Breaking News

కొత్తగా దుబాయ్ వెళ్తున్నారా.. ఈ విషయం తెలుసుకోండి

దుబాయ్: ఎంతో మంది కొత్తగా దుబాయ్ వెళ్తుంటారు. వారికి దుబాయ్ ప్రభుత్వం ఒక సూచన చేస్తోంది. ప్రభుత్వ అధికార ప్రతినిధి సామిఅల్ షామి ఈ సూచన చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చెబుతున్నరంటే, కొత్తగా దుబాయ్ వచ్చే వారు పాస్‌పోర్టులు ఎవ్వరికీ ఇవ్వదొద్దని చెబుతున్నారు. అమాయకులను కొంత మంది దుబాయ్ ఎయిర్‌పోర్టులో మోసం చేస్తున్నారని ఆయన చెప్పారు. కొంతమంది కొత్తగా దుబాయ్ వచ్చేవారిని టార్గెట్ చేసుకుని వారి దగ్గరనుంచి పాస్‌పోర్టులు, డబ్బులు లాక్కుంటున్నారని అడిగితే తాము అధికారులం అంటూ వారిని నమ్మించే బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు.

పోలీసులు వారి మీద నిఘా పెట్టిన ఎక్కడోచోట ఇలాంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయని ఆయన అంటున్నారు. ప్రజలే తమకు తాము తెలుసుకోవాలని చెప్పారు. అన్నీ దేశాల ఎంబసీల ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చేవారిని మోసం చేస్తూ వారి డబ్బులు దొంగిలించడం నిజంగా హేయమైన చర్య అని ఆయన అన్నారు. అలాంటివారిలో దుబాయ్ పౌరులు ఎవ్వరూ లేరని, విదేశీయులే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article