Daily Archives: March 14, 2017

గుర్జాల్‌లో కుస్తీ పోటీలు

  గాంధారి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గుర్జాల్‌ గ్రామంలో మంగళవారం కుస్తీ పోటీలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. హోలీ పండగ పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పండగ మరుసటి రోజు గ్రామంలో కుస్తీపోటీలు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో ఈయేడు కూడా గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గాంధారి మండలంతోపాటు చుట్టుపక్కల మండలాలు, పొరుగు రాష్ట్రాల నుంచి మల్లయోధులు, కుస్తీ యోధులు పాల్గొన్నారు. పోటా పోటీగా జరిగిన పోటీల్లో గెలుపొందిన వారికి గ్రామపెద్దలు బహుమతులు అందజేశారు.

Read More »

షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి నిధుల పెంపుపై హర్షం

  కామారెడ్డి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర బడ్జెట్‌లో షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాలకు సంబంధించి ఒక్కొక్కరికి 51 వేల నుంచి 75 వేల 116 లకు పెంచడం పట్ల మెప్మా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం సిఎం కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళలకోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడుతున్నందుకు కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెరాస కార్యకర్తలు వేదశ్రీ, నవీన, లత ఆద్వర్యంలో కార్యక్రమం జరిపారు. ఒంటరి మహిళల కోసం పింఛన్‌ అందించడం పట్ల ...

Read More »

ప్రభుత్వ పథకాలపై సమీక్ష

  కామారెడ్డి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పథకాలపై ప్రభుత్వ చీప్‌ సెక్రెటరీ ఎస్‌.పి.సింగ్‌ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇందులో హరితహరం, వేసవిలో నీటి సరఫరా పరిస్థితి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణ మార్గాలు, సాధా బైనామా, అసైన్డ్‌ ల్యాండ్‌, రైతు ఆత్మహత్యలు, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి, మిషన్‌ భగీరథ, గొర్రెల సర్వే వివరాలు, 10వ తరగతి పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ...

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

  కామారెడ్డి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న బాధిత కుటుంబానికి మెహెర్‌ లవ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు మంగళవారం ఆర్థిక సాయం అందజేశారు. కామారెడ్డికి చెందిన పాత రమేశ్‌, రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి శస్త్ర చికిత్స నిమిత్తం ఫౌండేషన్‌ నుంచి రూ. 22 వేల ఆర్థిక సాయం అందించినట్టు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో హరిధర్‌, సంతోష్‌, శ్రీనివాస్‌, అంజయ్య, రమేశ్‌, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బడ్జెట్‌ ప్రతుల దగ్దం

  కామారెడ్డి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో మంగళవారం జాతీయ రహదారిపై బడ్జెట్‌ ప్రతులను దగ్దం చేశారు. ఈ సందర్భంగా జిల్లాకార్యదర్శి చెలిమెల భానుప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం గర్హనీయమన్నారు. విద్యారంగానికి కేవలం 12 వేల 750 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. కెజి నుంచి పిజి ఉచిత విద్యకు నిధులు కేటాయించకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల అభివృద్దికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ...

Read More »

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

  కామారెడ్డి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి ఆర్టీసి డిపో కార్యాలయం ఎదుట కార్మికులు కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో తొలిసారిగా ఆర్టీసికి 994 కోట్లు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. ఆర్టీసి సంక్షేమానికి పాటుపడుతున్న కెసిఆర్‌కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిపో కార్యదర్శి నారాయణ, అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి, ప్రతినిధులుప్రేమ్‌కుమార్‌, హరినాథ్‌, కె.సి.రెడ్డి, కౌసర్‌, నాగరాజు, హజర్‌, మోహన్‌, సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గర్భిణీలకు వైద్య పరీక్షలు

  బీర్కూర్‌, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక వైద్యులు దిలీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో గర్భిణీలకు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరుపుకోవాలని సూచించారు. గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. వారి వెంట ఏఎన్‌ఎంలు ఉన్నారు.

Read More »

ఆర్టీసి బస్సు ఢీ – ఇద్దరు యువకుల దుర్మరణం

  నందిపేట, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట రోడ్డు రక్తమొడింది… ఇద్దరు యువకుల ప్రాణాలు బలిగొంది… మిట్టమధ్యాహ్నం మృత్యువు మింగేసింది…. నందిపేట నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్ళే రోడ్డుపై మంగళవారం ఆర్టీసి బస్సు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. నందిపేట ఎస్‌ఐ జాన్‌రెడ్డి కథనం ప్రకారం… నందిపేటకు చెందిన భవాని దాబా యజమాని గంగాగౌడ్‌ కుమారుడు శశికుమార్‌ (22), అతని స్నేహితుడు తల్వేద శశికుమార్‌ బైక్‌పై ఏపి 25 ఎఆర్‌ 2915 నిజామాబాద్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ...

Read More »

స్త్రీ శక్తి భవనం ప్రారంభం

  బీర్కూర్‌, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోమంగళవారం జడ్పిటిసి కిషన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో అధికారులు, నాయకులు స్త్రీ శక్తి భవనాన్ని ప్రారంభించారు. బీర్కూర్‌లోని నసురుల్లాబాద్‌ మండలంగా ఏర్పడడంతో నూతన కార్యాలయాల ఏర్పాటులో భాగంగా మంగళవారం స్త్రీ శక్తి భవనం ప్రారంభించినట్టు తహసీల్దార్‌ డేవిడ్‌ తెలిపారు. కార్యక్రమంలో మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌, గ్రామ సర్పంచ్‌ అరిగె సాయిలు, ఎంపిటిసి మల్లేశం, అధికారులు పాల్గొన్నారు.

Read More »

వెంకటేశ్వరస్వామి ఆలయంలో భవన నిర్మాణం

  బీర్కూర్‌, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సౌకర్యార్థం భవన నిర్మాణంలో భాగంగా స్లాబ్‌ వేశారు. బీర్కూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మయ్యసేట్‌ గతంలో రెండు లక్షల విరాళం ఇవ్వగా గోడల వరకు నిర్మాణాలు చేపట్టారు. కాగా స్లాబ్‌ కొరకు కర్ణకంటి వీరయ్య గుప్త రెండు లక్షలు విరాళంగా ఇవ్వడంతో మంగళవారం పనులు చేపట్టారు. గ్రామంలో స్వామివారి ఆలయం పురాతన కాలంనాటిది కావడంతో ఆలయాన్ని భక్తుల విరాళంతో పునరుద్దరిస్తున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ...

Read More »

నేడు తెలంగాణ హరితహారం కార్యాచరణ సమావేశం

  వర్ని, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారం 2017-18 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారుచేసేందుకు గాను ఈనెల 15న బుధవారం మండల స్తాయి అధికారులతో సమీక్ష సమావేశం ఉంటుందని వర్ని మండల ఎంపిడివో బి.సురేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశం ఉంటుందని మండలంలోని అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు.

Read More »

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట టిడిపి నాయకుల నిరసన

  కామారెడ్డి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిడిపి సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టిడిపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటంలో భాగంగా అసెంబ్లీలో తమ గొంతు వినిపించేందుకు ప్రయత్నిస్తున్న వారిని కెసిఆర్‌ గొంతు నొక్కే ప్రయత్నం చేయడం గర్హనీయమన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన రేవంత్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామిక మని పేర్కొన్నారు. వచ్చే ...

Read More »

చద్మల్‌తాండా ‘బహుబలి’

  గాంధారి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం చద్మల్‌ తాండాలో మరో బాహుబలి వెలుగులోకి వచ్చాడు. హోళీ సందర్భంగా తాండాలో ప్రతి సంవత్సరం బండరాయిని ఎత్తుకునే కార్యక్రమంలో యువకులు పోటీపడి పాల్గొంటారు. ఈ సందర్భంగా చద్మల్‌ తాండాకు చెందిన మాండుపాండు అనే యువకుడు 120 కిలోల బండరాయిని ఎత్తుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. తాండావాసులు చద్మల్‌ తాండా బాహుబలి అంటూ ఆ యువకున్ని అభినందించారు.

Read More »

కందుల కొనుగోలుకు నేడు ఆఖరి రోజు

  గాంధారి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం రైతుల వద్దనుంచి కందులను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కనీస మద్దతుధర రూ. 5050 క్వింటాలుకు కొనుగోలు చేయడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో గాంధారి మండల కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి రైతులు పండించిన కందులను కొనుగోలు ప్రారంభించారు. మొదటగా 8 వేల క్వింటాళ్ళ కందులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అయితే రైతుల వద్ద అంతకు మించి ...

Read More »

గాంధారిలో ఇద్దరు డిబార్‌

  గాంధారి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో మంగళవారం ఇద్దరు విద్యార్థులు డిబార్‌ అయినట్టు జిల్లా పరీక్షల కమిటీ సభ్యుడు కాశయ్య తెలిపారు. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మాల్‌ప్రాక్టీస్‌ కింద ఇద్దరిని డిబార్‌ చేశామన్నారు. జిల్లా మొత్తం ఇంటర్మీడియట్‌ రెండవ సంవత్సరంలో 7608 మంది విద్యార్థులకు గాను 7347 మంది హాజరుకాగా 261 విద్యార్థులు గైర్హాజరైనట్టు తెలిపారు.

Read More »

రివ్యూ: నగరం

సినిమా పేరు: నగరం నటీనటులు: సందీప్‌కిషన్‌, రెజీనా, శ్రీ, చార్లీ, రాందాస్‌, మధుసూదన్‌ తదితరులు సంగీతం: జావేద్‌ రియాజ్‌ ఛాయాగ్రహణం: సెల్వకుమార్‌ కూర్పు: ఫిలోమిన్‌ నిర్మాణం: ఏకేఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రొటన్షియల్‌ స్డూడియోస్‌ రచన, దర్శకత్వం: లోకేష్‌ కనగరాజ్‌ విడుదల: 10 మార్చి 2017 రెండు మూడు వేర్వేరు కథల్ని ఓ సంఘటనతో ముడిపెట్టడం, పరిచయం లేని పాత్రల మధ్య ఓ డ్రామా నడపడం హాలీవుడ్‌ సినిమాల శైలి. ఇప్పుడిప్పుడే అలాంటి కథలు మన దగ్గరకీ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తమిళనాట ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు ...

Read More »