట్రస్థాయి పురస్కారం రావడం అభినందనీయమని మన బ్రాహ్మణ సమాజం జిల్లా అధ్యక్షుడు జనగామ చంద్రశేఖర శర్మ అన్నారు. మంగళవారం స్థానిక గీతాభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పురస్కార గ్రహీత తబల కళాకారిణి పాయల్‌కు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ కళను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ...

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సిఎం వెల్లడించారు. మహిళల కోసం ఈ ఏడాది నుంచి కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయాలని సిఎం చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచాలని నిశ్చయించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని, మహిళాభ్యుదయానికి ...

Read More »

మైనార్టీ గురుకులాలలో ప్రవేశాలు

  వర్ని, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మైనార్టీ గురుకులాల్లో బాల, బాలికలు 5వ, 6వ, 7వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపిడిఓ సురేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బిసిలలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈనెల 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువుగా ఎంపిడివో సూచించారు.

Read More »

పారిశుద్య కమిటీ సభ్యులకు శిక్షణ

  వర్ని, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని, రుద్రూర్‌ మండలాల గ్రామ పారిశుద్య కమిటీ సభ్యులకు ఈనెల 8న బుధవారం ఉదయం 10 గంటలకు శిక్షణ ఇవ్వబడుతుందని ఎంపిడివో సురేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగే శిక్షణ కార్యక్రమానికి గ్రామానికి ఇద్దరు చొప్పున సభ్యులు తప్పకుండా హాజరయ్యేట్టు చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సభ్యులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలన్నారు.

Read More »

డ్రైవింగ్‌లో శిక్షణ

  వర్ని, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 21 నుంచి 40 సంవత్సరాల మధ్యవయసుగల యువకులు డ్రైవింగ్‌లో శిక్షణ కొరకు మైనార్టీ కార్పొరేషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌, నిజామాబాద్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపిడివో సురేందర్‌ అన్నారు. దరఖాస్తు దారులు ఎస్‌ఎస్‌సి లేదా 8వ తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన వారు అర్హులన్నారు. ఈనెల 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు అని ఆయన సూచించారు.

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు. సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులతో సమానంగాఅన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి మనం. గత సంవత్సరం వలేనే ఈ సంవత్సరం కూడా మరెందరో మహిళల విజయ గాథల్ని వింటామని ఆకాంక్షిస్తున్నాను. స్ఫూర్తివంతమైన మహిళా చైతన్య మూర్తులకు అభినందనలు. కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షులు

Read More »

9న కామ్రేడ్‌ రాయల సుభాష్‌ చంద్రబోస్‌ వర్ధంతి

  మోర్తాడ్‌, మార్చి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 9వ తేదీన కామ్రేడ్‌ రాయల సుభాష్‌ చంద్రబోస్‌ ప్రథమ వర్ధంతి జయప్రదం చేయాలని సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి, జిల్లా, మండల నాయకులు సారా సురేశ్‌, సత్తక్క, కిషన్‌లు కోరారు. రాయల సుభాష్‌ వర్ధంతిసభ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోగల ఎన్‌.ఆర్‌.భవన్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. న్యూడెమోక్రసి పిలుపుమేరకు అన్ని జిల్లాల్లో వర్ధంతి సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 10వ తేదీన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రథమ వర్ధంతిసభ నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. రాయల ...

Read More »