Breaking News

గ్రామాల్లో 40 వేల మొక్కలు నాటించాలి

 

నిజాంసాగర్‌, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం పథకం కింద ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 40వేల మొక్కలకు తగ్గకుండా నాటించాలని ఎంపిడివో రాములు నాయక్‌ ఇజిఎస్‌ అదికారులను ఆదేశించారు. ఎంపిడివో కార్యాలయంలో బుధవారం ఇజిఎస్‌ అధికారులతో సమావేశం అనంతరం మాట్లాడారు. తెలంగాణ హరితహారం పథకంకింద 6 లక్షల 80 వేల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నామని, లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు అదికారులు ప్రత్యేకచొరవ తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 3 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరు బాగస్వాములై మొక్కలునాటేందుకు కృసి చేయాలన్నారు. సమావేశంలో ఇజిఎస్‌ ఎపివో సుదర్శన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ జయశ్రీ, ప్రభాకర్‌, బాల్‌సింగ్‌ ఉన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article