Breaking News

తగ్గుతున్న నల్లకుబేరుల స్విస్‌ సంపద!

సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోప్రత్యేక పర్యవేక్షణ ఫలితమోలేక సుప్రీం ఉత్తర్వులను అనుసరిం చి సిట్‌ ఏర్పాటుచేయడంద్వారా నల్లధనంపై అలుపెర గని పోరువల్లనైతేనేమి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటు న్న నల్లధనం నిల్వలు తగ్గుతున్నాయనే చెప్పాలి. భార తీయులు స్విస్‌బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము గత ఏడా దితో పోలిస్తే భారీగా తగ్గిందని స్వయంగా స్విస్‌ నేష నల్‌ బ్యాంకు వెల్లడించింది.

కొందరు పన్నుల ఎగవేత ద్వారా రూటుమార్చి బ్యాంకుల్లో భద్రపరుచుకుంటుంటే మరికొందరు గుప్తధనంపై లెక్కలు చెప్పడం, ఆపై పన్ను లభారంతో సతమతం కాలేక అక్రమమార్గాల్లో ఇతర విదేశీ బ్యాంకులకు మళ్లిస్తున్నారు. ఇప్పటివరకూ స్విస్‌ బ్యాంకుల్లో దాచుకున్న కస్టమర్ల వివరాలను వెల్లడించేం దుకు అక్కడి ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోవు. దీనితో నల్లకుబేరులకు స్విస్‌బ్యాంకులు స్వర్గధామాలుగా భాసి ల్లాయి. అయితే భారత్‌లాంటిమరో 40 దేశాలతో పన్ను సమాచార మార్పిడి ఒప్పందం జరగడంతో2019 నుంచి తమ దేశంలోని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న కస్ట మర్ల వివరాలు 2019 నుంచి విడుదలచేస్తామని, కోరిన దేశాలకు నివేదికల రూపంలో ఇస్తామని స్విస్‌ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. దశాబ్దకాలంగా సాగిన ఈ సంప్రదింపులు ఎట్టకేలకు సత్ఫలితాలిచ్చాయి.

భారత్‌లోని స్టాక్‌ మార్కెట్లకు నల్లధనం వస్తున్నదన్న పటిష్టమైన సమాచారంతో సిట్‌ స్టాక్‌ ఎక్చేంజిల పర్యవే క్షణసంస్థ సెబీని కూడా అప్రమత్తంచేసింది. అవసరమైతే ఈ వ్యవహారాన్ని కట్టడిచేసేందుకు సెబీ,రిజర్వుబ్యాంకు, వివిధ కేంద్ర దర్యాప్తు సంస్తల సహకారం తీసుకోవాలని ఆదేశించిందికూడా.దీనితో భారత్‌లో ఇకనల్లధన స్వాము ల ఆటలు కట్టడి అవుతుండటంతో ఈ ధనం మొత్తం విదేశాలకు స్వేఛ్ఛగా వెళ్లిపోతోంది. భారత్‌లోని విదేశీ బ్యాంకు శాఖలద్వారా మళ్లిస్తారు. తదనంతరం అవసర మైతే ఫండ్‌,డెట్‌ పెట్టుబడులరూపంలో మళ్లీ మార్కె ట్లకువచ్చి నల్లధనాన్ని వైట్‌గా మార్చుకుంటున్న వైనాన్ని బట్టబయలుచేయడంతో ఇక నల్లధన స్వాములు సాధ్య మైనంతగా పన్నులు చెల్లించి చట్టబద్ధం చేసుకోవడమే మేలని భావిస్తున్నారో ఏమో కానీ విదేశీ బ్యాంకుల్లోని గుప్తనిధులను కూడా తగ్గించుకుంటున్నట్లు స్విస్‌బ్యాంకు తాజాగా వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మొత్తం అందరు విదేశీ క్లయింట్లు స్విస్‌బ్యాంకుల్లో దాచు కున్న సొమ్ము భారతీయ కరెన్సీలో 96 లక్షలకోట్లకు చేరింది గతంలో ఎన్నడూ ఇంత భారీ ఎత్తున భారతీయ కస్టమర్ల డిపాజిట్లు దిగజారలేదని స్విస్‌ నిపుణులే చెపు తున్నారు.కస్టమర్‌ డిపాజిట్ల రూపంలో 377 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లవరకూ తగ్గాయి. 98 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లు భారతీయులు ఇతరబ్యాంకుల్లో భద్రపరుచుకు న్నారు. మరో 190 మిలియన్‌ స్విస్‌ఫ్రాంక్‌ల రూపంలో పలురకాల స్కీంలలో భద్రపరుచుకున్నట్లు అంచనా.

వివిధ కేటగిరీలవారీగా కూడా కొంత దిగజారినట్లు స్విస్‌ నేనల్‌ బ్యాంకు వెల్లడించింది.వరుసగామూడో సంవత్స రంకూడా నిల్వలు దిగజారాయి.అప్పటినుంచి చట్టపరమై న కఠినఆంక్షల కారణంగా తగ్గుతూవచ్చాయి. స్విస్‌బ్యాం కుల్లో భారతీయుల నిధులు 2006 చివరినాటికి 6.5 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంకులుగా ఉన్నాయి. భారతీయ కరె న్సీలో 23వేల కోట్లుగా ఉంటుందని అంచనా. అయితే ఇపుడు పదోవంతు స్థాయికి పడిపోయిందని నిపుణుల అంచనా.2011,2013 సంవత్సరాల్లో మినహా భారతీ యుల స్విస్‌ నిధులు క్షీణిస్తున్నాయి.జ్యూరిచ్‌ కేంద్రంగా ఉన్న స్విస్‌నేషనల్‌బ్యాంకు ఇటీవలే భారత్‌,స్విట్జర్లాండ్‌ దేశాల మధ్య ఆర్ధిక సమాచారం పరస్పరం మార్పిడి చేసుకునేందుకు జరిగిన ఒప్పందంతో గణాంకాలను తర చూ ఇస్తోంది. దీనివల్ల నల్లధనం అరాచకాన్ని సాధ్యమై నంతగా తగ్గించవచ్చని భారత్‌ భావిస్తోంది.

స్విట్జర్లాండ్‌ ఇప్పటికే తన విదేశీ క్లయింట్లవివరాలను భారత్‌తోపాటు మరికొన్ని దేశాలతో పంచుకుంటున్నది. భారత్‌లో జరుగుతున్న నల్లధన కట్టడికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా స్విట్జర్లాండ్‌వెల్లడించింది. భారత్‌ స్విస్‌ప్రభుత్వం అధికారులమధ్య అనేక విడ తలుగా చర్చలు జరిగాయి. పెండింగ్‌లో ఉన్న సమాచా రం వెంటనే అందించాలని వీటిలో కొన్ని అక్రమాస్తులు భద్రపరుచుకున్నట్లు భారత్‌ స్విస్‌బ్యాంకులకు తన సందే హాలను వెల్లడించింది.ఎన్‌ఆర్‌ఐలు లేదా ఇతరులు స్విస్‌ బ్యాంకుల్లో దాచుకున్న వివరాలు వారి పేర్లు, సంస్థల పేర్లు, వివిధ దేశాల పేర్లను వెల్లడించాల్సి ఉంటుంది. ఇతర గ్లోబల్‌ ఆర్ధిక హబ్‌లు సింగపూర్‌, హాంకాంగ్‌ల తరహాలో కాకపోయినానల్లధనం కట్టడికి భారత్‌అనుసరి స్తున్న కార్యాచరణ కారణంగా ఇటీవలికాలంలో స్విస్‌ బ్యాంకుల డిపాజిట్లు తగ్గాయనేభావించాలి.

సుప్రీం కోర్టు మార్గదర్శకాలమేరకు ప్రభుత్వం సిట్‌ను నియమించి నల్లధనం కేసుల విచారణచేయాలని ఆదేశించింది. స్విట్జ ర్లాండ్‌ వంటి స్వర్గధామంగా ఉన్న దేశాల్లో భారతీయుల నిధుల వివరాలను సేకరించి చర్యలు తీసుకోవాలని సుప్రీం కేంద్రం, సిట్‌లను ఆదేశించింది. దేశీయంగాను, విదేశాల్లో భద్రపరుచుకుంటున్ననల్లధనం కట్టడికి కేంద్రం ఇటీవలే కొన్ని చర్యలు చేపట్టింది. ఆదాయపు పన్నుశాఖ రూ.13వేల కోట్ల నల్లధనాన్ని వెలుగులోనికి తెచ్చింది. కొన్ని వందల సంస్థలపై దర్యాప్తులు కూడా ప్రారంభిం చింది. వీటిలో కొన్ని ఖాతాలు హెచ్‌ఎస్‌బిసి జెనీవాశాఖ లో ఉన్నాయి.అలాగే పన్ను యంత్రాంగం లెక్కలుతేలని గుప్త ధనం 8186 కోట్లను వెలికితీసింది.

హెచ్‌ఎస్‌బిసి జాబితాలో ఉన్న వారి ఖాతాల్లో కొంతమొత్తం ఉన్నట్లు తేలింది. 2011లో ఫ్రెంచ్‌ప్రభుత్వం ద్వారా సేకరించిన జాబితాను బట్టి భారత్‌ ఈ లెక్కలు తేల్చింది. మొత్తం 628 కేసుల్లో శాఖాపరంగా చర్యలు తీసుకుని ఆధారా లున్నవి 415 కేసులున్నట్లు తేల్చినా మరింత కఠిన కార్యాచరణ అవలంభిస్తే తప్ప నల్లధనం మూలాలను వెలికి తీయలేమన్నది సుస్పష్టం. కొంతలో కొంత ఇటీ వలి సిట్‌ చర్యలవల్లనే స్విస్‌ నిధుల్లో క్షీణత కనిపి స్తోందని చెప్పకపత్పదు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article