Breaking News

Daily Archives: May 20, 2017

1.26 లక్షల క్వింటాళ్ళ వరికొనుగోళ్ళు

  కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఈనెల 20వ తేదీ వరకు 1.26 లక్షల 485 క్వింటాళ్ళ వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య తెలిపారు. మొత్తం 190 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా 186 కేంద్రాలు ఏర్పాటు చేయగా 182 కేంద్రాల్లో ఇంత మొత్తంలో వరి కొనుగోలు చేసినట్టు తెలిపారు. 2 లక్షల 30 వేల 94 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా 1.26 ...

Read More »

కాళభైరవ ఆలయాన్ని దర్శించిన రాష్ట్ర ప్రతినిధులు

  కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని శ్రీకాళభైరవ స్వామి ఆలయాన్ని శనివారం రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్‌ శ్రీధర్‌, రాష్ట్ర ఫుడ్‌ సెక్యురిటి ఛైర్మన్‌ తిరుమల్‌రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు వారికిఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకం నిర్వహించారు. ఆలయం తరపున వారికి జ్ఞాపికలు, తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

Read More »

మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

  నందిపేట, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆర్మూర్‌ నియోజకవర్గంలో మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా శనివారం నందిపేట మండలంలో పర్యటించి చెరువు పనులు ప్రారంభించారు. సిద్ధాపూర్‌ గ్రామంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పనులు ఖుదావన్‌పూర్‌, జోర్పూర్‌, దత్తాపూర్‌, మారంపల్లి,గంగాసారం, నూత్‌పల్లి, మాయపూర్‌, ఉమ్మెడ, తల్వేద, లక్కంపల్లి, చింరాజ్‌పల్లి, సిహెచ్‌ కొండూరు గ్రామాల్లోని చెరువుల పనులు ప్రారంభించారు. ఖుదావన్‌పూర్‌ చెరువులో చనిపోయిన చేపలను పరిశీలించి ఫిషర్స్‌ ఆఫీసర్‌తో మాట్లాడి బెస్తవారిని ఆదుకోవాలని ఆజ్ఞాపించారు. గత ...

Read More »

టిడిపి శ్రేణుల్లో ఉత్తేజం నింపిన రేవంత్‌రెడ్డి

  నందిపేట, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనాబా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ టిడిపి ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారాం యాదవ్‌ చేపట్టిన రెండ్రోజుల దీక్షకు మద్దతుగా టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో రేవంత్‌రెడ్డి మొదటిసారిగా ఆర్మూర్‌ నియోజకవర్గానికి రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. పాలకపక్ష తెరాస నాయకుల ఆగడాలను ఎత్తిచూపుతూ తనదైన చమత్కార భాషతో విమర్శ బాణాలు సంధించడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. ఆర్మూర్‌ నుంచి నందిపేట వరకు గ్రామాల్లోని టిడిపి కార్యకర్తలు ...

Read More »