Breaking News

Monthly Archives: June 2017

విధుల్లో సేవలు మరువలేనివి

  జిల్లా సాంఘిక సంక్షేమాధికారి దేవిదాస్‌ కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ విదుల సమయంలో సేవలు చేసిన వారి జీవితంలో ప్రజలు మరిచిపోరని జిల్లా సాంఘిక సంక్షేమాధికారి దేవిదాస్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వివిధ శాఖల్లో పనిచేస్తు పదవివిరమణ పొందిన రాజారమేశ్‌, సుగుణ, మాదర్‌లను సన్మానించారు. వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు వారిని తరలించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు శ్రీనివాస్‌, రాజు, మోతిసింగ్‌లు ఉన్నారు.

Read More »

విద్యుత్‌షాక్‌తో గేదెల మృతి

  బీర్కూర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామానికి చెందిన రెండు గేదెలు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాయి. స్థానికుల కథనం ప్రకారం గత మూడురోజులుగా కురుస్తున్న వర్సాలకు విద్యుత్‌ స్థంభాలు తెగిపడ్డాయి. గేదెలు మేత మేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్టు యజమాని రఫీ తెలిపారు. పాలవ్యాపారం చేసుకుంటూ తాను జీవనం సాగిస్తున్నానని, రెండు గేదెలు సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని, తమకు పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

Read More »

హరితహారం విజయవంతం చేయాలి

  గాంధారి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గాంధారి తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక తహసీల్‌ కార్యాలయంలో పూల మొక్కలు నాటారు. స్వయంగా ఖర్చులతో తెప్పించిన ఖరీదైన పూలమొక్కలను కార్యాలయ ఆవరణలో నాటారు. ఇదేవిధంగా మరిన్ని పూల మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. గత సంవత్సరం కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలు ఎప్పటికప్పుడు సంరక్షిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా వాటిని కాపాడుతామని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి యాదగిరి, సిబ్బంది ఉన్నారు.

Read More »

డిమాండ్ల పరిష్కారానికి కదిలిన ముదిరాజ్‌లు

  గాంధారి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్లను పరిష్కరించాలని ముదిరాజ్‌ కులస్తులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో మండలానికి చెందిన ముదిరాజ్‌లు జిల్లా కమిటీ సభ్యులతో కలిసి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెద్దమ్మ ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్‌ ర్యాలీ కొనసాగింది. అనంతరం స్థానిక తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌, ఎండివో సాయాగౌడ్‌లకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి భట్టు విఠల్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ ...

Read More »

హరితహారం వేగవంతం చేద్దాం

  నిజాంసాగర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం పథకం మండలంలో వేగవంతంగా కొనసాగుతుందని, సిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రతి కుటుంబంలో మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. గ్రామాల సమీపంలోగల నర్సరీల నుంచి మొక్కలను వ్యవసాయ గట్లపై, అటవీ ప్రాంతాల్లో కూలీలచే నాటిస్తున్నారు. మండలంలోని కోమలంచ, సింగీతం, గున్కుల్‌ గ్రామాల్లో హరితహారం పథకంలో నాటుతున్న మొక్కలను ఎంపిడివో రాములు నాయక్‌, ఉపాధి హామీ ఎపివో సుదర్శన్‌లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ మొక్కలు ...

Read More »

తహసీల్దార్‌ను సన్మానించిన రేషన్‌ డీలర్లు

  నిజాంసాగర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్‌ అబ్దుల్‌ గనిఖాన్‌ పదవి విరమణ పొందడంతో రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ ఆద్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ నిజంసాగర్‌ మండల ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించారని, మండల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారన్నారు. కార్యక్రమంలో గిర్దావర్‌ సయ్యద్‌ హుస్సేన్‌, రేషన్‌ డీలర్లు కిష్టయ్య, ఆగమయ్య, సురేశ్‌, రఫీక్‌, గంగారాం, వీరేశం, ...

Read More »

ఆన్లైన్ మీడియా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఆన్లైన్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆన్లైన్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ (తోజు) మరియు తెలంగాణ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తోమ్జ) రెండు వీలినమయ్యి తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తొమ్వాజ) గా ఆవిర్భవించింది. ఈ సందర్భంగా తొమ్వాజ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయిలు రమేష్ మాట్లాడుతూ ప్రింట్ ...

Read More »

ముమ్మరంగా పారిశుద్యపనులు

  నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం వ్యాదులు ప్రబలకుండా బూర్గుల్‌ గ్రామంలో పారిశుద్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప పనులు పర్యవేక్షిస్తున్నారు. వర్షాకాలం మురికి కాలువల వల్ల వ్యాధులుప్రబలే ప్రమాదముందని, ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటిని కాచి వడబోసి వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ అనిత ఉన్నారు.

Read More »

కామారెడ్డిలో గంటపాటు భారీ వర్షం

  కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలో గురువారం సాయంత్రం నుంచి గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో రెండుగంటలకు పైగా విద్యుత్‌ను ట్రాన్స్‌కో అధికారులు నిలిపివేశారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన బతుకమ్మ కుంట, అయ్యప్పనగర్‌, గొల్లవాడ, విద్యానగర్‌ చౌరస్తాలో భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులైన సిరిసిల్లా రోడ్డు, నిజాంసాగర్‌ చౌరస్తాల్లో వర్షపునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం ...

Read More »

నల్లవాగుకు జలకళ

  నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాసాగర్‌ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా సమీపంలోగల నల్లవాగు ఆనకట్టుకు జలకళ సంతరిస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని కల్హేరు, మాసన్‌పల్లితోపాటు నల్లవాగు ప్రాంతంలో వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లవాగు కట్టలోకి నీరువచ్చి చేరింది. ఒకేసారి ఒక్కవర్షం కురిస్తే చాలు పొంగిపొర్లే విధంగా నిండుకుండలా మారింది. నల్లవాగులోకి నీరు రావడంతో ఆయకట్టు కింద ఉన్న అచ్చంపేట, బ్రహ్మణ్‌పల్లి, లింగంపల్లి, మాగి, గోర్గల్‌ గ్రామాలకు చెందిన రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. నల్లవాగు పొర్లితే పంటలు పుష్కలంగా ...

Read More »

ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు అందిస్తాం

  నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిఇ వెంకటస్వామి అన్నారు. మండల కేంద్రంలోని పెద్దఫూల్‌ వంతెన కింది భాగంలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైప్‌లైన్‌ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొచ్చి స్వచ్చమైన నీటిని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఎ.ఇ. రాజశేఖర్‌, శివకుమార్‌, ...

Read More »

హరితహారంలో 65 వేల మొక్కలు

  నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర సిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం పథకం వేగవంతంగా కొనసాగుతుంది. నిజాంసాగర్‌ మండలంలోని మాగి, నర్వా, మగ్దుమ్‌పూర్‌ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలచే 65 వేల మొక్కలు నాటినట్టు ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటితే చక్కగా పెరుగుతాయని, హరితహారం విజయవంతం చేసేందుకు అందరు కృషి చేయాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని, ఇందుకోసం ప్రతి ఒక్క ...

Read More »

అటవీ భూమి కాపాడాలని గ్రామస్తుల ఆందోళన

  గాంధారి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్యాక్రాంతమై పోతున్న అటవీ భూమిని రక్షించాలని ఆందోళన చేసిన గ్రామస్తులపైనే అటవీశాఖ అధికారులు ఎదురుదాడికి దిగిన సంఘటన గాంధారి మండలం నాగ్లూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మండలంలోని నాగ్లూర్‌ గ్రామ శివారులో అటవీశాఖకు సంబంధించిన అటవీ భూమి కంపార్లుమెంటు 765లో వుంది. ఈ యేడు వర్సాకాలం ప్రారంభం కావడంతో ఇదే మండలానికి చెందిన నేరల్‌ తాండా గ్రామస్తులు అటవీ భూమిలో పంటలు వేసుకోవడానికి సిద్దమయ్యారు. గత వారం పదిరోజులుగా కంపార్టుమెంటు ...

Read More »

వృధాగా ఉన్న బోరుబావులను మూసివేయాలి

  గాంధారి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ భూముల్లో, గ్రామంలో వృధాగా ఉన్న బోరుబావులను మూసివేయాలని గాంధారి సర్పంచ్‌ సత్యం అన్నారు. గురువారం గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లోకి స్వయంగా వెళ్ళి వృధాగా వున్న బోరుబావులను పరిశీలించారు. వాటిని స్వయంగా రాళ్లతో పూడ్చివేశారు. వ్యవసాయ భూముల్లో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను జూలై 10వ తేదీలోపు యజమానులు పూడ్చివేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలో సైతం నిరుపయోగ బోరుబావులను వారంలో గుర్తిస్తామని, వాటిని కూడా పూడ్చివేయాలన్నారు. జూలై 10వ తేదీ తరువాత ...

Read More »

దుర్గంలో స్వచ్చభారత్‌

  గాంధారి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని దుర్గం గ్రామ పంచాయతీలో గురువారం గ్రామస్తులు స్వచ్చ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా యువకులు మాట్లాడుతూ గత సంవత్సరంలో వర్షం ద్వారా కొట్టుకొని వచ్చే మురికి నీరు ఇళ్ల ముందు, చిన్న చిన్న గుంతల్లో నిలువ అయి వాటి ద్వారా దోమలు, ఈగలు, క్రిమి కీటకాలు తయారై మురికి నీటి ద్వారా దుర్వాసన వస్తుందని తెలిపారు. గత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు వీధుల్లో ఎలాంటి వర్షపు ...

Read More »

కస్తూర్బా గాంధీ విద్యాలయం తనిఖీ

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోగల టేక్రియాలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ బుధవారం తనిఖీ చేశారు. పనులు అసంపూర్తిగా ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, ఇతర పనుల విసయంలో అధికారులు అలసత్వం వహించడంపై మండిపడ్డారు. పనులు త్వరితగతిన పూర్తిచేసి విద్యాలయాన్ని పూర్తిస్తాయిలో అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి మదన్‌మోహన్‌, ఎస్‌ఎస్‌ఏ.ఇ. గోపాల్‌, పాఠశాల ప్రత్యేకాధికారి లావణ్య, ...

Read More »

మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ నిధి ద్వారా మహిళలకు ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని అభివృద్దిలోకి రావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా స్త్రీనిధి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఆర్‌డిఎ అధికారులు, జిల్లా సమాఖ్య పాలకవర్గ సభ్యులు, నాలుగు మండలాల సమాఖ్య అధ్యక్షురాలు, ఎపిఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్త్రీనిధి కార్యకలాపాలు రాష్ట్రంలోనే అగ్రగామిగా కామారెడ్డి నిలవాలని, అందుకనుగునంగా పనిచేయాలని ఆదేశించారు. స్త్రీనిధి ...

Read More »

వికలాంగుల హక్కుల సాధనకు ఉద్యమం

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వికలాంగుల హక్కుల సాదనకు ఉద్యమాలే శరణ్యమని వికలాంగులు ఉద్యమ బాటకు సిద్దం కావాలని ఎంపిఆర్‌డి రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివన్న అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయ ఆవరణలో బుధవారం వికలాంగుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎంపిఆర్‌డి) తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఆగస్టు 27,29 తేదీల్లో సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్నామన్నారు. సభలకు 31 జిల్లాల నుంచి వెయ్యి మంది ...

Read More »

గ్రామాల్లో రెవెన్యూ సర్వే

  నందిపేట, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని మల్లారంగ్రామంలో తహసీల్దార్‌ ఉమాకాంత్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఇంటింటికి తిరుగుతూ రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం విఆర్‌ఓలతో కలిపి బృందంగా ఏర్పడి 4 గ్రామాల్లో సిర్పూర్‌, గంగాసముందర్‌, కొమట్‌పల్లి, మల్లారం గ్రామాల్లో సర్వే చేయనున్నామన్నారు. అందులో భాగంగా బుధవారం మల్లారం గ్రామంలో సర్వే చేయడం జరిగిందని పేర్కొన్నారు.

Read More »

ఫసల్‌బీమా పథకాన్ని వినియోగించుకోవాలి

  కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని రైతులు వినియోగించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ సూచించారు. ఫసల్‌ యోజన, వాతావరణ ఆధారిత బీమా, యునైటెడ్‌ ప్యాకెజ్‌ ఇన్సురెన్సు స్కీం, తదితర పథకాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇన్సురెన్సు చాలా ముఖ్యమని, రైతులు లోన్‌ రెనివల్‌ చేసుకునేటపుడు వాటి ద్వారా ప్రీమియం కట్‌ చేయించుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రీమియం ...

Read More »