Breaking News

Daily Archives: July 6, 2017

గ్రామ సమస్యలు పరిష్కరిస్తాం

  బీర్కూర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని గ్రామ సర్పంచ్‌ దూలిగె నర్సయ్య అన్నారు. మండల కేంద్రంలోగురువారం అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో బీర్కూర్‌ గ్రామంలో సోషల్‌ వెల్పేర్‌ బాలుర వసతి గృహాన్ని, 50 డబుల్‌ బెడ్‌రూం ఇల్లను మంజూరు చేయించుకున్నామని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా బీర్కూర్‌ గ్రామంలో త్వరలోఇంటింటికి ప్యూరిఫైడ్‌ నీటిని అందజేయనున్నామని తెలిపారు. ...

Read More »

8న ఉచిత వైద్య శిబిరం

  కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీబాలాజీ స్కిన్‌ ఆసుపత్రిలో ఈనెల 8న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆసుపత్రి ప్రారంభించి పదిసంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. దీంతోపాటు కేవలం వందరూపాయల ఫీజుతో ఫోటోథెరఫి, డెర్మాస్కోప్‌ ద్వారా రోగులకు ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని రోగులు వినియోగించుకోవాలని కోరారు.

Read More »

డిగ్రీకళాశాల సాదన దీక్షకు మద్దతు

  కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని దోమకొండ ప్రజలు చేస్తున్న నిరవధికదీక్షకు ఏఐఎస్‌ఎప్‌నాయకులు తమ మద్దతు తెలిపారు. గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీబావం తెలిపారు. దోమకొండ విద్యార్థులకు డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల వేరే ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తుందన్నారు. అన్ని వసతులు గల దోమకొండలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజల చిరకాల వాంచను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే డిగ్రీ ...

Read More »

పాఠశాల తనిఖీ చేసిన ఎంపిడివో

  నిజాంసాగర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపిడివో రాములు నాయక్‌, ఎంపిపి సునంద గంగారెడ్డిలు గురువారం తనికీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం స్వయంగా తినిపరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యాబోధన సరిగా జరుగుతుందో లేదో అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ...

Read More »

ఆర్షగురుకులంలో వర్షేష్టి యాగం

  కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రం శివారులోని పాత రాజంపేటలోగల ఆర్ష గురుకులం, బ్రాహ్మ మహావిద్యాలయంలో గురువారం వర్షేష్టి యాగం నిర్వహించారు. జూన్‌ 29 నుంచి జూలై 9 వరకు ప్రతినిత్యం వర్షేస్టి యాగం నిర్వహిస్తున్నారు. ఆచార్య కిషోర్‌ వేదపఠనం చేశారు. పంటలు సస్యశ్యామలంగా ఉండాలని, వేద పండితుల చేత 11 రోజుల పాటు టన్ను ఆవునెయ్యి, రెండు టన్నుల వనమూలికలతో వేదమంత్రాల ఘోష మధ్య ఆహుతుల నడుమ యాగం చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలు ...

Read More »

ఘనంగా శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జయంతి

  కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు, విద్యావేత్త శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జయంతి వేడుకలను గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌ మాట్లాడుతూ కోల్‌కతాలో 1901లో శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జన్మించారన్నారు. న్యాయవాదిగా కలకత్తా విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేశారని, ఐఎన్‌సి పక్షాన బెంగాల్‌ శాసనమండలికి ఎన్నికై 1951లో భారతీయ జనసంఘ్‌ స్థాపించారన్నారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నీలం చిన్నరాజులు, నగర ...

Read More »

పిలుపుకోసం పడిగాపులు

  నిజాంసాగర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ ఆంధ్రాబ్యాంకులో నోట్ల కష్టాలు రోజురోజకు కొనసాగుతున్నాయి. వరి ధాన్యం విక్రయించి నెల, రెండునెలలు గడుస్తున్నా నేటికి రైతుల చేతికి డబ్బు అందడం లేదు. దీంతో ప్రస్తుత ఖరీఫ్‌ పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆంధ్రాబ్యాంకు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకు వద్ద డబ్బుకోసం వచ్చే రైతుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో బ్యాంకు అధికారులు పాస్‌ పుస్తకాలను వరుసలో పెట్టుకొని అదేప్రకారంగా పేరు పిలుస్తారన్న ఆశతో సాయంత్రం వరకు ...

Read More »

రెండు గ్రామాల్లో గ్రామసభలు

  నిజాంసాగర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి, బూర్గుల్‌ గ్రామాల్లో గ్రామ పంచాయతీ గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయాలను కార్యదర్శులు రఘుపతిరెడ్డి, క్యాసప్పలు చదివి వినిపించారు. అనంతరం సర్పంచ్‌ బత్తుల రమ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హరితహారం పథకం కింద మొక్కలు నాటాలని సూచించారు. వ్యవసాయ పొలం గట్లు, అటవీ ప్రాంతంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, శ్మశాన వాటికల్లో మొక్కలు నాటి సంరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలకు ...

Read More »

తహసీల్‌ కార్యాలయంలో ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీలే

  నిజాంసాగర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ తహసీల్‌ కార్యాలయంలో ముఖ్యమైన పోస్టులన్ని ఖాళీగా ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్‌ 30వ తేదీన తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన సయ్యద్‌ అబ్దుల్‌ గనిఖాన్‌ పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో రెగ్యులర్‌ తహసీల్దార్‌ను నియమించకుండా పిట్లం మండల తహసీల్దార్‌ నర్సింగ్‌రావును ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. నయాబ్‌ తహసీల్దార్‌గా పనిచేసిన సయ్యద్‌ హైమద్‌ మస్రూద్‌ ఇటీవలే పదోన్నతిపై ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో డిఎవోగా బదిలీపై వెళ్ళారు. ...

Read More »