Daily Archives: June 29, 2017

ముమ్మరంగా పారిశుద్యపనులు

  నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం వ్యాదులు ప్రబలకుండా బూర్గుల్‌ గ్రామంలో పారిశుద్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప పనులు పర్యవేక్షిస్తున్నారు. వర్షాకాలం మురికి కాలువల వల్ల వ్యాధులుప్రబలే ప్రమాదముందని, ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటిని కాచి వడబోసి వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ అనిత ఉన్నారు.

Read More »

కామారెడ్డిలో గంటపాటు భారీ వర్షం

  కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలో గురువారం సాయంత్రం నుంచి గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో రెండుగంటలకు పైగా విద్యుత్‌ను ట్రాన్స్‌కో అధికారులు నిలిపివేశారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన బతుకమ్మ కుంట, అయ్యప్పనగర్‌, గొల్లవాడ, విద్యానగర్‌ చౌరస్తాలో భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. ప్రధాన రహదారులైన సిరిసిల్లా రోడ్డు, నిజాంసాగర్‌ చౌరస్తాల్లో వర్షపునీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం ...

Read More »

నల్లవాగుకు జలకళ

  నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాసాగర్‌ మండలంలోని నర్సింగరావుపల్లి చౌరస్తా సమీపంలోగల నల్లవాగు ఆనకట్టుకు జలకళ సంతరిస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని కల్హేరు, మాసన్‌పల్లితోపాటు నల్లవాగు ప్రాంతంలో వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లవాగు కట్టలోకి నీరువచ్చి చేరింది. ఒకేసారి ఒక్కవర్షం కురిస్తే చాలు పొంగిపొర్లే విధంగా నిండుకుండలా మారింది. నల్లవాగులోకి నీరు రావడంతో ఆయకట్టు కింద ఉన్న అచ్చంపేట, బ్రహ్మణ్‌పల్లి, లింగంపల్లి, మాగి, గోర్గల్‌ గ్రామాలకు చెందిన రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. నల్లవాగు పొర్లితే పంటలు పుష్కలంగా ...

Read More »

ఇంటింటికి స్వచ్చమైన తాగునీరు అందిస్తాం

  నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డిఇ వెంకటస్వామి అన్నారు. మండల కేంద్రంలోని పెద్దఫూల్‌ వంతెన కింది భాగంలో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైప్‌లైన్‌ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొచ్చి స్వచ్చమైన నీటిని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట ఎ.ఇ. రాజశేఖర్‌, శివకుమార్‌, ...

Read More »

హరితహారంలో 65 వేల మొక్కలు

  నిజాంసాగర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర సిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం పథకం వేగవంతంగా కొనసాగుతుంది. నిజాంసాగర్‌ మండలంలోని మాగి, నర్వా, మగ్దుమ్‌పూర్‌ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలచే 65 వేల మొక్కలు నాటినట్టు ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటితే చక్కగా పెరుగుతాయని, హరితహారం విజయవంతం చేసేందుకు అందరు కృషి చేయాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని, ఇందుకోసం ప్రతి ఒక్క ...

Read More »

అటవీ భూమి కాపాడాలని గ్రామస్తుల ఆందోళన

  గాంధారి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్యాక్రాంతమై పోతున్న అటవీ భూమిని రక్షించాలని ఆందోళన చేసిన గ్రామస్తులపైనే అటవీశాఖ అధికారులు ఎదురుదాడికి దిగిన సంఘటన గాంధారి మండలం నాగ్లూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మండలంలోని నాగ్లూర్‌ గ్రామ శివారులో అటవీశాఖకు సంబంధించిన అటవీ భూమి కంపార్లుమెంటు 765లో వుంది. ఈ యేడు వర్సాకాలం ప్రారంభం కావడంతో ఇదే మండలానికి చెందిన నేరల్‌ తాండా గ్రామస్తులు అటవీ భూమిలో పంటలు వేసుకోవడానికి సిద్దమయ్యారు. గత వారం పదిరోజులుగా కంపార్టుమెంటు ...

Read More »

వృధాగా ఉన్న బోరుబావులను మూసివేయాలి

  గాంధారి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ భూముల్లో, గ్రామంలో వృధాగా ఉన్న బోరుబావులను మూసివేయాలని గాంధారి సర్పంచ్‌ సత్యం అన్నారు. గురువారం గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లోకి స్వయంగా వెళ్ళి వృధాగా వున్న బోరుబావులను పరిశీలించారు. వాటిని స్వయంగా రాళ్లతో పూడ్చివేశారు. వ్యవసాయ భూముల్లో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను జూలై 10వ తేదీలోపు యజమానులు పూడ్చివేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలో సైతం నిరుపయోగ బోరుబావులను వారంలో గుర్తిస్తామని, వాటిని కూడా పూడ్చివేయాలన్నారు. జూలై 10వ తేదీ తరువాత ...

Read More »

దుర్గంలో స్వచ్చభారత్‌

  గాంధారి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని దుర్గం గ్రామ పంచాయతీలో గురువారం గ్రామస్తులు స్వచ్చ భారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా యువకులు మాట్లాడుతూ గత సంవత్సరంలో వర్షం ద్వారా కొట్టుకొని వచ్చే మురికి నీరు ఇళ్ల ముందు, చిన్న చిన్న గుంతల్లో నిలువ అయి వాటి ద్వారా దోమలు, ఈగలు, క్రిమి కీటకాలు తయారై మురికి నీటి ద్వారా దుర్వాసన వస్తుందని తెలిపారు. గత వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు వీధుల్లో ఎలాంటి వర్షపు ...

Read More »