Daily Archives: March 23, 2017

వజ్జెపల్లిలో వైద్య శిబిరం

  గాంధారి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం వజ్జెపల్లి గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని ఉత్తునూరు వైద్యాధికారి షాహెద్‌ అలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్‌, హైవేట్‌, బిపి, జ్వరం తదితర వాటిపై పరీక్షలు చేపట్టారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యాధికారి షాహెద్‌ అలీ మాట్లాడుతూ వైద్య శిబిరానికి సహకరించిన శ్రీశివాలయ గ్రామ రైతు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ...

Read More »

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

  గాంధారి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈనెల 21వ తేదీన నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను స్థానిక ఎంపిటిసి రామ్‌కిసన్‌రావు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు గంగాధర్‌, ఉపాధ్యాయులు మాణిక్యం, మహేందర్‌రావు, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

చీటిలతో అడ్డంగా దొరికిపోయిన ఉపాధ్యాయులు

  బీర్కూర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ జడ్పిహెచ్‌ఎస్‌లో 10వ తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఉపాధ్యాయులను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు ఎస్‌ఐ రాజ్‌భరత్‌ తెలిపారు. గురువారం 10వ తరగతి పరీక్షలో భాగంగా గణితం-1 పరీక్ష జరుగుతుండగా పరీక్ష కేంద్రం తనిఖీలో భాగంగా గదుల్లో తిరుగుతున్నపుడు అంజయ్య, గంగాధర్‌ అనే ఉపాధ్యాయులు చీటిలతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినట్టు తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు మాల్‌ప్రాక్టీస్‌కు ఎలా ...

Read More »

తవ్వకాల్లో వెలసిన ముత్యాలమ్మ

  గాంధారి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గుర్జాల్‌ గ్రామంలో గురువారం మందిర నిర్మాణం కొరకు తవ్వకాలు జరుపుతుండగా ముత్యాలమ్మ విగ్రహం బయట పడింది. గ్రామానికి చెందిన ఓ భక్తుడు ఇదే స్థలంలో ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి ముందుకు రావడంతో గ్రామస్తులు పూజలు నిర్వహించి తవ్వకాలు ప్రారంభించారు. అనుకోకుండా తవ్వకాల్లో ముత్యాలమ్మ విగ్రహం బయట పడడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా అమ్మవారి మహిమ అని ఏ దేవత కొరకు మందిరం నిర్మిస్తున్నామో అదే దేవత స్వయంగా ...

Read More »

ఘనంగా పాఠశాలల్లో అక్షరాభ్యాసం

  బీర్కూర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం బీర్కూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో, నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో అధికారులు విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నందున కొత్త విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తు అక్షరాభ్యాసం చేయించినట్టు ఎంఇవో గోపాల్‌రావు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ డేవిడ్‌, జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More »

దూదేకుల సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం నూర్‌బాషా, దూదేకుల బిసి-బి సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా సమావేశం గురువారం నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ నసీరుద్దీన్‌, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ ఖయ్యుం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా షేక్‌లాల్‌ మహ్మద్‌, ఉపాధ్యక్షుడు అజీజ్‌మియా, ప్రదాన కార్యదర్శిగా మహ్మద్‌ షాదుల్లా, సహాయ కార్యదర్శిగా మునీరుద్దీన్‌, కోశాధికారిగా షబ్బీర్‌ అలీ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా షేక్‌ నిజాముద్దీన్‌, కార్యవర్గ సభ్యులుగా నూర్‌ మహ్మద్‌, అబ్దుల్‌ జబ్బార్‌, ...

Read More »

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి బైపాస్‌ వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిందని పట్టణ ఎస్‌ఐ శోభన్‌బాబు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ఆయన చెప్పారు. వివరాల్లోకి వెళితే…హైదరాబాద్‌లో నివాసముంటున్న రేణుక ఆమె భర్త సుజిత్‌సింగ్‌, వారి కుమారుడు నిఖిత్‌తో పాటు రేణుక తల్లి చౌహాన్‌ మధురాబాయిలు హైదారాబాద్‌ నుంచి నాందేడ్‌ వెళుతుండగా రామేశ్వర్‌పల్లి బైపాస్‌వద్ద ప్రమాదం ...

Read More »

ట్రాఫిక్‌ నియంత్రణపై చర్యలు

  గాంధారి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ట్రాఫిక్‌ నియంత్రణపై తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ స్థానిక ఎస్‌ఐ రాజేశ్‌తో కలిసి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వెంటనే సదరు అధికారులు రోడ్డుపైకి వెళ్లి రోడ్డుకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలను పార్కింగ్‌ చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డుపై పార్కింగ్‌ చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ఇకముందు ...

Read More »

భగత్‌సింగ్‌ వర్ధంతి

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భగత్‌సింగ్‌ 86వ వర్ధంతిని ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో గురువారం వేరువేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ విగ్రహనికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ పాలకులను తరిమికొట్టి తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉరికంభం ఎక్కి ప్రాణత్యాగం చేసిన వీరకిశోరం భగత్‌సింగ్‌ అని కొనియాడారు. పాలకులు భగత్‌సిరగ్‌ త్యాగానికి గుర్తింపు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆరోపించారు. భగత్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని, ఆయన చరిత్రను పాఠ్యాంశంలో ...

Read More »

రోడ్ల మరమ్మతులు జరపాలి

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగాది పండగ నేపథ్యంలో పట్టణంలోని రోడ్ల మరమ్మతులు జరపాలని కామారెడ్డి మునిసిపల్‌ ప్రత్యేకాధికారి, ఆర్డీవోకు బిజెవైఎం నాయకులు గురువారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పండగ సందర్భంగా పట్టణంలో ఎడ్లబండ్ల ఊరేగింపు పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. భవానిరోడ్డు, పెద్ద బజార్‌, సరోజిని దేవిరోడ్డు, హరిజనవాడ, అంగడిబజార్‌ల మీదుగా ఊరేగింపు సాగుతుందని రోడ్ల వెంబడి మరమ్మతులు చేయించాలని కోరారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో ...

Read More »

పైప్‌లైన్‌ పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో పైప్‌లైన్‌ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ గురువారం ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 3 లక్షలు, మునిసిపల్‌ సాధారణ నిధులు రూ. 2 లక్షలతో మంచినీటి పైప్‌లైన్‌ పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ పిట్ల విద్య వేణుగోపాల్‌, భూమేశ్వర్‌, ఎ.ఇ. జగన్నాథం, సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

రైతుల సంక్షేమానికి కలిసికట్టుగా పనిచేద్దాం

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల సంక్షేమానికి వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సహకార సంఘం ప్రతినిదులు కలిసికట్టుగా పనిచేయాలని ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌ అన్నారు. కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జమాఖర్చులు, ఆర్థిక నివేదికపై చర్చించారు. కామారెడ్డి సంఘంలో విలీనమై ఉన్న చిన్నమల్లారెడ్డి, గర్గుల్‌ సంఘాలను వేరుచేయడానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిలు పంపుతున్నట్టు తెలిపారు. చిన్నమల్లారెడ్డి, ఇస్రోజివాడి, ఉగ్రవాయి గ్రామాల్లో వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ...

Read More »

కొనసాగుతున్న తెరాస సభ్యత్వ నమోదు

  నిజాంసాగర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో రెండ్రోజుల్లో తెరాస సభ్యత్వ నమోదు పూర్తవుతుందని మండల పార్టీ అధ్యక్షుడు గైని విఠల్‌ అన్నారు. మండలంలోని మండల పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభించి మాట్లాడారు. నిజాంసాగర్‌ సర్పంచ్‌ బేగరి రాజు పార్టీ సభ్యత్వ నమోదు చేస్తున్నారు. మండలంలో 6425 సాధారణ సభ్యత్వ నమోదు లక్ష్యం ఉన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిడిసి ఛైర్మన్‌ దుర్గారెడ్డి, నాయకులు లక్ష్మణ్‌, తదితరులున్నారు.

Read More »

అధిక లోడ్‌ వాహనాల సీజ్‌

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధిక లోడ్‌తో వెళుతున్న వాహనాలపై దాడులు నిర్వహించి ఏడు వాహనాలు పట్టుకొని సీజ్‌ చేసినట్టు కామారెడ్డి ఆర్టీవో శ్రీనివాస్‌ తెలిపారు. డిటివో ఆదేశాల మేరకు వాహనాలపై దాడులు చేపట్టామని, అధిక లోడ్‌తో వెలుతున్న వాహనాలు పట్టుకొని సీజ్‌చేసి జరిమానా విధించినట్టు వివరించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు సరిగా లేకపోవడం, ఓవర్‌లోడ్‌తో వెళ్లిన, లైసెన్సులు లేకున్నా కేసులు తప్పవని హెచ్చరించారు.

Read More »

కంటి వైద్య శిబిరం

  నిజాంసాగర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మగ్దుమ్‌పూర్‌ గ్రామంలో కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలోఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో కంటి వైద్యులు శివకుమార్‌ 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అవసరమగువరికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో మక్దుమ్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ సవాయిసింగ్‌, గాలిపూర్‌ సర్పంచ్‌ రాగాగౌడ్‌ తదితరులున్నారు.

Read More »

అంగన్‌వాడి టీచర్లకు శిక్షణ

  నిజాంసాగర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో అంగన్‌వాడి టీచర్లకు గురువారం శిక్షణ తరగతులు నిర్వహించారు. పూర్వప్రాథమిక విద్య కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. పిట్లం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ కొమరవ్వ టీచర్లకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత, సామాజిక అభివృద్దిపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. అంగన్‌వాడి కేంద్రాలకు చిన్నారులను ఎలా తీసుకురావాలి, వారికి బోధించే విధానంపై శిక్షణలో పేర్కొన్నారు.

Read More »

తాళ్లరాంపూర్‌లో స్పెషల్‌ డ్రైవ్‌

  మోర్తాడ్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామంలో మండల కార్యదర్శుల బృందంచే స్పెషల్‌ డ్రైవ్‌ గురువారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఇంటిపన్ను, నీటి పన్ను వసూలు చేశారు. 40 వేల పైచిలుకు బకాయిలు వసూలు చేసినట్టు ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల వారిగా లక్ష 7 వేల 600 పన్ను వసూలైనట్టు ఎంపిడివో తెలిపారు. ఇందులో మండల కార్యదర్శులు స్వప్న, గంగాదాస్‌, తిరుపతి రెడ్డి, రమేశ్‌, సాజన్‌కుమార్‌, ...

Read More »

చెక్కుల పంపిణీ

  నిజాంసాగర్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ ఆంధ్రాబ్యాంకులో లింకేజి కింద మంజూరైన రుణాలను స్వయం సహాయక సభ్యులు ఎంపిపి సునంద గంగారెడ్డి, గున్కుల్‌ సర్పంచ్‌ బాలమణి, ఎంపిటిసి ఉన్నీసాబేగం, సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. మండలంలోని 160 సంఘాల సభ్యులకు 3.50 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరైనట్టు ఐకెపి ఎపిఎం రాంనారాయణగౌడ్‌ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిపి, సర్పంచ్‌లు మాట్లాడుతూ గ్రామంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు ...

Read More »

25న మండల సర్వసభ్య సమావేశం

  మోర్తాడ్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీన మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్యసమావేశం ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు గురువారం ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. సమావేశానికి ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని కోరారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Read More »

వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించాలి

  మోర్తాడ్‌, మార్చి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ వినియోగదారులకు ఆయా మండలాల, గ్రామాల విద్యుత్‌ అధికారులు మెరుగైన విద్యుత్‌ సేవలు అందించాలని డిఇ సాన్యానాయక్‌ అన్నారు. గురువారం మోర్తాడ్‌లోని బద్దంవాడ సంఘభవనంలో మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాల వినియోగదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ బకాయిలు సకాలంలో చెల్లించి విద్యుత్‌శాఖకు సహకరించాలన్నారు. గ్రామాల్లో విద్యుత్‌పై ఎలాంటి అవాంతరాలు ఏర్పడినా సమాచారం ఇచ్చిన వెంటనే సరిచేసి విద్యుత్‌ సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం ...

Read More »