Breaking News

Daily Archives: May 9, 2017

మండల అధికారులతో జిల్లా కలెక్టర్‌ వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్ష

  కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలోని అన్ని మండల స్థాయి అధికారులతో, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మంగళవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి అధికారి వారి మండలాల్లో హరితహారానికి సంబంధించి స్థలాలను గుర్తించాలని సూచించారు. గత హరితహారంలో నాటిన మొక్కలు వేసవి కాలంలో ఎండిపోకుండా ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేసి బతికించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ మల, మూత్ర విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ...

Read More »

తాత్కాలిక అధ్యాపకుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

  కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఆంగ్ల మాధ్యమంలో నడపబడుతున్న గురుకుల పాఠశాలలు, జూనియర్‌, మహిళా డిగ్రీ కళాశాలలో గల ఖాళీలను గెస్టు టీచర్లు, గెస్టు లెక్చరర్ల ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్ల వెనకబడిన తరగతుల అభివృద్ది అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు షషష.ఎయజ్‌ూపషషతీవఱర.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేది మే ...

Read More »

బుధవారం డయల్‌ యువర్‌ డిఎం

  కామారెడ్డి, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌ ఆర్‌టిసి కామరెడ్డి డిపోలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్‌ యువర్‌ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు డిఎం జనార్థన్‌ తెలిపారు. కామారెడ్డిజిల్లాలోని ప్రయాణీకులు తమ తమ సమస్యలు ఫోన్‌ ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు. ఫోన్‌ చేయాల్సిన నెంబరు 9959226039 కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

Read More »

ఒంటరి మహిళకు ఆసరా…

  నిజాంసాగర్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట, ఆరేపల్లి గ్రామాల్లో ఒంటరి మహిళలకు పింఛన్‌ అందించేందుకు దరఖాస్తులు స్వీకరణ కోసం గ్రామసభ ఏర్పాటు చేశారు. ముందుగా అచ్చంపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఐదుగురు ఒంటరి మహిళలు దరఖాస్తులు చేసుకున్నారు. అనంతరం ఆరేపల్లిలో ముగ్గురు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిడివో రాములు నాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఆసరాకల్పించేందుకు ప్రబుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అబ్దుల్‌ గనిఖాన్‌, రెవెన్యూ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.

Read More »

వాణిజ్య పంటలపై రైతులు ఆసక్తి కనబర్చాలి

  బీర్కూర్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాణిజ్య పంటలపై రైతులు ఆసక్తి కనబర్చినపుడే మెరుగైన ఆర్తిక విదానం రైతులకు కలుగుతుందని వ్యవసాయాధికారిణి కమల అన్నారు. పంట మార్పిడి విధానం ద్వారా రైతులకు లాభాలు చేకూరుతాయని, వాణిజ్య పంటల ద్వారా రైతులకు అధిక లాభాలతో అభివృద్ది సాధిస్తారని ఆమె తెలిపారు. మండలంలోని దుర్కి గ్రామంలో మంగళవారం మన తెలంగాణ, మన వ్యవసాయం నిర్వహించారు. రసాయన ఎరువుల వాడకం వల్ల ఆహార పదార్థాల్లో కల్తీ పదార్థాలు చోటుచేసుకుంటాయని, సేంద్రీయ ఎరువుల ద్వారా ...

Read More »

కొనసాగుతున్న ఎల్లమ్మ జాతర

  నిజాంసాగర్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయంలో జాతర ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తినెత్తుకొని గ్రామ వీధుల్లో ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. బుధవారం కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్టు సర్పంచ్‌ మణెమ్మ తెలిపారు.

Read More »

నిజాంసాగర్‌కు పూర్వవైభవం తెస్తాం

  బీర్కూర్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలోలాగా నిజాంసాగర్‌ ఆయకట్టు కింద ఉన్న రైతులకు రెండు పంటలు సమృద్ధిగా పండేవిధంగా పూర్వ వైభవాన్ని అందిస్తామని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని దుర్కి గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాలేశ్వరం నుంచి నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి తెచ్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, 2018 జూన్‌ నుంచి నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు 365 రోజులు నీటిని అందిస్తామని అన్నారు. రైతులకు తెరాస ప్రభుత్వంలో సముచిత ...

Read More »

ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

  నిజాంసాగర్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో ప్రవేశానికి విద్యార్థుల నుంచిదరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ చంద్రకళ తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని, 30, 31వ తేదీల్లో దరఖాస్తుల పరిశీలన ఉంటుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్తులు సంబంధిత రసీదు తమకు అందజేయాలన్నారు. ఆదర్శ పాఠశాలలో చదవడానికి ఆసక్తిగల 10వ తరగతి పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read More »

 రెండు పడకగదుల ఇళ్ళ కోసం స్థల పరిశీలన

  బీర్కూర్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో ఆర్డీవో రాజేశ్వర్‌ రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడుతుందని ఆయన అన్నారు. స్వంత ఇంటి కల నెరవేర్చే ఉద్దేశంతో గ్రామంలోని పేదవారికి అధికారులతో గుర్తింపబడిన అర్హులకు దశల వారిగా ఇళ్ల నిర్మాణం చేయబడుతుందని ఆయన వివరించారు. అర్హులైన లబ్దిదారులను అధికారులను గుర్తించి, ఎటువంటి ...

Read More »

క్రుళ్ళిన మృతదేహం లభ్యం

  నందిపేట, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సిద్దాపూర్‌ గ్రామ శివారులో మంగళవారం వృద్దుని కుళ్లిన మృతదేహం లభ్యమైంది. తహసీల్దార్‌ ఉమాకాంత్‌ కథనం ప్రకారం… సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన ధర్పల్లి పెద్ద చిన్నయ్య (75) మానసిక స్థితి సరిగా లేక ఇంటినుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళి అప్పుడప్పుడు తిరిగి వచ్చేవాడని, మే 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఇంట్లోంచి వెళ్ళి తిరిగి రాలేదు. అయితే మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో సిద్దాపూర్‌ శివారులోని తొర్తి పెద్ద ...

Read More »

కొనసాగుతున్న మన తెలంగాణ- మన వ్యవసాయం

  నందిపేట, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని గంగాసముందర్‌, మారంపల్లి, దత్తాపూర్‌ గ్రామాల్లో మన తెలంగాణ – మన వ్యవసాయంలో భాగంగా మంగళవారం రైతులకు అవగాహన సభలు నిర్వహించారు. వ్యవసాయాధికారి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ పసుపు విత్తనశుద్ది, దాని లాభాలు, విత్తనోత్పత్తి పథకం, రైతు సంఘాల ఏర్పాటు విధి విధానాల గురించి అవగాహన కల్పించారు. రాబోయే వర్షా కాలంలో రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు నాటాలి, ప్రభుత్వ పథకాలు, రాయితీలను వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ...

Read More »

మ్యాంగో రైస్‌

కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం- ఒక కప్పు, మామిడికాయలు- రెండు (సన్నగా తురుముకోవాలి), పల్లీలు- ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు- ఒక టీ స్పూను, మినప్పప్పు, శనగపప్పు- ఒక్కో టీ స్పూను, అల్లం తురుము- అర టీ స్పూను, ఎండు మిర్చి- రెండు, పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- ఒక రెబ్బ, పసుపు- అర టీ స్పూను, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత. తయారీ విధానం బాస్మతి బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ...

Read More »