Breaking News

ఆమె గర్భం దాల్చడానికి తనకు సంబంధం లేదంటున్న భర్త

దుబాయ్: భార్య గర్భం దాల్చింది. అంతకు ముందే భర్త కనిపించకుండాపోయాడు. ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. ఒక వైపు డెలివరీ టైమ్ దగ్గరపడుతోంది. మరోవైపు డెలివరీకి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆ మహిళ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపిచడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇదేదో నయనతార నటించిన అనామిక సినిమాలోగే జరిగింది. అయితే ఇక్కడో ట్వీస్టు కూడా ఉంది. అదెంటంటే పెళ్లైన రెండు నెలలకే ఆమె భర్త కనిపించకుండాపోయాడు. తరువాత ఆమె గర్భం దాల్చింది. మళ్లీ అతడు, ఆమె డెలివరీ సమయానికి నెల ముందు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు.

ఆమె గర్భానికి తాను కారణం కాదంటున్నాడు. ఆమె అంతకుముందే వేరే వ్యక్తితో  కలిసుందని కేవలం రెండు నెలల వ్యవధిలోనే గర్భం దాల్చడం ఏమిటని అందుకు కారణం తాను కాదని వాదించాడు. దాంతో  ఫాతీమాఅల్‌కైందీ, అనే సామాజిక కార్యకర్త సహయంతో భార్య మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేసింది. పోలీసులు కూడా ఆమె సమస్యను పట్టించుకోలేదు. తమకు దాంతో సంబంధం లేదని కరాకండిగా చెప్పేశారు. మానవహక్కుల సంఘం మాత్రం భార్య డెలివరీ ఖర్చులు భర్త భరించాల్సిందేనని తీర్పు చెప్పింది. ఏమైన సమస్యలుంటే ఆమె డెలివరీ తర్వాత పరిష్కరిస్తామని తెలిపింది. అయితే భర్త మాత్రం ఆమెతో జీవితం కొనసాగించలేనని చెబుతున్నాడు. తనకు విడాకులు ఇప్పించమని కోరుతున్నాడు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article