Breaking News

Monthly Archives: July 2017

కరపత్రాల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశు సంవర్ధకశాఖకు సంబంధించిన ఐదు రకాల కరపత్రాలను సోమవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ నిధులతో మేనేజ్‌మెంట్‌, వ్యాదులు, పశుగ్రాసానికి సంబంధించిన ఐదురకాల కరపత్రాలు రైతులకు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. పశు సంవర్దకశాఖాధికారులు రైతులకు వాటిని అందజేసి వివరించాలన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్‌డివో మోహన్‌రెడ్డి, సిపివో శ్రీనివాస్‌, పశు సంవర్ధకశాఖాధికారి రమేశ్‌కుమార్‌ తదితరులున్నారు.

Read More »

ఉపాధి కూలీల బ్యాంక్‌ అకౌంట్లను ఆధార్‌తో జతపరచాలి

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి కూలీల బ్యాంకు అకౌంట్లను ఆధార్‌తో జతపరచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో హరితహారంపై అధికారులతో సమీక్షించారు. ఇంతవరకు ఆధార్‌తో జతపరచని ఉపాధి కూలీల బ్యాంకు అకౌంట్లను నిలిపివేస్తామన్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్‌ 10 లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కూలీలకు సంబంధించి పేర్లు, జాబ్‌కార్డు, ఆధార్‌నెంబరు, బ్యాంకు అకౌంట్లను పొందుపరచాలన్నారు. అనుమతి పత్రాలను సంబంధిత గ్రామ క్షేత్ర సహాయకులకు ఇవ్వాలని పేర్కొన్నారు. వీటిని ...

Read More »

కాంగ్రెస్‌ నేతల అరెస్టు

  గాంధారి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛలో సిరిసిల్లాలో భాగంగా గాంధారి మండల కేంద్రంలో సోమవారం పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేశారు. సిరిసిల్లా జిల్లా నేరెళ్ల ఘటనలో దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఛలో సిరిసిల్లా కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కార్యక్రమం నిర్వహించి తీరుతామని ప్రకటించగా, అనుమతిలేదని పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు చేశారు. ఇందులో భాగంగా సిరిసిల్లాకు తరలిన గాంధారి మండల కాంగ్రెస్‌ నాయకులను మండల ...

Read More »

ఉద్యమ నాయకులపై కేసు కొట్టివేత

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2014లో సదాశివనగర్‌ జాతీయ రహదారిపై మంత్రి పోచారం వాహనాన్ని అడ్డుకున్న ఘటనలో ఉద్యమ నాయకులపై పెట్టిన కేసును కొట్టేస్తు సోమవారం కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అనంతరం బయటకు వచ్చిన 15 మంది ఉద్యమకారులు మాట్లాడుతూ బీడీ కార్మికుల పక్షాన నిలిచి వారికి జీవనభృతి కల్పించాలని అడిగేందుకు మంత్రి పోచారం వాహనం అడ్డుకొని, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయగా తమపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారన్నారు. కార్మికుల పక్షాన వాదించిన ...

Read More »

కామారెడ్డిలో ప్లాంటేషన్‌ డే

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సోమవారం తెలంగాణ హరితహరం కార్యక్రమంలో భాగంగా యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌ టూరిజం అండ్‌ కల్చర్‌ డిపార్టుమెంట్‌ ప్లాంటేషన్‌ డేగా నిర్వహించి మొక్కలు నాటి నీరుపోశారు. డైరెక్టర్‌ ఆఫ్‌ యూత్‌ సర్వీసెస్‌ ఆద్వర్యంలో రాష్ట్ర యువతను హరితహారంలో ప్రోత్సహించడంలో భాగంగా మొక్కలు నాటినట్టు జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి తెలిపారు. ప్లాంటేషన్‌ డేలో భాగంగా 150 మొక్కలు నాటినట్టు పేర్కొన్నారు. అనంతరం 200 మంది యువతతో ...

Read More »

ఘనంగా టిజివిపి ఆవిర్భావ దినోత్సవం

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం టిజివిపి 6వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగ సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టిజివిపి ప్రధానపాత్ర పోషించిందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్నట్టు తెలిపారు. ఆగష్టు 2 వరకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ నాయక్‌, ప్రతినిధులు రాజు, ఓంకార్‌, పృథ్వీ, ...

Read More »

ఛలో సిరిసిల్లాను అడ్డుకున్న పోలీసులు

  – కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు, విడుదల కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఛలో సిరిసిల్లా కార్యక్రమానికి తరలిన నాయకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. భిక్కనూరు, మాచారెడ్డి, కామరెడ్డి, సదాశివనగర్‌ జిల్లాలోని ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో ఉంచారు. అనంతరం వారిని సొంత పూచికత్తుతో విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర కమిటీ పిలుపు ...

Read More »

గజల్‌ గంధర్వుడు సినారె

  కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గజల్‌పై డాక్టర్‌ సి.నారాయణరెడ్డి చేసిన కృషి గొప్పదని, ఆయన గజల్‌ గంధర్వుడని ప్రముఖ గజల్‌ కవి సూరారం శంకర్‌ అన్నారు. శనివారం సాయంత్రం సినారె జన్మదినం సందర్బంగా కామారెడ్డి ఎస్‌ఆర్‌కె కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గజల్‌ గానలహరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఫారసీలో పుట్టి ఉర్దూలో విలసిల్లిన గజల్‌ను సినారె తెలుగులోకి తెచ్చి మహోన్నత స్తానాన్ని కల్పించారన్నారు. గజల్‌ అంటే ఇష్టమైన ...

Read More »

గ్రహాల మధ్యలోకి సూర్యుడెలా వచ్చాడు?

మన సౌర వ్యవస్థ చరిత్ర ప్రకారం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే దుమ్ము, ధూళితో కూడిన ఒక వృత్తాకార పదార్థం నుంచి గ్రహాలు ఏర్పడ్డాయి. అవి సూర్యుడు కేంద్రంగా దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సిద్ధాంతం సూర్యకుటుంబం ఎలా ఏర్పడింది అన్న ప్రశ్నకు సరైన నమూనా. ఈ సిద్ధాంతం ప్రకారం… నక్షత్రాల అంతర్భాగంగా ఉండే ఒక మేఘం లాంటి పదార్థం పతనమై, చదునవడంతో సూర్య కుటుంబం ఏర్పడింది. మొదట్లో ఆ మేఘం కాంతి సంవత్సరాల మేర వ్యాపించి ఉండేది. సూర్యుని కంటే పది మిలియన్‌ ...

Read More »

9వ వార్డులో హరితహారం

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో శనివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ, వార్డు కౌన్సిలర్‌ సంగి మోహన్‌లు వార్డులో మొక్కలునాటి నీరుపోశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో అందరు ప్రోత్సహించాలని సూచించారు.

Read More »

కామారెడ్డి జిల్లా సమగ్ర అబివృద్దిపై చర్చాగోష్టి

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం కామారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దిపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చర్చాగోష్టి నిర్వహించారు. దీనికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ హాజరై మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వి.ఎల్‌.నర్సింహారెడ్డి అద్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో వక్తలు మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల పథకంలోని 22వ ప్యాకేజీని అమలు చేయాలని, కామారెడ్డిలో యూనివర్సిటీ నెలకొల్పాలని, సిరిసిల్లా నుంచి బీదర్‌కు రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. మేడ్చల్‌- ...

Read More »

జిల్లాకు మూడు స్మృతివనాలు మంజూరు

  కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు రెండు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలకు మొత్తం మూడు స్మృతివనాలు, రాశి వనాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. స్మృతివనాలు, రాశివనాల ఏర్పాటు గురించి శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. వీటితోపాటు నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెదలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు చేసినట్టు తెలిపారు. జిల్లా ప్రజలు తమ ఆత్మీయ స్మృతులను గుర్తుచేసుకునేవిధంగా వారి పేరుమీద స్మృతి వనంలో మొక్కలు నాటేందుకు అవకాశం ...

Read More »

ఖతార్‌ సంక్షోభానికి మోక్షం ఏదీ?

Qatar issue గల్ఫ్‌ మండలిలోని అతిచిన్న దేశమైన ఖతార్‌పై ఇతర అరబ్‌దేశాలు విధించిన ఆంక్షలతో ఇతర దేశీయులకు ముఖ్యంగా భారతీయులకు పాట్లు ఎక్కువయ్యాయి. అక్కడి వీసాలపై పనిచేసేందు కువచ్చినవారికి ఇతర గల్ఫ్‌దేశాల్లో పనులు ఉపాధి లభిం చడంలేదు. ఆర్ధికపరంగా ఆంక్షలు విధిస్తూ ఖతార్‌ను ఏ కాకినిచేసే విధంగా గల్ఫ్‌దేశాలు ఒక్కటయ్యాయి. విమా నాలు రద్దయ్యాయి. మరికొన్నింటికి రూట్లు మార్చివేసా రు. ఖతార్‌ పౌరులపై ఇతర గల్ఫ్‌దేశాల్లో బహిష్కరణ వేటు విధించారు.ఇదంతా ఎందుకు ఉగ్రవాదానికి ప్రత్యే కించి ఐసిస్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలకు ఖతార్‌ మద్దతు ...

Read More »

మోడ్రన్‌ డస్స్రులు ఇష్టం లేదు

తెలుగులో తన తొలి సినిమా ‘ఫిదాతో హీరోయిన్‌ సాయిపల్లవి జనాలను బాగానే పడేసింది.. తెలంగాణలో అంటే ఆమె తెలంగాణ యాసకు పడిపోయారని అనుకోవచ్చు.. కానీ తెలుగు రాష్ట్రాలోని మిగతా ప్రాంతాల్లో కూడ ఈమె హావభావాలకూ బాగానే అభిమానులు ఏర్పడ్డారు.. కకపోతే అమ్మడు ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాల దర్శకులకు ఒక షాకిచ్చింది. అసలు సాయి పల్లవికి గ్లామరస్‌ అనే పదమే నచ్చదట.. ఆమె కొనుకున్న డిక్షనరీలో ఆ పదం లేదని తేల్చేసింది.. కాకపోతే ఫిదా చిత్రంలో అమ్మడు అమెరికాలో జరిగే ఒక సీన్‌ ...

Read More »

మగాళ్లకు ఊరట వరకట్నం, గృహహింస కేసుల్లో.. నిజముంటేనే అరెస్టులు!

498-ఎ దుర్వినియోగం ఆపాలి ఆరోపణల్లో అసత్యాలే ఎక్కువ నిర్దోషుల హక్కులను కాపాడాలి కమిటీ నివేదిక ఇచ్చాకే చర్యలు బెయిల్‌పై వెంటనే నిర్ణయించాలి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు  ‘నన్ను కట్నం కోసం వేధిస్తున్నారు’ అని మహిళ ఫిర్యాదు చేయగానే ముందూ వెనుకా చూడకుండా భర్త, అత్త, మామ, ఆడబిడ్డలను అరెస్టు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులో ప్రస్తావించిన అంశాల్లో నిజాలను ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాతే అరెస్టు చేయాలని స్పష్టం చేసింది. దీనికోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గృహ హింస ...

Read More »

ట్యూషన్‌కు వచ్చిన అమ్మాయిపై ఉపాధ్యాయుడి అత్యాచారం

ఉత్తరకాశీ : అమ్మాయిలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు. ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో జరిగింది. ఉత్తరకాశీ జిల్లా మోరీ బ్లాకులో చీవా ఉన్నత పాఠశాలలో లలిత్ కుమార్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. లలిత్ కుమార్ తన ఇంటి వద్ద పాఠశాల విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు. రోజూ లాగే ట్యూషన్ కు వచ్చిన విద్యార్థుల్లో 14 బాలిక మినహా మిగతావారందరినీ ఇళ్లకు పంపించాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం ...

Read More »

ఎన్టీయార్‌ నిజంగానే ‘బిగ్‌బాస్‌’!

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ బుల్లితెర మీద ఆ స్థాయిలోనే విజయవంతమైంది. వెండితెర మీద వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న ఎన్టీయార్‌ బుల్లితెర మీద కూడా సత్తా చాటాడు. ‘బిగ్‌బాస్‌’ షోకు తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత హయ్యస్ట్‌ టీఆర్పీ రేటింగ్‌ను అందించాడు ఎన్టీయార్‌. ఈ దెబ్బకు గత వారానికిగానూ ‘బిగ్‌బాస్‌’ నెంబర్‌ వన్‌ రియాలిటీ షోగా, సదరు ఛానెల్‌ నెంబర్‌ వన్‌ ఎంటర్‌టైన్‌ ఛానల్‌గా నిలిచాయి. గత ఆదివారం ఎన్టీయార్‌ హోస్ట్‌ చేసిన ‘బిగ్‌బాస్‌’ షోకు ఏకంగా 16.8 టీఆర్పీ ...

Read More »

శునకం చూపించిన బాక్సు తెరవగానే….

ఏథెన్స్: శున‌కాలు నమ్మకానికి ప్రతిరూపాలు. య‌జ‌మానుల ఆస్తిపాస్తుల‌ను కాపాడ‌టంలో శున‌కాలు కీల‌క‌పాత్ర వ‌హించిన ఉదంతాలు వింటుంటాం. తాజాగా ఇటువంటి ఆస‌క్తిక‌ర‌ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రీక్‌లో అరాగాన్ అనే శున‌కం త‌న య‌జ‌మానితో పాటు మార్నింగ్‌వాక్‌కు వ‌చ్చింది. ఉన్నట్టుండి అది విచిత్రంగా ప్రవర్తించ‌డం ప్రారంభించింది. త‌న య‌జ‌మానిని లాగుతూ రోడ్డు ప‌క్కనున్న ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడ ఒక బాక్పు ఉంది. దానిని తెరిచిన శున‌కం య‌జ‌మాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వివ‌రాల్లోకి వెళితే రోజూ మాదిరిగానే ఆరాగన్ త‌న య‌జ‌మానితో పాటు ఆరోజు మార్నింగ్‌వాక్‌కు వెళ్లింది. కొద్ది దూరం ...

Read More »

కొవ్వును తగ్గించే రెసిపీలు

 పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. పెరిగిపోయిన ఫ్యాట్‌ వల్ల జీవక్రియ సరిగా జరగదు.  అందుకే నిత్యం డైట్‌, వ్యాయామాలు చేయడంతోపాటు వంటింట్లో లభించే కొన్ని ఆహారపదార్థాలను రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేస్తే పొట్ట చుట్టూ, నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. నిమ్మరసం: పొద్దున్నే లేచిన వెంటనే పళ్లు తోముకుని గ్లాసుడు నిమ్మరసం తాగాలి. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో నిమ్మరసం ఉత్తమం. కాలేయంలోని విషపదార్థాలను తొలగించడంలో ఇది బాగా పనిచేస్తుంది. జీర్ణక్రియ సరిగా జరిగేట్టు సహాయపడుతుంది. అందుకే ...

Read More »

దుబాయి రాజు సంచలన నిర్ణయం.. వెబ్‌సైట్ బ్యాన్..!

యూఏఈ: ఖతార్‌పై సౌదీ సహా ముస్లిం దేశాలు కత్తిగట్టిన తర్వాత.. ఆయా దేశాల మధ్య సంబంధాలు మరింతగా చెడిపోతున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు ముస్లిం దేశాలు.. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న కారణంతో ఖతార్‌పై నిషేధం విధించాయి. అంతే కాకుండా పాలు సరఫరా చేయకపోవడం వంటి పలు ఆంక్షలను కూడా మొదట్లో పెట్టాయి. అయితే ఆయా దేశాల మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉండటంతో.. సమస్యను మరింత జఠిలం చేసే కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ఖతార్‌కు చెందిన ‘అల్ జజీరా’(Al-Jazeera) ...

Read More »