Breaking News

ఇస్లామిక్‌ స్టేట్‌ ‘ఉగ్ర’మూలాలు కదులుతున్నాయా?

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ సిరియా అండ్‌ ఇరాక్‌(ఐసిస్‌) మూ లాలు కదులుతున్నాయా? ప్రత్యేకించి ఇరాక్‌ నిర్వహిస్తున్న నిరంతర దాడులతో ఐసిస్‌ శిబిరాలు మారుతున్నాయా? ఇటీవలి ఐసిస్‌ అధిపతి అబూబాకర్‌ బాగ్దాది ప్రసంగంగా చెపుతూ టివి ప్రసార మాధ్యమాల్లో వచ్చిన ప్రకటన ఇందుకు ఊతంఇస్తోంది.ఇరాక్‌లో పతన మయ్యామని, ఘోరపరాజయం తప్పదని తనకార్యకర్తల ను దళాలను హెచ్చరించడంతోపాటు పారిపొమ్మన్నారు. లేదా అష్టదిగ్బంధనం జరిగితేపేల్చుకుని చచ్చి పోవాలం టూ మార్గనిర్దేశనం చేయడం ఐసిసిప్రాబల్యం తగ్గిపోతు న్నదన్న సంకేతాలిస్తోంది.

ఐసిసిఉగ్రవాద మూలాలు ఇరాక్‌, సిరియాలనుంచి ప్రపంచ దేశాలను సైతం చుట్టు ముట్టిన సంగతి తెలిసిందే. కరుడు గట్టిన ఉగ్రవాదంతో ఇస్లామ్‌ సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ప్రత్యేకించి పాశ్చా త్యదేశాలపై విరుచుకుపడుతున్న ఐసిస్‌ మారణహోమా నికి ఇటీవలికాలంలో అంతేలేకుండాపోయింది. గడచిన ఐదేళ్లుగా ఇంచుమించు ఏదో ఒక అగ్రరాజ్యంలో ఐసిస్‌ జాడ కనిపిస్తూనే ఉంది. ఆయాదేశాలు ఉలిక్కిపడుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో తాజాగా బాగ్దాదీ ప్రసంగంగా చెపుతున్న ఈప్రకటన అరబ్బేతర మిలిటెంట్లకు పారిపో వాలని,లేదా శత్రువులకు చిక్కకుండా కాల్చుకుని చచ్చిపో వాలని పిలుపునివ్వడం ఈ తీవ్రవాద సంస్థ మూలాలు కదులుతున్నాయన్న సంకేతాలను పంపించింది.మిలిటెం ట్లకు వీడ్కోలు ఉపన్యాసంగా చెపుతూ బాగ్దాదీ పిలుపు నిచ్చారని ఇరాకీ టివినెట్‌వర్క్‌ ఆల్‌సుమారియా ప్రక టించింది అదే వార్తలను ఆల్‌ అరే బియా సైతం ధృవీ కరించింది.

ఈ ప్రకటన పాఠంమొత్తం ఐసిస్‌ప్రచారకుల కు, సిద్ధాంతకర్తలకు పంచినట్లు సంస్థ చెపుతోంది. గడచిన కొన్నినెలలుగా ఇరాక్‌ప్రభుత్వం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉన్నప్రాంతాలు,స్థావరాలపై విరు చుకుపడుతూ అన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనంచేసు కుంటూ వస్తోంది. చివరిగా ఐసిస్‌కు కేంద్ర స్థావరంగా నిలిచిన మోసుల్‌ పట్టణం ఒక్కటే ఉంది. అది కూడా ఇరాక్‌దళాలు చేజిక్కించుకునే అవకాశాలుమెండుగా ఉండటంతో ఐసిస్‌అధిపతి ఇరాక్‌లో మనం ఓడి పోయా మని ఇక్కడినుంచి పరారీ కావడం లేదా తమకు తాము మిలిటెంట్లు పేల్చేసుకోవాలని పిలుపునిచ్చినట్లు ఇరాక్‌ టివిలుప్రచారం చేసాయి. మోసుల్‌ పట్టణంలో ఐసిస్‌ కార్యకలాపాలునిర్వహించే కార్యాలయాలన్నీ మూసేయా లని బాగ్దాదీ తనకేడర్‌కు ఆదేశాలిచ్చారు. బాగ్దాదీ లక్ష్యం గా జరిగిన పాశ్చాత్యదేశాల సంకీర్ణ సేనల దాడుల్లో అనే కపర్యాయాలు ఐసిస్‌ అధిపతి చనిపోయా డన్న వార్తలు వచ్చాయి. మరికొన్నిసార్లు జరిగిన దాడుల్లో ఆయన తీ వ్రంగా గాయపడిన సంఘటనలున్నాయి.

అలాగే బాగ్దా దీని పట్టిస్తే పదిమిలియన్‌ డాలర్ల బహుమతిని ఇస్తామ ని ఇరాక్‌ప్రభుత్వం ప్రకటించింది.ఐసిస్‌ను చుట్టుముట్టే ప్రణాళిక ఉధృతం కావడంతోనే బాగ్దాదీ ముందస్తు వ్యూ హంతో ఈ ప్రకటనచేస్తారన్న విశ్లేషణలుకూడా వెలువ డ్డాయి.ఇకఐసిస్‌ ప్రాబల్యంఉన్న దేశాలు సుమారు 11 వరకూఉన్నాయి.భారత్‌కు పొరుగుననే ఉన్న పాకిస్థాన్‌ తోపాటు, ఈజిప్టు,అల్జీరియా,లిబియా,ఫిలిప్పైన్స్‌, ఇజ్రా యిల్‌ ఘాజా,లెబనాన్‌, ఇండోనేసియా,జోర్డాన్‌ వంటి దేశాల్లో కూడాఐసిస్‌ నెట్‌ వర్క్‌ను విస్తరించింది. అక్కడి దేశాల్లో ఉన్న ఉగ్రవాదసంస్థలతో కూటమి కట్టింది. మరి కొన్ని చోట్ల యువతను ఎక్కువ ఆకర్షించి మిలిటెంట్లుగా మార్చి ఉగ్రవాద నెట్‌ వర్క్‌ను భారీగా విస్తరించింది.

అమెరికా న్యూయార్క్‌ టైమ్స్‌ నాలుగేళ్ల క్రితమే ఐసిస్‌ నెట్‌వర్క్‌ విస్తరిస్తున్న వైనాన్ని బాహ్యప్రపంచానికి చాటిచెప్పింది. ఇరాక్‌, సిరియాలకు బైట ప్రాంతంలోని 12 ఉగ్రవాదగ్రూప్‌లు ఐసిస్‌తో కలిసి పనిచేసేందుకు ప్రతిజ్ఞచేసాయని అప్పట్లోనే ఉటంకించింది. వీటిలో కొన్ని భారీ నెట్‌వర్క్‌ ఉన్న గ్రూప్‌లు అయితే మరికొన్ని కొత్తగ్రూప్‌లు ఆచూకీ తెలియకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్న గ్రూప్‌లుగా ఉన్నాయి. పాకిస్తాన్‌పరంగా చూస్తే అక్కడి క్రియాశీలకంగా ఉన్నకొన్నిగ్రూప్‌లు ఐసిస్‌ తోపనిచేసేందుకుప్రతిజ్ఞచేసినట్లు తేలింది.ఇక ఈజిప్టులో ని సినా§్‌ు ప్రాదేశికప్రాంతంలో ఎక్కువగా ఉన్న ఉగ్ర వాదగ్రూప్‌లు ఐసిస్‌వైపు ఆకర్షితులయ్యాయి. అన్సార్‌ బీట్‌, ఆల్‌ మఖ్దిస్‌ప్రాంతానికి చెందిన వెయ్యిమంది మిలిటెంట్లు బాగ్దాదీ ఇతర కేంద్ర గ్రూప్‌లతో జరిపిన చర్చల అనంతరం ఐసిస్‌తో కలిసిపనిచేయాలని నిర్ణ యించాయి. ఆల్‌ఖైదానుంచి వేరుపడి ప్రత్యేకసంస్థలు నడుపుతున్న కొన్ని ఉగ్రవాద సంస్థలు సైతం ఐసిస్‌వైపు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో ఐసిస్‌ తన నెట్‌వర్క్‌ ను మరింత పటిష్టంచేసుకున్నదనే చెప్పాలి. జి-20 దేశాలు సమావేశం జరిగే ప్రాంతాల్లోను,పర్యావరణ సద స్సులు జరిగిన ఫ్రాన్స్‌లోను, అమెరికా ఇలా ఒకటేమిటి అవకాశం ఉన్న అగ్రదేశాలన్నింటిలోను తన ఉనికిని బైట పెట్టి కాల్పులు, పేలుళ్లకు పాల్పడింది. రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరో అడుగు ముందుకేసి నిధు ల మూలాలను వెల్లడించారు.

ఐసిస్‌కు 40దేశాలనుంచి నిధులు అందుతున్నాయని ప్రకటించారు. పటిష్టమైన నెట్‌వర్క్‌తో మారణహోమానికి తెగబడుతున్న ఐసిస్‌కు ఎదురవుతున్న గడ్డుపరిస్థితులవల్లనే తాజాగా బాగ్దాదీ పిలుపు ఇచ్చినట్లు భావించాలి. ఈ ప్రకటన ఐసిస్‌ కేడ ర్‌ను నిస్తేజపరుస్తుందా లేక ప్రభుత్వవ్యూహంలో ఇదొక భాగమా అన్న సందేహాలుకూడా లేకపోలేదు.. ఏది ఏమైనా ఇటీవలికాలంలో నిరంతరాయంగా కొనసాగుతు న్న వైమానిక దాడులతో ఐసిస్‌కు పట్టు ఉన్న స్థావ రా లను ఇరాక్‌ తన గుప్పిట్లోనికి తెచ్చుకుంది. అందు వల్లనే ఖలీపాసామ్రాజ్యంగా బాగ్దాదీ ప్రకటించుకున్న మోసు ల్‌పై కూడా దాడులు పెరిగే అవకాశం ఉండటంతోనే ఈ విధమైన ప్రకటన వెలువడిందన్న భావన నెలకొంది. అదేజరిగితే ఐసిస్‌ మూలాలు కదులుతున్నాయన్న వార్తలకు ప్రాధాన్యం పెరిగిందని చెప్పక తప్పదు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article