Breaking News

Daily Archives: May 28, 2017

ఘనంగా ఎన్‌టిఆర్‌ జయంతి

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు దివంగతర ఎన్‌టిఆర్‌ జయంతిని టిడిపి నాయకులు ఆదివారం కామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట గల ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం అభ్యున్నతే లక్ష్యంగా ఎన్‌టిఆర్‌ టిడిపిని స్థాపించిన కొన్నినెలల్లోనే అధికారంలోకి తెచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు ఉస్మాన్‌, చీల ప్రభాకర్‌, నజీరుద్దీన్‌, ముఖీం, ఖాసిం అలీ, రాజయ్య, ...

Read More »

స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారం

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి స్వర్ణకార యువజన సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు మర్కంటి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు ప్రబాకర్‌, ప్రధాన కార్యదర్శి ఉపేశ్‌, సహాయ కార్యదర్శి సంతోష్‌, కోశాధికారి బ్రహ్మచారి, సలహాదారులు, కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో చక్రపాణి, బ్రహ్మం, వెంకయ్య, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బోరుమోటారు పనులు ప్రారంభం

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 10వ వార్డు నయాబజార్‌ ప్రాంతంలో బోరు మోటారు పనులను కాంగ్రెస్‌పట్టణ అద్యక్షుడు కైలాష్‌ శ్రీనివాస్‌రావు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ప్రత్యేకనిదులు రూ. 3 లక్షలతో రెండు బోరు మోటారు పనులు చేపడుతున్నట్టు తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీకి, వార్డు కౌన్సిలర్‌ కైలాష్‌ లక్ష్మణ్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జమీల్‌, జొన్నల నర్సింలు, గోనె శ్రీనివాస్‌, శంకర్‌, రాఘవులు, రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అట్టహాసంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాపరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల 1983-84 పదవ తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కామారెడ్డి పట్టణంలో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు.ది స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్స్‌ వెల్పేర్‌ సొసైటీగా ఏర్పడ్డ సుమారు 100మంది పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మృతి చెందిన సహచరులకు మౌనం పాటించారు. సొసైటీ కోసం పనిచేసిన, పనిచేస్తున్న వారిని సన్మానించారు. కార్యక్రమంలో లక్ష్మినారాయణ, వెంకటి, చంద్రకాంత్‌, పండరి, వైద్యులు రమేశ్‌బాబు, దినేష్‌రెడ్డి, ...

Read More »

గౌడ కులస్తులు అన్నిరంగాల్లో రాణించాలి

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల అదినేత డాక్టర్‌ మారయ్యగౌడ్‌ అన్నారు. జమదగ్ని గౌడ సంక్షేమ సంఘం ఆద్వర్యంలో కామారెడ్డిలో నిర్వహించిన ఉత్తమ గౌడ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల సబకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గౌడ కులస్తులు కులవృత్తితో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని సూచించారు. విద్యాపరంగా అభివృద్ది చేసి తమ పిల్లలను ఉన్నత స్థాయిలో నిలపాలని సూచించారు. 10 వతరగతి, ఇంటర్‌ ...

Read More »

మహిళలు పరిశుభ్రత పాటించాలి

  కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు శారీరక పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ప్రపంచ బహిష్టు శుభ్రత నిర్వహణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. స్వచ్చంద సంస్థలు టాకీ వాటర్‌, లైట్‌ ఫర్‌ బ్లైండ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. బహిష్టు సమయంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులను సంప్రదించాలన్నారు. ...

Read More »

ఈతకు వెళ్లి యువకుడు మృతి

  గాంధారి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల గండివేట్‌ గ్రామంలో ఆదివారం మద్యాహ్నం చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం… గ్రామానికి చెందిన అయ్యల క్రాంతి (30) ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు గ్రామ శివారులోగల బల్లం చెరువులో ఈత నేర్చుకోవడానికి వెళ్లాడు. చెరువు ఒడ్డుకు రాగానే కాలుజారి నీటిలో పడిపోగా, సరిగ్గా ఈతరాకపోవడం, చెరువులో నీరు లోతుగా ఉండడంతో మునిగిపోయాడు. గమనించిన గ్రామస్తులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి ...

Read More »

రైతులకు నాణ్యమైన సరుకులు అందించాలి

  గాంధారి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు నాణ్యమైన సరుకులు అందించి వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి అన్నారు. గాంధారి మండల కేంద్రంలో ఆదివారం నూతనంగా ప్రారంభించిన కేదారేశ్వర్‌ ట్రేడింగ్‌ కంపెనీ దుకాణంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ వ్యాపారంలో లాభంతోపాటురైతులకు న్యాయం చేసేవిధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. దుకాణంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల అమ్మకం వివరాలు తెలుసుకున్నారు. స్వయంగా మొక్క విత్తనాల ప్యాకెట్లను కొనుగోలు చేశారు. అనంతరం ...

Read More »