Breaking News

Daily Archives: May 8, 2017

తెలంగాణ బిసి సంక్షేమ సంఘం దోంచంద కార్యవర్గం ఏర్పాటు

  మోర్తాడ్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బిసి సంక్షేమ సంఘం దోంచంద గ్రామ కార్యవర్గాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఉపకులాల సంఘ సమావేశం నిర్వహించి సంఘం అధ్యక్షుడుగా రాజాగౌడ్‌, ఉపాధ్యక్షుడుగా ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎర్రోజి శ్రీనివాస్‌, కార్యదర్శిగా గణేస్‌, సభ్యులుగా రెబ్బస్‌ మల్లయ్య, చింతకుంట గంగాధర్‌, ఎర్రోజి రవిందర్‌, ఎండి.మహ్మద్‌, గంగాధర్‌, పోశెట్టి, దేవిదాస్‌, ఎం.డి. హుస్సేన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలిగా అమృత, రెబ్బస్‌ ...

Read More »

పలు గ్రామాల్లో గ్రామసభలు

  గాంధారి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. మండలంలోని నాగులూర్‌, చద్మల్‌, నేరల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఒంటరి మహిళలు, బీడీ కార్మికులను గుర్తించి వారి వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులందరికి ఫింఛన్లు అందజేయున్న సందర్భంగా ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్టు ఎండివో సాయాగౌడ్‌ తెలిపారు. గ్రామ ...

Read More »

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో 22 కేజీల చేప

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో ఆదివారం మత్స్యకారులకు 22 కేజీల చేప చిక్కింది. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో పెద్ద పెద్దలన్ని నీటి పైకి వస్తున్నాయి. దీంతో మత్స్యకారులకు చాలా ఈజీగా చేపలు చిక్కుతున్నాయి. కాగా ప్రాజెక్ట్‌లో చేపలు భారీ సంఖ్యలో మృతి చెందుతున్నాయి.నీటి పరిమాణం తగ్గిపోయి ఆక్సిజన్‌ అందక పోవడంతో వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read More »

కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో ఎంపి క‌విత భేటీ

ప‌సుపు బోర్డు ఏర్పాటును వేగ‌వంతం చేయాలి ప‌సుపు దిగుమ‌తుల‌పై నిషేధం విధించాలి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల సహాయ మంత్రి నిర్మల సీతారామన్‌తో  స‌మావేశ‌మ‌య్యారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత. ఈ సంద‌ర్భంగా మంత్రికి ప‌సుపు  రైతుల‌ను ఆదుకునేందుకు ముఖ్య‌మైన మూడు అంశాల‌ను ప్ర‌స్తావించిన కవిత వాటి అమ‌లు కోసం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ప‌సుపు రైతులు జాతీయ ప‌సుపు బోర్డును ఏర్పాటు చేయాల‌ని దీర్ఘ‌కాలంగా డిమాండ్ చేస్తున్నార‌ని, బోర్డు ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. తాను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోఢీతో స‌మావేశ‌మైన రెండు ...

Read More »

కోమలంచలో మన వ్యవసాయం

  నిజాంసాగర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోమలంచ, సుంకిపల్లి గ్రామాల్లో మన తెలంగాణ – మన వ్యవసాయం కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ విస్తీర్ణాధికారి రవిందర్‌ మాట్లాడుతూ సేంద్రీయ పద్దతుల్లో వ్యవసాయ చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. మన తెలంగాణ – మన వ్యవసాయం గ్రామసభకు వచ్చిన రైతులకు పంట సాగు విధానంలో మెళకువలను, పశు పోషణ ద్వారా కూడా లాభాలు పొందవచ్చని ఆయన సలహాలు,సూచనలు చేశారు. రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలని, తద్వారా ఏ ...

Read More »

మంగళవారం ఎమ్మెల్యే పర్యటన

  గాంధారి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి పర్యటించనున్నట్టు మండల తెరాస పార్టీ అధ్యక్షుడు ముకుంద్‌రావు తెలిపారు. మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించినట్టు తెలిపారు. మిషన్‌ కాకతీయ మూడవ విడత పనుల్లో భాగంగా మండలంలో మంజూరైన చెరువు పూడికతీత పనులకుశంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 7 గంటలకే మండలంలోని గౌరారం గ్రామం నుంచి ఎమ్మెల్యే పర్యటన ప్రారంభమవుతుందని, కార్యక్రమానికి మండలంలోని తెరాస నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని సూచించారు.

Read More »

సేంద్రీయ వ్యవసాయంతో అధిక లాభాలు

  గాంధారి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని గాంధారి మండల వ్యవసాయాధికారి యాదగిరి అన్నారు. మన తెలంగాణ మన వ్యవసాయంలో భాగంగా సోమవారం మండలంలోని చద్మల్‌ గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు సేంద్రీయ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. అదేవిధంగా ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు 4 వేల రూపాయలు ఎరువుల నిమిత్తం అందజేయనున్నందున ప్రతి ఒక్కరు ...

Read More »

బంజేపల్లిలో ఘనంగా కుస్తీపోటీలు

  నిజాంసాగర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బంజేపల్లి గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీపోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20 రూపాయలనుంచి ప్రారంభమైన పోటీ చివర కుస్తీ 5 తులాల వెండి కడియం వరకు కొనసాగింది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన మల్లయోధులతో పాటు భక్తుల సౌకర్యార్థం టెంట్లు, తాగునీరు, కుర్చీలు ఏర్పాటు చేశారు. అంక్సాపూర్‌ గ్రామానికి చెందిన గంగారాం చివరి కుస్తీ 5 తులాల వెండి గెలుచుకున్నారు. పోటీల్లో విజేతలకు బంజేపల్లి సర్పంచ్‌ ...

Read More »

భగ భగమండుతున్న భానుడు..

  నిజాంసాగర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భానుడి ప్రతాపం రోజురోజుకు పెరగడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు వేసవి తాపానికి విలవిలలాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మండలంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండ వేడిమి రోజురోజుకు పెరుగుతుండడంతో వ్యాపారులు, ప్రయాణీకులు సైతం ఇక్కట్లకు గురవుతున్నారు. వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిప్పుల కొలిమి నుంచి బయటపడలేకపోతున్నారు. ఇళ్లల్లోనే కూలర్లు, ఎసిలు, ఫ్యాన్ల వద్ద సేద ...

Read More »

మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు

  నిజాంసాగర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు అందిస్తామని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎ.ఇ. సుమలత పేర్కొన్నారు. మండలంలోని హసన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పిప్పిరేగడి తాండాలో రక్షితమంచి నీటి ట్యాంకు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. తాండాలో 20 వేల లీటర్ల సామర్థ్యంగల వాటర్‌ ట్యాంకు నిర్మాణానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మంజూరుచేసిందన్నారు. వచ్చే నిధులతో తాండాలో నీటి ట్యాంకు నిర్మాణం పూర్తిచేసి ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలిపారు. ఆమె వెంట గ్రామ ...

Read More »

ఉపాధి పనుల పరిశీలన

  నిజాంసాగర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని బూర్గుల్‌ గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప సోమవారం పరిశీలించారు. గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కందకాలు తవ్వుతున్నారు. మండుటెండలో కూలీలు పనులు చేయడంతో వారికి తాగునీరు, నీడ సౌకర్యాలను ఆయన ఆరా తీశారు. ఉపాధి పనుల్లో 320 మంది కూలీలు పనిచేయడంతో వారి హాజరు మస్టర్‌ను ఆయన పరిశీలించారు. ఉపాధి కూలీలు సమయ పాలన పాటించి మండుటెండలో చేయవద్దని సూచించారు. ఆయన ...

Read More »

గురువుగారు.. శిష్యురాలు..

పూర్వం ఒకానొక ఊరికి ఓ సాధువు వచ్చాడు. అక్కడే నివాసం ఏర్పర్చుకొని రోజూ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పసాగాడు. భగవంతుని శక్తిని తెలియజేసే కథలు ఎన్నో చెప్పేవాడు. భగవంతుడిని మనస్ఫూర్తిగా విశ్వసించాలని బోధించేవాడు. ఆ మంచి మాటలు విని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆ సాధువుకు శిష్యులుగా మారారు. ప్రతి ఉదయం శిష్యుల్లో ఒకరు పాలు, ఒకరు కూరగాయలు, ఇంకొకరు పెరుగు.. ఇలా తెచ్చి గురువుకు ఇస్తూ ఉండేవారు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. పక్క గ్రామానికి చెందిన ఓ మహిళ.. నిత్యం పడవలో ఏరు ...

Read More »