Breaking News

ఎన్నాళ్లీ ప్రశ్నపత్రాల వ్యాపారం?

paper leak

శశతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. కష్టపడకుండా తెల్లవారేసరికి లక్ష్మీ పుత్రులై కోట్లకు పడగెత్తాలనే కొందరి దురాశ అన్నిరంగా లతోపాటు విద్యారంగంలో పెచ్చురిల్లుతుండడంతో లక్ష లాదిమంది విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకంగా మారుతు న్నది.ఇది రానురాను పెరిగిపోతుండడం ఆందోళన కలిగి స్తున్నది.అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పరీక్షల్లో పరీక్షా పత్రాలు బయటికి తెప్పించుకొని వ్యాపారం చేసే దళారుల ఆగడాలు అంత కంతకు పెరుగుతున్నాయి.కొందరు ప్రశ్నపత్రాలు సంపా దించుకొని,మరికొందరు వాల్యూయే షన్‌లో మార్కులు వేయించుకొని ఏకంగా జవాబు పత్రాలనే మార్చివేసే ప్రయత్నంలో ఇంకొందరు.

ఇలా ఎవరికి ఎక్కడ వీలైతే అలా పరీక్షల్లో గట్టెక్కించేందుకు ఆరాటపడుతుండ డంతో రాత్రింబవళ్లు కష్టపడి ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి చదువ్ఞకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నా ర్థకంగా మారుతున్నది. పరీక్షల నిర్వహణలో పాల కులు ఘోరంగా విఫలమవ్ఞతున్నారని చెప్పకతప్పదు. ఈ పరీక్షా ఆ పరీక్షా అని కాదు. పదోతరగతి నుంచి మొదలుపెడితే ఎంసెట్‌తోపాటు అన్ని పరీక్షలు ఇందుకు మినహాయింపుకావడం లేదు. ప్రశ్నపత్రాలు సంపాదిం చుకొనేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనేఉన్నారు. కొన్నిసార్లు బయటకి వస్తున్నా, మరికొన్నిసార్లు మూడో కంటికి తెలియకుండా జరిగిపోతున్నాయి

. ప్రశ్నపత్రాలు లీక్‌ అయినట్లు స్పష్టంగా బయటపడిన సందర్భాల్లో పాలకులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతున్నది. మొన్న ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూ రు జిల్లాలో పదోతరగతి పరీక్షాపత్రం లీక్‌ అయిన విష యంలో రాష్ట్ర శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది. ఈ విషయంలో అధికార ప్రతిపక్షపార్టీల మధ్య వాదోపవా దాలు, విమర్శలు ప్రతివిమర్శలతో అసెంబ్లీ అట్టుడికిపో యింది. ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం అనేది ఇది మొదలు కాదు. చివరి కూడా కాదు. ఎప్పటికప్పుడు పాలకులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నా అమలుకు వచ్చేసరికి అవి కాగితాలకే పరిమితమవ్ఞతున్నాయి. ఈ ప్రశ్నపత్రా ల వ్యాపారం చేసేవారు రానురాను బరితెగించిపోతున్నా రు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే ఈ వ్యాపారు లను, దళారులను ఉక్కుపాదంతో అణచివేయాల్సిందే. ఇందులో మరో అభిప్రాయానికి తావ్ఞలేదు. కానీ దీన్ని కూడా రాజకీయ లబ్ధిపొందేందుకు ప్రయత్నం చేయడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదు.ఎంసెట్‌ నిర్వ హణకూడా ఒక ప్రహసనంగా మారిపోతున్నది.

ఒకపక్క లీకులు,మరొకపక్క తప్పులు పాలకుల చేతకానితనానికి నిదర్శనంగా మారాయి.దీంతో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోతున్నది. అధికారం లో ఏపార్టీఉన్నా ముఖ్యమంత్రి ఎవరైనా విద్యా శాఖలో ఎలాంటి అధికారులున్నా పరీక్షల నిర్వహణలో మాత్రం అవకతవకలను నివారించలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గతఏడాది జరిగిన ఎంసెట్‌ (మెడిసన్‌)పరీక్షలు ఎన్నిసార్లు మళ్లీమళ్లీ నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పక్క ర్లేదు. రాసిన పరీక్షలే మళ్లీరాయాలంటే ఆ విద్యార్థులు ఎంతటి మానసిక టెన్షన్‌కు గురవ్ఞతారో ఒక్కసారి పాల కులు మనసు పెట్టి ఆలోచించాలి.

ప్రశ్న పత్రాలలీక్‌లు బయటపడకుండా ఉంటే ఆ ప్రశ్నపత్రాలు కొన్నవారు అందలం ఎక్కిపోతున్నారు. ప్రశ్నపత్రాల జవాబులను కంఠస్తం చేసిన ప్రబుద్ధులు ఎలాంటి కష్టం లేకుండా మేధావ్ఞలుగా పైకి వెళ్లిపోతుంటే సంవత్సరాల తరబడి శ్రద్ధాశక్తులతో చదివిన మెరికల్లాంటి విద్యార్థులు వెనుక బడిపోతున్నారు.అందుకే ప్రభుత్వం పరీక్షల విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.అసలు ఇవి ఏదశలో లీక్‌ అవ్ఞతున్నాయి. దీనికి బాధ్యు లెవరు? ప్రశ్నప్రతాలు తయారు చేసేవారా?లేకవాటిని సరిచూసి సక్రమంగా ఉన్నాయా? లేవా అని నిర్ధారించే వారా?ఈ పత్రాలు రహస్యంగా ముద్రించినందుకు లక్షలాది రూపా యలు అదనంగా పొందుతున్న ప్రెస్‌యజమానులా?లేక రెట్టింపుమొత్తంలో ప్రభుత్వం నుంచి డబ్బుతీసుకుంటూ రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్టర్‌లా? లేక పరీక్షా కేంద్రాల కు చేరిన తర్వాత నిర్వహిస్తున్న అధికారులా? తదితర విషయాలు క్షుణ్ణంగాపరిశీలించాలి.. పరిశోధించాలి.

గతంలో ఒకసారి మెడికల్‌ ప్రశ్నపత్రాలు రూపొం దించిన ఒక ప్రొఫెసరే లీక్‌కు బాధ్యుడయ్యాడు. మరొక సారి ఎంసెట్‌ ప్రశ్నపత్రాలను ముద్రించిన ప్రింటింగ్‌ యజమాని బాధ్యుడైనట్లు ఆనాడు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు ఆ ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమా ని తనకు ప్రశ్నపత్రాల ముద్రణకు కాంట్రాక్టు విషయం లో సహాయపడిన కొందరు అధికారులకు ఏమేరకు ప్రతి ఫలంగా డబ్బు అందించారో కూడా అప్పుడు దర్యాప్తు చేసిన అధికారులు కూపీ లాగగలిగారు.

ఇలాంటి ఎన్నో సందర్భాలు బయటికివచ్చినా,వెలుగుచూసినా అన్నీ రికా ర్డులకే పరిమితమవ్ఞతున్నాయి తప్పపటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవ్ఞ. రానురాను విద్యావ్యవస్థ ఎంతటి పతనావస్థకు దిగజారిపోతున్నదో జరుగుతున్న సంఘటనలు అద్దంపడుతున్నాయి.పవిత్రమైనఈ విద్యా విధానాన్ని డబ్బుతో కొనుక్కొనే స్థాయికి దిగజారడం ఇందుకు దళారులను, ఇంకెవరినో నిందించే కంటే విద్య ను వ్యాపార వస్తువ్ఞగా మార్చి స్వేచ్ఛగా అమ్ముకునే అవ కాశం కల్పించిన పాలకులను నిందించాలి. రాత్రికిరాత్రే ఈ పరీక్ష పత్రాల వ్యాపారంతో కుబేరులు కావాలను కునే వారి దురాశలకు అడ్డుకట్టవేయకపోతే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ అంధకారం అవుతుంది

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article