Daily Archives: June 17, 2017

వెంకన్న ఆలయంలో మహాఅన్నదానం

  బీర్కూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో శనివారం పలువురు దాతల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శనివారం వెంకటేశ్వరుని ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం దాతల విరాళాలతో మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలకు ఆలయ కమిటీ తరఫున సన్మానించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్‌ పే ఇచ్చి ప్రభుత్వం వేతనం పెంచడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కలాశాల దోమకొండలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల బృందం ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ నిర్వహించారు. అనంతరం అనాధాశ్రమానికి వెళ్లి పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం రూ. 37,100 బేసిక్‌పే ఇవ్వడం పట్ల ...

Read More »

వెంచర్లలో మొక్కలు నాటాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొక్కలు నాటాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో రియల్‌ ఎస్టేట్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంచర్లలో విరివిగా మొక్కలు నాటాలని నిర్దేశించిన స్థలంలో చట్టప్రకారం మొక్కలు నాటి వెంచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిటిపివో జలందర్‌, జిల్లా భూగర్భ శాఖాధికారి శ్రీనివాస్‌బాబు, డిపివో రాములు, తదితరులు ...

Read More »

అంగన్‌వాడి కేంద్రాల్లో అక్షరాభ్యాసం

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్‌ కాలనీ అంగన్‌వాడి కేంద్రంలో శనివారం పిల్లల చేత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సిడిపివో సంద్యారాణి పిల్లలచే అక్షరాభ్యాసం చేయించడంతోపాటు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి కేంద్రాల్లో అందించే పోషకాహారం, వాటి విలువలు, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు స్వర్ణలత, అరుణకుమారి, అంగన్‌వాడి టీచర్లు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సినారె సాహితీ సేవలు మరువలేనివి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సాహితీ లోకానికి చేసిన సేవలు మరువలేనివని కామారెడ్డి జిల్లా రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు నాగర్తి చందారెడ్డి అన్నారు. శనివారం డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సంతాపసభను ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ సినారె సినిమాల్లో అనేక పాటలు రాయడంతోపాటు సాహితీ లోకానికి అనేక సేవలందించారన్నారు. జ్ఞానపీఠ్‌, పద్మవిభూషణ్‌తో పాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారుడు ఎడ్ల రాజిరెడ్డి, ప్రతినిధులు రమేశ్‌రెడ్డి, ...

Read More »

పాఠశాలల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, వారికి చిత్తశుద్ది లేదని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలిమెల భానుప్రసాద్‌ విమర్శించారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సర్వే కార్యక్రమం నిర్వహించారు. పెద్దబజార్‌, జడ్పిహెచ్‌ఎస్‌ బాలికల, జెబిఎస్‌ పాఠశాలల్లో సర్వే చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో కనీసం తాగునీరు, బల్లాలు, తలుపులు సైతం లేవని, ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమన్నారు. ...

Read More »

గుర్తు తెలియని వృద్దుని శవం లభ్యం

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాచిగూడకు వెళుతున్న ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌లో గుర్తు తెలియని వృద్దుని శవం లభ్యమైనట్టు రైల్వే పోలీసులు తెలిపారు. 75-80 ఏళ్ల మధ్య వృద్దుని వయసు ఉంటుందని, అతని యాచకుడిగా భావిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం శవాన్ని ప్రబుత్వ ఆసుపత్రికి తరలించామని, ఎవరైనా గుర్తు పడితే రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Read More »

చెత్త బుట్టల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డు రాజీవ్‌నగర్‌ కాలనీలో శనివారం ఆర్డీఓ శ్రీనివాస్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ఆధ్వర్యంలో చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్తను బహిరంగంగా వేయకుండా చెత్తబుట్టలోనే వేసి వాటిని మునిసిపల్‌ చెత్తబండ్ల ద్వారా తరలించాలన్నారు. పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని సరంక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ యాదమ్మ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Read More »

మైనార్టీలకు ఇఫ్తార్‌ విందు

  బీర్కూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దుర్కి గ్రామంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు మల్యాద్రి మైనార్టీలకు శనివారం సాయంత్రం ఇఫ్తార్‌ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్‌మాసంలో ఉపవాసదీక్షలు కఠినంగా నిర్వహిస్తారని అన్నారు. రంజాన్‌ పవిత్ర మాసమని అన్నారు. విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కిషోర్‌ యాదవ్‌, మాజీ గ్రంథాలయ ఛైర్మన్‌ దివిటి శ్రీనివాస్‌ యాదవ్‌, యువజన కాంగ్రెస్‌ బాన్సువాడ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌, గ్రామ పెద్దలు ...

Read More »

అంగన్‌వాడిలో విద్యార్థులకు పౌష్టికాహారం

  బీర్కూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులను అంగన్‌వాడి కేంద్రాలకు పంపించడం ద్వారా వారికి పౌష్టికాహరం అందించడం జరుగుతుందని అంగన్‌వాడి సూపర్‌వైజర్‌ వాణి అన్నారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో చిన్నారులను అంగన్‌వాడిలో చేర్పించేందుకు ప్రధాన వీదుల గుండా అంగన్‌వాడి సౌకర్యాలను వివరిస్తు ర్యాలీ నిర్వహించారు. అంగన్‌వాడిలో చిన్నారులకు ప్రతిరోజు కోడిగుడ్లు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, అంగన్‌వాడిలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంపిటిసి మల్లేశ్‌, గ్రామ సర్పంచ్‌ అరిగె సాయిలు, అంగన్‌వాడి ...

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య

బీర్కూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్య అందించబడుతుందని బీర్కూర్‌ గ్రామ సర్పంచ్‌ దూలిగె నర్సయ్య అన్నారు. అధిక ఫీజులు చెల్లించి ప్రయివేటు పాఠశాలలో చదివించడం కన్న, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలో విద్యబోధన ఉత్తమంగా ఉంటుందని ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో భోజనం, ఉత్తమ విద్య, పుస్తకాలు, దుస్తులు అందించబడుతుందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు మొగ్గుచూపాలని ఆయనఅన్నారు. కార్యక్రమంలో ...

Read More »