Breaking News

Daily Archives: May 13, 2017

14న మహాగర్జన

  కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థికంగా వెనకబడిన వారికి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, మండలానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం కామారెడ్డి జిల్లా ప్రసన్న ఆంజనేయ రెడ్డి సంఘం ఆద్వర్యంలో మేడ్చల్‌ జిల్లా సాకేత్‌ భూసత్య గార్డెన్లో ఆదివారం జరిగే మహాగర్జనకు సంబంధించిన గోడప్రతులను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కో కన్వీనర్‌ మనోహర్‌రెడ్డి, ...

Read More »

106 రోజుల సమరశీల సమ్మె ఫలితంగా వేతనాల పెంపు

  – సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ వర్కర్లకు 106 రోజుల సమరశీల సమ్మె ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిందని సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఆశ వర్కర్లకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిద్దిరాములు మాట్లాడుతూ తెలంగాణ వాలంటరీ & కమ్యూనిటి హెల్త్‌ వర్కర్స్‌ఆశ యూనియన్‌ సిఐటియు సుదీర్ఘ పోరాట విజయం సాధించిందన్నారు. ఆలస్యంగానైనా అంతిమంగా ...

Read More »

జీవ ఎరువుల వాడకంతో మంచి దిగుబడి

  నందిపేట, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవ ఎరువుల వాడకంతోనే పంటలో మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారి పద్మ అన్నారు. ఈ మేరకు శనివారం నందిపేట మండలంలోని తల్వేద, లక్కంపల్లి, చింరాజ్‌పల్లి గ్రామాల్లో మన తెలంగాణ – మన వ్యవసాయం సంబంధించిన రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ విత్తనశుద్ది, భూసార పరీక్షలు, రైతు సమగ్ర సర్వే తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చింరాజ్‌పల్లి సర్పంచ్‌ దివ్వరాజు, లక్కంపల్లి సర్పంచ్‌ గండ్ర శ్రీలత, ...

Read More »

ఆటోడ్రైవర్లకు యూనిఫాం పంపిణీ

  బీర్కూర్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ గ్రామంలోని ఆటో డ్రైవర్లకు లక్ష్మినర్సింహ పెట్రోల్‌ బంక్‌ యజమాని శశికాంత్‌ 40 మంది ఆటో డ్రైవర్లకు ఉచితంగా యూనిఫాం అందజేశారు. సిఐ శ్రీనివాస్‌ కోరిక మేరకు ఆయన చేతుల మీదుగా ఆటోడ్రైవర్లకు యూనిఫాం ఉండాలనే నిబంధన మేరకు యూనిఫాం దుస్తులు పంపిణీ చేయడం జరిగిందని శశికాంత్‌ అన్నారు. ఈ సందర్బంగా బంక్‌ యజమాని శశికాంత్‌ను సిఐ అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌, ఏఎస్‌ఐ మజీద్‌ఖాన్‌, ఆటోడ్రైవర్లు, బంక్‌ సిబ్బంది తదితరులు ...

Read More »

ఆదివారం నుంచి ఓటరు నమోదు కార్యక్రమం

  బీర్కూర్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో ఆదివారం నుంచి ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్టు తహసీల్దార్లు కృష్ణానాయక్‌, డేవిడ్‌లు తెలిపారు. బూత్‌ లెవల్‌ అధికారులతో సమావేశం నిర్వహించి నూతన ఓటరు ప్రక్రియ, మార్పులు, చేర్పులకు సంబంధించి తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. ఓటరు నమోదుకు ఫాం -6, మిలటరీ ఓటర్లకు ఫాం-6ఎ, తొలగింపులకు ఫాం-7, పాత ఓటరు సవరణలకు ఫాం-8, నియోజకవర్గం మార్పు కొరకు ఫాం-8ఎలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం ...

Read More »

ధాన్యం కొనుగోలు కోసం ధర్నా, రాస్తారోకో

  బీర్కూర్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారులు ఇష్టారాజ్యంగా పెద్ద రైతుల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు శనివారం బీర్కూర్‌ కామప్ప చౌరస్తాలో ధర్నా నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత కొంత కాలం క్రితం వడగండ్ల వాన వల్ల పంట నష్టం వాటిల్లిందని, తక్కువ మొత్తంలో వడ్లు తెచ్చిన రైతులకు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం ...

Read More »

క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి

  మోర్తాడ్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడల వల్ల గ్రామాల్లో స్నేహసంబంధాలు పెంపొందిస్తాయని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌ అనిత, ఎంపిటిసి ఎనుగందుల అశోక్‌, ఎంఇఓ రాజేశ్వర్‌, ఏర్గట్ల, మోర్తాడ్‌ మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కల్లడ ఏలియా, రాజా పూర్ణానందం అన్నారు. శనివారం మండలంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంతన్న యువసేన ఆధ్వర్యంలో దివంగత నేత వేముల సురేందర్‌రెడ్డి స్మారకార్థం జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్ని ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన ...

Read More »

బృహత్తర పథకాలు అమలుచేసి అందిస్తున్న సిఎం కెసిఆర్‌

  మోర్తాడ్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ రాష్ట్రంలో ఏప్రభుత్వం అమలు చేయని విధంగా అన్ని వర్గాల అభివృద్దే ద్యేయంగా బృహత్తర పథకాలు ప్రజలకు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, సర్పంచ్‌ అనిత, ఎంపిటిసి ఎనుగందుల అశోక్‌, ఎంపిడివో శ్రీనివాస్‌, నయాబ్‌ తహసీల్దార్‌ జనార్ధన్‌లు అన్నారు. శనివారం మండలంలోని పాలెం గ్రామ యాదవ సంఘ భవనంలో సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం గొల్ల కుర్మ యాదవుల అభివృద్దికి 75 శాతం సబ్సిడీ ...

Read More »

ఆదివారం మండలంలో ఎమ్మెల్యే పర్యటన

  మోర్తాడ్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల, మోర్తాడ్‌ మండలాల్లోని గుమ్మిర్యాల్‌, బట్టాపూర్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పలు అభివృద్ది పనులకు బూమిపూజ చేసి ప్రారంభించనున్నారని మండల తెరాస అధ్యక్షుడు కల్లడ ఏలియా తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో మండల ప్రజాప్రతినిధులు నాయకులు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.

Read More »