Breaking News

శృంగార, సంతానలేమి సమస్యలకు ఆయుర్వేద వైద్యం


ప్రశ్న:నా వయసు 30 సంవత్సరాలు. మాకు వివాహం అయి ఐదు సంవత్సరాలు అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలున్నారు. నేను డిప్రెషన్‌తో బాధ పడుతున్నాను. నాకు 5 సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగడం, మద్యం తాగే అలవాటు ఉన్నది. నాకు రెండు సంవత్సరాల నుంచి అంగం సరిగా గట్టి పడదు. ఒక వేళ గట్టి పడినా త్వరగా మెత్త పడుతుంది. ఇంకా వీర్యం కూడా త్వరగా పడిపోతుంది. దీనివల్ల నేను నా భార్య ఎంతో అసంతృప్తిగా ఉన్నాం. ఎందువలన ఇలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు. నా సమస్యలకు పరిష్కార మార్గం ఉంటే తెలుపగలరు. 

– శ్రీనివాస్‌, వరంగల్‌ 

జవాబు:  మీరు అంగస్తంభన సమస్య, శీఘ్ర స్ఖలన సమస్యలతో బాధ పడుతున్నారు. మీకు ఉన్న చెడు అలవాట్ల వల్ల డిప్రెషన్‌ వల్ల ఇంకా హార్మోన్‌ల లోపాల వల్ల కూడా మీకు ఈ సమస్యలు వచ్చి ఉండవచ్చు. పై రెండు సమస్యలకు కూడా ఆయుర్వేదంలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేద గ్రంధాల్లో పేర్కొనబడిన వాజీకరణ ఔషధాలు మీ సమస్యలకు మంచి పరిష్కారాన్ని ఇస్తాయి. ఈ వాజీకరణ ఔషధాల వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. మంచి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించి వాజీకరణ ఔషధాలు వాడినట్లైతే మీ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది.

****

ప్రశ్న: మాకు వివాహం అయి ఆరు సంవత్సరాలు అవుతుంది. నా వయసు 35 సంవత్సరాలు. కాని ఇంతవరకు మాకు సంతానం కలగలేదు. నా భార్యకు అన్ని రకాల పరీక్షలు చేసి ఎలాంటి లోపం లేదని నిర్ధారించారు. నాకు వీర్య పరీక్ష చేసి వీర్యకణాల సంఖ్య, కదలికలు బాగా తక్కువగా ఉన్నాయని నిర్ధారించారు. ఎన్నో రకాల మందులు వాడినా ఫలితం లేక విసిగిపోయి ఉన్నాం. డాక్టర్లు టెస్ట్‌ ట్యూబ్‌ బేబి చేయించుకోమని సలహా ఇచ్చారు. అది చేయించుకునే స్థోమత మా దగ్గర లేదు. వీర్యకణాలు తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి? నా సమస్యకు ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయని తెలిసింది. ఉంటే దయచేసి వివరంగా తెలుపగలరు.
– కిషోర్‌, హైదరాబాద్‌

జవాబు:  వీర్యంలో వీర్యకణాల సంఖ్య, వీర్యకణాల్లో కదలికలు తగ్గిపోవడాన్ని ‘అలిగో ఆస్థినోస్మెర్మియా’ గా చెప్పవచ్చు. వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడానికి ముఖ్యంగా మానసిక ఆందోళనలు, వెరికోసిల్‌, హార్మోన్‌లలో లోపాలు, మద్యం తాగడం, పొగ తాగడం, అధిక బరువు, కాలుష్యం మొదలగునవి కారణంగా చెప్పవచ్చు. ఈ సమస్యకు టెస్ట్‌ట్యూబ్‌ బేబి అవసరం లేకుండానే ఆయుర్వేదం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. వీర్యకణాల్లో లోపాలకు ఆయుర్వేదంలో మంచి మందులు అందుబాటులో ఉండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి.

*****

ప్రశ్న:  నా వయసు 45 సంవత్సరాలు. నేను 5 సంవత్సరాల నుంచి మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో బాధ పడుతున్నాను. నేను అధిక బరువుతో కూడా బాధ పడుతున్నాను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకు గత మూడు సంవత్సరాల నుంచి అంగస్తంభన సరిగా జరగటం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను. దేనివల్ల అంగస్తంభన సరిగా రావడం లేదో తెలియజే య గలరు.

– రామారావు, విజయవాడ

జవాబు: మీకు ఉన్నటువంటి మధుమేహం, అధిక రక్తపోటుకు వాడే మందులు, అధిక బరువు , అధిక కొలెస్ట్రాల్‌, హార్మోన్‌ల లోపాల వల్ల అంగస్తంబన సమస్య వచ్చి ఉండవచ్చు. మధుమేహం గల వారిలో 60 శాతం వరకు అంగస్తంభన సమస్య వచ్చే అవకాశం ఉంది. మధుమేహం, అధిక రక్తపోటును మందుల ద్వారా అదుపులో ఉంచుకొని, అధిక బరువు తగ్గించుకొని ఆయుర్వేద వైద్యనిపుణుల ద్వారా 4 నుంచి 6 నెలలపాటు మందులు వాడినట్లయితే అంగస్తంభన సమస్య నుంచి పూర్తిగా బయటపడగలరు.

****

  ప్రశ్న: నా వయసు 40 సంవత్సరాలు. మాకు పెళ్లి అయి 10 సంవత్సరాలు అవుతుంది. నేను వీర్యపరీక్ష చేయించుకుంటే నిల్‌ కౌంట్‌ అని రిపోర్ట్‌ వచ్చింది. నాకు ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. నా భార్యలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. నాకు డాప్లర్‌ పరీక్ష చేసి వృషణాలపై గ్రేడ్‌ -1 వెరికోసిల్‌ ఉందని చెప్పారు. వెరికోసిల్‌కు ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. నాకు హార్మోన్‌లలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఎంతోమంది డాక్టర్లను కలిశాం.మీ సమస్యకు మంచి ఫలితాలు ఇచ్చే మందులు లేవనే చెప్పారు. మా సమస్యకు ఆయుర్వేదంలో ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా?
– రవి, కడప
 జవాబు: వీర్యంలో వీర్యకణాలు పూర్తిగా లేకపోవడాన్ని ‘అజోస్పెర్మియా’గా చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ సమస్యకు ఆయుర్వేదం ద్వారా మంచి పరిష్కారం లభిస్తుంది. ఆయుర్వేదంలో పేర్కొన్న వాజీకరణ ఔషధాలు అజోస్పెర్మియాకు ఉపయోగపడతాయి. కాకపోతే మందులు 6 నుంచి 12 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. వెరికోసిల్‌ గ్రేడ్‌ -1, గ్రేడ్‌ -2 ఉన్న వారికి ఆయుర్వేద మందుల ద్వారా ఆపరేషన్‌ అవసరం లేకుండానే మంచి ఫలితాలు పొందగలరు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article