Breaking News

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.

మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సిఎం వెల్లడించారు. మహిళల కోసం ఈ ఏడాది నుంచి కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయాలని సిఎం చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచాలని నిశ్చయించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని, మహిళాభ్యుదయానికి కృషి చేసిన వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వివిధ కార్పొరేషన్లతో పాటు ఇతర నామినేటెడ్ పదవులకు అర్హులైన మహిళలను ఎంపిక చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఈ కమిటీలో సభ్యులు . అర్హులైన మహిళలను ఎంపిక చేసి పంపాల్సిందిగా సిఎం ఈ కమిటీని ఆదేశించారు. కమిటీ సూచించిన మేరకు కొద్ది రోజుల్లోనే మహిళలకు పదవులు ఇవ్వనున్నట్ల సిఎం ప్రకటించారు.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *