Breaking News

వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

 

కామారెడ్డి, మే 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌పిఆర్‌ పాఠశాలలో క్రీడాభారతి ఆద్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించారు. నిర్వాహకులు అంకుష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. 18 సంవత్సరాల బాలబాలికలకు ప్రత్యేక క్రీడల్లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. కబడ్డి, ఖోకో, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌తోపాటు ఇతర క్రీడల్లో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడాభారతి సబ్యులు మహిపాల్‌,సతీష్‌, ప్రవీణ్‌, రవి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *