ఉరుముతున్న ఉగ్రభూతం!

మారణహోమం సృష్టిం చేందుకు వాహనాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నా రు. ఇప్పుడు లండన్‌లో జరిగిన దాడి కూడా వాహనం తోవచ్చి ప్రజలను ఢీకొట్టి ఆతర్వాత విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపేందుకు ప్రయత్నం చేశారు. మొదట థేమ్స్‌ నదీపై ఉన్న లండన్‌ వంతెనపై వ్యాన్‌తో పాదచారులను ఢీకొట్టి అక్కడి నుంచి దిగువనున్న బరో మార్కెట్‌ ప్రాంతానికి దూసుకువెళ్లారు. అక్కడ రైలింగ్‌ను ఢీ కొట్టి వ్యాన్‌లోనుంచి బయటకు దూకిన ముగ్గురు ఉగ్రవాదులు మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న అమాయకు లపై విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. ఇక్కడా అక్కడా అనిలేదు. మోహం, మెడ, ఛాతి, పొట్ట, వీపు, గొంతు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పొడు స్తూ కాళ్లతోతన్నుతూ తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించా రు. ఒక యువతిని పదిహేనుసార్లకు పైగా పొడిచారంటే ఎంత కర్కశంగా వ్యవహరించారో అర్థమవ్ఞతుంది. వీరి రాక్షసత్వానికి భయపడి పరిగెడుతున్నవారిని కూడా వెంటపడి దాడిచేసి మరీ కత్తులతో పొడిచి గాయపరి చారు. ఏడుగురు చనిపోగా మరో నలభైఎనిమిది మంది కిపైగా గాయాలపాలయ్యారు. వారిలో ఇరవైఐదు మంది పరిస్థితి ఆందోళనకరంగాఉంది.దాడి సమాచారం అందు కున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ముగ్గురు అనుమానితులను కాల్చివేశారు. ఈ సంఘటన పట్ల ప్రపంచంలోని అనేక దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాక దాడిని ఖండిం చాయి.

ఈ సంఘటనకు సంబంధించి భద్రతా సంస్థల సీనియర్‌ అధికారులతో ప్రధాని థెరిసా మే సమావేశం అయ్యారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే హింసను అనుమతించే ప్రసక్తేలేదని ఆమె ప్రకటిం చారు.బ్రిటన్‌లో ఇస్లామిక్‌ఉగ్రవాదాన్ని నిలువరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రా యపడ్డారు. అంతేకాదు ఇటీవల బ్రిటన్‌లో జరిగిన దాడు లన్నీ ఇస్లామిస్ట్‌ అతివాద దుష్టసిద్ధాంతం పేరుతో జరిగి నవేనని ఆ సిద్ధాంతాన్ని పారద్రోలడమే ప్రస్తుతం అంద రి ముందున్న పెద్ద సవాల్‌ అని ఆమె వ్యాఖ్యానించారు. బ్రిటిష్‌ అతివాదంపట్ల ఎక్కువసహనంగా ఉందని కూడా అన్నారు. గత మూడు నెలల కాలంలో బ్రిటన్‌లో ఇది మూడోదాడి అని ఆమె వివరించారు. వాహనాలను ఆయుధాలుగా మార్చుకోవడం గత దశాబ్దం నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు.

2006 మార్చి మూడున అమెరికాలోని ఉత్తరకరోలినా విశ్వవి ద్యాలయంలో మహ్మద్‌రజా అనే వ్యక్తి తన వాహనంతో ప్రజలను ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించారు.ఆ తర్వా త అక్కడే ఆగస్టు ముప్ఫైన మరొకరు ఇదే తరహాలో ప్రయత్నించి ఒకరిని చంపి పద్దెనిమిది మందిని గాయ పరిచారు.2007లోజూన్‌30న స్కాట్‌లాండ్‌లోని గ్లాస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో వాహనాలతో ఢీ కొట్టి చంపే మరో ప్రయత్నం జరిగింది. అలాగే 2008లో ఇజ్రాయిల్‌ రాజధాని జెరుసలాంలో ఉగ్రవాదుల వాహ నం దాడిలో ఒకరుమృతిచెందగా పందొమ్మిది మంది గా యాల పాలయ్యారు. ఆతర్వాత 2011లో ఇజ్రాయిల్‌లో ఒక నైట్‌ క్లబ్‌ వద్ద కారు దొంగలించిన ఉగ్రవాది ఎని మిదిమందిని గాయపరిచాడు.

2014 ఆగస్టు నాలుగున జెరూసలాంలో ట్రాక్టర్‌తో బీభత్సం సృష్టించిన ఉగ్రవాది ఒకరిని చంపి మరో ఐదుగురిని గాయాలపాలుచేశాడు. అన్నిటికంటే ప్రధానంగా 2016లో ఫ్రాన్స్‌లోని నీస్‌లో ఒక భారీ ట్రక్క్‌తో ఉగ్రవాది బీభత్సం సృష్టించాడు. జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలను ట్రక్క్‌తో ఢీకొడుతూ నరమేధం సృష్టించాడు.ఆ సంఘట నలో ఎనభైఆరు మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోగా ఐదువందలమంది వరకు గాయపడ్డారు. బహు శా వాహనాలతో అమాయకులను బలి తీసుకోవడం ప్రా రంభించిన తర్వాత ఇదిఅతిపెద్ద సంఘటనగా పేర్కొన వచ్చు.ఒకరిద్దరు వాహనంలో వెళ్లి ఎంత మందిని చంప గలుగుతామో, మరెందరిని గాయపరుస్తామోనని లక్ష్యం గా చూస్తున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తాము ప్రవహింపచేస్తున్న రక్తపుటేర్లనుచూసివారు విజయగర్వం తో ఊగిసలాడుతుండవచ్చు. కానీ వారు సృష్టించిన బీభ త్సకాండకు సాధారణప్రజలు గగ్గురుపాటు చెందుతున్నా రు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏమి ఆశించి ఈ నరమేధానికి సంకల్పిస్తున్నారు? ఇందులో అన్నెంపున్నెం ఎరుగని అమాయక ప్రజలను ఎందుకు బలి తీసుకుం టున్నారో సామాన్యులకు అర్థంకాని విషయం. ఏ అవకా శం దొరికినా ప్రపంచంలో ఏ దేశంలోనైనా బీభత్సం సృష్టించడానికి వారువెనుకాడడం లేదు. ఉగ్రవాద కదలి కలను ఎప్పటికప్పుడు కనిపెట్టి విధ్వంసం చర్యలను నివారించడంలో నిఘా సంస్థలు విఫలమవ్ఞతున్నాయి.

ఉగ్రవాదం పోరుపై కలిసి రావాల్సిందిగా మన ప్రధాని నరేంద్రమోడీతోసహా వివిధదేశాల నేతలుఎప్పటి నుంచో పిలుపునిస్తున్నారు. సమావేశాలు, చర్చలు చేస్తున్నారు. ఆచరణకు వచ్చేసరికి అవి అంతగా కార్యరూపం దాల్చ డం లేదు. ఉగ్రవాద నిర్మూలనలో అందరు కలిసికట్టుగా కృషి చేయాల్సిన తరుణమిది.

Check Also

ఎన్నికలు వాయిదా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ 19 మహమ్మారి జిల్లాలో విస్తరిస్తున్న కారణంగా ఈ ...

Comment on the article