Breaking News

ఓటర్‌ జాబితాలో పేర్ల గల్లంతుకు బాధ్యులెవరు

 

బీర్కూర్‌, మార్చి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామంలో 7,8,9,10, 11,12 వార్డుల్లో ఓటరు జాబితాలో పేర్ల గల్లంతుకు బాధ్యులెవరని బీర్కూర్‌ ఎంపిటిసి-2 సుధాకర్‌ యాదవ్‌ డిప్యూటి తహసీల్దార్‌ వరప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. ఓటరు జాబితాలో పేర్లు ఎలా పోతాయని, దానికి బాధ్యులెవరో తెలియజేయాలని మంగళవారం డిప్యూటి తహసీల్దార్‌ను నిలదీశారు. మూడురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆయన మాట ఇవ్వడంతో శాంతించారు. మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో పోగు నారాయణ, సానెపు గంగారాం, అబ్దుల్‌ హైమద్‌, రాచప్ప పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

15లోగా ప్రైవేటు ఉపాధ్యాయుల‌ వివరాలు అందించండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 15లోగా ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇతర ...

Comment on the article