Breaking News

18 ఏళ్ళు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

 

నిజామాబాద్‌, మే 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 7, 14వ తేదీ ఆదివారాల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినందున 18 సంవత్సరాలు నిండిన, వారు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకోనివారు బూత్‌స్థాయి వద్దకు వెళ్లి నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. ఓటరు నమోదు కొరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్దేశించిన ప్రకారంగా జిల్లాలోని బూతుస్థాయి అధికారి వద్దకెళ్లి నమోదు చేసుకోవాలన్నారు. ఎవ్వరైన అర్హులై ఉండి వారిపేర్లు నమోదు కాకపోతే, ఏదైనా సవరణలు, తొలగింపులు ఉన్నట్టయితే ప్రత్యేక ప్రచార దినాలలో ఫారమ్‌ – 6, 6ఎ, 7, 8, 8ఎ నమూనాలో తప్పకుండా దాఖలు చేసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ఏదైనా సందేహాలున్న పక్షంలో సంబంధిత తహసీల్‌ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. వివిధ రాజకీయ పార్టీలచే నియమింపబడ్డ బూత్‌స్థాయి ఏజెంట్లు కూడా సంబంధిత వ్యక్తుల ద్వారా ఫాటం 6, 6ఎ, 7, 8, 8ఎ బూత్‌స్థాయి అధికారికి అందజేయవచ్చని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

Check Also

ప్రత్యేక అవసరాలు గల పిల్ల‌ల‌కు పరికరాల‌ పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల‌ విద్యాశాఖ సంచాల‌కులు తెలంగాణ హైదరాబాద్‌ వారి ఆదేశానుసారం ...

Comment on the article