Breaking News

ఐటి రంగానికి శ్వేతసౌధం భేటీ నిరాశ!

భారత్‌ అమెరికాలమధ్య అడ్డుగోడగా నిలిచిన వీసా ఆంక్షల ప్రభావం ప్రధానిమోడీ అమెరికా పర్యటనతో స్పష్టత వస్తుందని భావించిన భారత్‌ ఐటి రంగానికి సందిగ్ధత ఇంకా వీడలేదు. వాణిజ్యం, పెట్టుబ డులే ప్రధానాంశాలుగా నడిచిన శ్వేతసౌధం భేటీలో డొనాల్డ్‌ ట్రంప్‌ మరింతగా ఆర్ధికలోటును తగ్గించాలన్న సూచనలు మాత్రం అందాయి.నవీన భారతావనికి మోడీ కృషి చేస్తున్నట్లుగానే మరింత గొప్పదేశంగా అమెరికాను తీర్చిదిద్దేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ చేస్తు న్న కృషి ఎల్లలు లేనిదన్న మోడీ పొగడ్తలకే పరిమితం అయిందన్న విశ్లేషణలు వచ్చాయి.న్యూయార్క్‌ జర్నల్‌లో మోడీ సంపాదకీయం కూడా ఆ దిశగానే సాగింది.

ఉగ్ర వాదంపై ఉమ్మడిపోరు అన్న అజెండాతో భారత్‌ప్రపంచ దేశాల్లో ఎక్కడకు వెళ్లినా ఇదే నినాదంతో ఉంది. అందు కు అమెరికా కూడా సంపూర్ణమద్దతును ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో వెల్లువెత్తిన వీసాఆంక్షలు, అమెరికా వలసవిధానంలో చేపట్టిన సంక్లి ష్ట మార్పులు చేర్పులు,సవరణలు వంటివి భారత్‌కు గుదిబండగా మారాయని ప్రత్యేకించి ప్రస్తావించనవస రంలేదు. భారత ప్రధాని నరేంద్రమోడీ తన పర్యటనలో అమెరికా అధ్యక్షుని వద్ద వీసా ఆంక్షలు, ఐటి రంగానికి ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించి విరుగుడు సాధిస్తారనే అందరూ ఆశించారు. ఊహించారు కూడా. అయితే భేటీలో ఈ అంశం కేవలం సాంకేతికపరిజ్ఞానం అంశాల ప్రస్తావన అన్న ముసుగులో మొత్తం కొట్టుకుని పోయింది.మొత్తంమీద రక్షణవాణిజ్యరంగాల్లో పెట్టుబడు లపై చర్చలు మాత్రం సఫలం అయ్యాయి.

వాణిజ్యం పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం,కొత్త ఆవిష్కరణలు, ఆర్ధిక అంశాలు కీలకంగా ఉన్నప్పటికీ ఐటిరంగం ఎదు ర్కొంటున్న పెనుసవాళ్లపై ఎలాంటిచర్చలు జరిగాయన్న అంశంపై స్పష్టత రాలేదు. భారత్‌ అమెరికా సంబంధాల్లో భద్రత, రక్షణ సం బంధిత అంశాలే కీలకమైనవని వాటిపై విస్తృతంగా చర్చ లు జరిగాయని ఇరుదేశాల అధిపతులు సంయుక్త మీడి యా సమావేశంలో సైతం వెల్లడించారు.వాణిజ్య, దౌత్య బంధాలు పటిష్టంగానే ఉన్నా ఐటిరంగంపై కొనసాగుతు న్న అనిశ్చితికి ముగింపు ఎప్పుడన్న సందేహాలతో భారత్‌ ఐటి రంగం కొట్టుమిట్టాడుతోంది. బిలియన్లకొద్దీ డాలర్ల పెట్టుబడులకు అవకాశం ఉన్న భారత్‌పై ట్రంప్‌ వైఖరి స్పష్టత రావాలని భారత్‌ కార్పొరేట్‌రంగం ఎదురు చూస్తోంది.

వాణిజ్యరంగం నుంచే వచ్చిన కొత్త అధ్యక్షు డు ట్రంప్‌కుపెట్టుబడులు,వాణిజ్యరంగాలు కొట్టిన పిండి వంటివని అమెరికా భారత్‌ వాణిజ్యబంధాలను మరింత పెంపొందించుకునేందుకు ఇవి ఎంతో ఉపకరిస్తాయని భావించవచ్చు. అమెరికా నుంచి భారత్‌కు ఎగుమతులు మరింతపెంచాలని ట్రంప్‌ ప్రస్తావించినట్లు సమాచారం. భారత్‌తో అమెరికా వాణిజ్య ఎగుమతులలోటు 31 బిలి యన్‌ డాలర్లుగా ఉందని అంచనా.అయితే భారత్‌పరం గా భారీ ఆర్డర్లుజారీచేసింది.మొత్తం 22బిలియన్‌ డాలర్ల విలువైన కొత్త 100బోయింగ్‌ అమెరికా విమానాలు భార త్‌కువస్తాయి.గత అధ్యక్షుడు బరాక్‌ఒబామా హయాంలో కొనసాగిన మైత్రీబంధాన్ని మరింత పటిష్టంచేసుకునే దిశగానే ఇరువురు అధినేతల శ్వేతసౌధం చర్చలు సాగా యన్నది అంచనా.అయితే ట్రంప్‌మాత్రం తన ప్రసంగం లో ఎక్కడా వలస విధానంపైనా, పారిస్‌లోని పర్యా వరణ ఒప్పందంపైనా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడ మే ఈ అస్పష్టతకు దారితీసిందన్నది నిర్వివాదాంశం.

అమెరికా అంతర్గత మంత్రిత్వశాఖ పరంగా బోయింగ్‌ సి-17 రవాణా విమానాలను 366మిలియన్‌ డాలర్లకు సరఫరాచేసేందుకు నిర్ణయించింది. అలాగే ప్రిడేటర్‌ డ్రోన్‌,రక్షణరంగంలోని జనరల్‌ ఆటమిక్స్‌ ఏరో నాటికల్‌ సిస్టమ్స్‌ వంటి వాటిపై మొత్తం 2బిలియన్‌ డాలర్ల ఒప్పందాలనుసాధించుకోగలిగారు.2008 నుంచి రక్షణరంగపరంగా భారత్‌ 15 బిలియన్‌ డాలర్లకు పైబ డిన ఒప్పందాలు చేసుకుంది. పండ్ల దిగుమతులపైనా, ఫార్మా రంగంపైనా ఇటీవలే అమెరికా ఆంక్షలు పెరుగు తుండటాన్ని భారత్‌ అధికారులు శ్వేతసౌధంలో ప్రస్తా వించారు.భారత్‌లో సైతం అపార పెట్టుబడులకు అవకా శాలున్నాయని, ఏవియేషన్‌ రంగంలో మంచి సానుకూ లత ఉందని అంచనా.22 బిలియన్‌ డాలర్లతో స్పైస్‌జెట్‌ 205 విమానాలను బోయింగ్‌నుంచి కొనుగోలుకు ఒప్పం దంచేసుకోవడం కూడా భారత్‌ అమెరికా వాణిజ్య బంధా ల పటిష్టతకు నిదర్శనంగా చెపుతున్నారు.

అలాగే బోయింగ్‌ కూడా భారత్‌కు 2036 నాటికి 265 బిలి యన్‌ డాలర్ల విలువైన 1850 కొత్త విమానాలు అవస రం అవుతాయని అంచనా వేసింది. ఏటికేడాది వృద్థి పథంలో ఉన్న భారత్‌ వైమానికరంగానికి ముఖ్యంగా బోయింగ్‌ విమానాలు కీలకంగా మారుతున్నాయి. ఏ సంస్థ చూసినా భారత్‌లో బోయింగ్‌ లేనిదే విమాన సర్వీసులు లేవన్నది సుస్పష్టం. వాణిజ్య,రక్షణ రంగాల ఒప్పందాల పరంగా స్పష్టత వచ్చినా ఐటిరంగపరంగా మోడీ పర్యటన స్పష్టత ఇవ్వ లేదన్నది నిర్వివాదాంశం. భారత్‌ ఐటిరంగం ఆశించిన స్పందన మోడీ అమెరికా పర్యటనలో డొనాల్డ్‌ట్రంప్‌ పాల నాయంత్రాంగంనుంచి సాధించలేకపోయిందన్న విశ్లేషణలపట్ల ఆశ్చర్యపడా ల్సిందేమీలేదు. జరిగింది కూడా అదేనని తెలుస్తోంది.

ఒక్క రెండు తెలుగురాష్ట్రాలనుంచే అమెరికాలో పదిలక్షల మందికిపైగా నివసిస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్య అభ్యసిస్తూ అక్కడే పార్ట్‌టైమ్‌ ఉపాధిపొందుతూ గడుపు తున్నారు. ట్రంప్‌ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రవేశపెట్టిన ఆంక్షలు సర్వత్రా గుదిబండలుగా మారాయి. తాజాగా మొట్టమొదటిసారి జరిపిన మోడీ పర్యటన ఇదే విషయమై స్పష్టత ఇస్తుందని భావించిన ఐటి రంగానికి నిరాశే ఎదురయింది.

Check Also

ఇస్లామిక్‌ స్టేట్‌ ‘ఉగ్ర’మూలాలు కదులుతున్నాయా?

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ సిరియా అండ్‌ ఇరాక్‌(ఐసిస్‌) మూ లాలు కదులుతున్నాయా? ప్రత్యేకించి ఇరాక్‌ నిర్వహిస్తున్న ...

Comment on the article