Breaking News

కామారెడ్డిలో ఎయిర్‌టెల్‌ 4జి

 

కామారెడ్డి, మే 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే వేగవంతమైన నెట్‌వర్క్‌ కలిగి ఉండి కోట్లాది మంది వినియోగదారులు కలిగిఉన్న ఎయిర్‌టెల్‌ సంస్థ వినియోగదారులకు మరింత సులభంగా డాటా కాల్స్‌ను అందజేసేందుకుగాను 4జి సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగానే బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌, మెదక్‌ జోనల్‌ బిజినెస్‌ మాన్‌ విక్రం చంద్‌ ఎయిర్‌టెల్‌ 4జి సేవలను కేక్‌ కట్‌చేసి ప్రారంభించారు. వినియోగదారులకు అతిచౌకగా కాల్స్‌తోపాటు డైలీ 1 జిబి డేటాను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు.

349 రూపాయలు రీచార్జ్‌తో దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ మాట్లాడుకోవచ్చని 28 రోజులపాటు ప్రతిరోజు 1 జిబి డాటా అందిస్తున్నామన్నారు. ఏన్నో ఏళ్ళుగా వినియోగదారులు తమ సంస్థను ఆదరిస్తు ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జోనల్‌ సేల్స్‌ మేనేజర్‌ మధుసూదన్‌రెడ్డి, కామరెడ్డి ఎయిర్‌టెల్‌ డిస్ట్రిబ్యూటర్‌ నాగరాజు, ప్రదీప్‌, దిలీప్‌రెడ్డి, వినియోగదారులు నరేశ్‌, రాము, లక్ష్మణ్‌, రమేశ్‌, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *